ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

ప్రపంచంలో ఎక్కువ ప్రసిద్ధి చెందిన కార్లలో రోల్స్ రాయిస్ ఒకటి. దీని యొక్క ధర అధిక మొత్తంలో ఉంటుంది. ఇంత ఖరీదైన వాహనాల యొక్క వార్షిక అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం!

ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కార్లు మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. ఇది గత సంవత్సరం దాదాపు 5,152 వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం కంటే కూడా 1,045 యూనిట్లను ఎక్కువ సాధించింది.

ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

లగ్జరీ ఆటో మొబైల్ తయారీ దారు అయిన రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లిమిటెడ్ గత ఏడాది మొత్తం 116 సంవత్సరాల చరిత్రలో అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. బిఎమ్‌డబ్ల్యూ అనుబంధ సంస్థ అయినా ఈ రోల్స్ రాయిస్ 2019 లో దాదాపు 50 దేశాలలో 5,152 కార్లను వినియోగంలోకి అందించగలిగింది. 2018 ఉన్న 4,107 యూనిట్ల రికార్డు కంటే 25% ఎక్కువ వృద్ధి చెందినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

రోల్స్ రాయిస్ యొక్క ఫలితాలపై రాయిస్ సిఇఒ టోర్స్టన్ ముల్లెర్-ఓట్వోస్ మాటాడుతూ ఈ కార్లు యొక్క పనితీరు మునుపటి అమ్మకాలకంటే కొంత ఎక్కువగా ఉన్నాయి అన్నారు. ఈ సంవత్సరం అద్భుతమైన వార్షిక ఫలితాలు అందినందుకు సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే 2019 లో 25% ఎక్కువ వృద్ధిని సాధించినందుకు అని స్పష్టం చేసారు.

ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

తయారీదారు యొక్క లగ్జరీ ఎస్‌యూవీ కుల్లినన్ మొత్తం అమ్మకాలకు పెద్ద సహకారం అందించింది. టోర్స్టన్ ముల్లెర్-ఓట్వోస్ ఇంకా రోల్స్ రాయిస్ ఎస్‌యూవీకి గత సంవత్సరం ప్రపంచవ్యాప్త ఉన్న డిమాండ్ లో ఈ విజయాన్ని సాధించింది మరియు 2020 లో స్థిరీకరించబడుతుందని భావిస్తున్నాము. మా ఉత్పత్తుల నాణ్యత మరియు సమగ్రతకు మా వినియోగదారుల విశ్వాసం మరియు అభిరుచికి ఇదే నిదర్శనం అని చెప్పారు.

ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఆటోమొబైల్ పరిశ్రమలో లగ్జరీ యొక్క పరాకాష్టగా పరిగణించబడుతుంది. రోల్స్ రాయిస్ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తిగా ఈ కారు నిలిచింది. మొత్తం అమ్మకాలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసిన ప్రాంతం ఉత్తర అమెరికా. ఇది చైనా మరియు ఐరోపా తరువాత ప్రపంచ అమ్మకాలలో మూడోవంతు స్థానాన్ని సాధించింది. రోల్స్ రాయిస్ లగ్జరీ వాహన తయారీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 50 కి పైగా దేశాలలో దాదాపు135 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది.

ఇప్పుడే చూడండి...రోల్స్ రాయిస్ యొక్క వార్షిక అమ్మకాలు ఇవే!

భారతదేశంలో రోల్స్ రాయిస్ పొందాలనుకుంటే కనీసం రూ .6.07 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఈ మొత్తం ధర చెల్లించి వాహనాన్ని పొందినట్లైతే దేశంలో ఒక గర్వించదగ్గ వాహనానికి యజమాని కావచ్చు. ఈ వాహనము చూడటానికి చాల ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వినియోగదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

Read More:అవతార్ సినిమా కాన్సెప్ట్ తో వస్తున్న కొత్త మెర్సిడెస్ ఎవిటిఆర్ బెంజ్!

Most Read Articles

English summary
Rolls Royce Records Highest Ever Annual Sales In 116 Years-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X