సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చిన సల్మాన్ ఖాన్

సినిమా రంగంలో బాగా ప్రసిద్ధి చెందిన సల్మాన్ ఖాన్ ఆటో మొబైల్ ఔత్సాహికుడు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చిన చాలా ఖరీదైన వాహనాలను కొంటూ ఉంటాడు. ఇతడు అనేక హై-డిస్‌ప్లేస్‌మెంట్ బైక్‌లతో పాటు హై-ఎండ్ కార్లు కూడా కలిగి ఉన్నాడు. సాధారణంగా సల్మాన్ ఖాన్ తన స్నేహితులకు మరియు కుటుంబ సబ్యులకు కృతజ్ఞతను మరియు ప్రేమను చూపడానికి కార్లను బహుమతిగా ఇస్తూ ఉంటాడు. తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ తన సహ నటుడు అయిన సుదీప్ కి ఎం 5 బిఎమ్‌డబ్ల్యూ కారు ని బహుమతిగా ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ తన సహ నటుడికి ఇంత ఖరీదైన వాహనాన్ని ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చాడు అనే విషయం గురించి మరింత తెలుసుకుందాం!

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

సుదీప్ కి బహుమతిగా అందించిన బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 కారు గతేడాది భారత మార్కెట్లో లాంచ్ చేయబడింది. దీని ధర దాదాపుగా 1.55 కోట్లు. ఎక్స్-షోరూమ్ మరియు ఆన్ రోడ్ ప్రైజ్ 1.85 కోట్ల రూపాయలుగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో లభించే ఏకైక బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 వేరియంట్ ఇదే. ఈ కారు భారతదేశంలో అవసరానికి అనుగుణంగా దిగుమతి అవుతుంది.

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

ఎం 5 అధిక-పనితీరు గల సెడాన్, ఇది సాధారణ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌తో పోల్చినప్పుడు చాలా దూకుడుగా మరియు స్పోర్టిగా కనిపిస్తుంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్, ఓఆర్విఎమ్ లు సైడ్ ఎయిర్ వెంట్స్, రియర్ డిఫ్యూజర్ మరియు స్పోర్టి స్పాయిలర్ పై గ్లోస్-బ్లాక్ సహా ఈ కారు అనేక మార్పులను పొందుతుంది.

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

ఈ కారుకు టెయిల్‌గేట్‌లో ఎం సిరీస్ ట్విన్-ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు ఎం-5 కాంపిటీషన్ బ్యాడ్జ్ కూడా లభిస్తాయి. ఎం-5 అధిక బలం కలిగిన కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ రూఫ్‌ను కూడా పొందుతుంది. ఈ ప్రత్యేకత ఎం-5 యొక్క ఈ వెర్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇతర దూకుడు భాగాలలో సైడ్-స్కర్ట్, ఫ్రంట్ బంపర్ మరియు రియర్ బంపర్లు ఉన్నాయి.

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

ఇది అధిక-పనితీరు గల వి8 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది భారీగా 625 పిఎస్ మరియు 750 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారుకు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0-100 కిమీ పరిధిని అందించగలదు. 4డబ్ల్యూడి, 4డబ్ల్యూడి స్పోర్ట్ మరియు RWD వంటి మోడ్‌లను అందించే M XDrive సిస్టమ్‌లు ఇందులో ఉంటాయి. ఇందులోని రేర్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ని పూర్తిగా విడదీస్తుంది.

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ సినిమా దబాంగ్ 3 డిసెంబర్ 230 న విడుదలైంది. ఈ మూవీ దాదాపుగా 137 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భారీ మొత్తంలో వసూలు చేసిన చిత్రాలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. దబాంగ్ -3 మూవీలో విలన్ పాత్ర పోషించిన సుదీప్ దక్షిణ భారత సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన నటుడు. కానీ సల్మాన్ ఖాన్ మూవీలో సుదీప్ విలన్ గా చేసాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ మునుపటి రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉంది.

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

చలన చిత్ర పరిశ్రమలో భారీ కలెక్షన్లు తెచ్చిన మూవీలలో దబాంగ్ 3 ఒకటిగా నిలిచింది. ఈ విధంగా నిలవడానికి సుదీప్ సహకారం కూడా ఎంతగానో ఉంది. దీనికి కృతజ్ఞతగా సల్మాన్ ఖాన్ సుదీప్ కి బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు.

Read More:ఇప్పుడే చూడండి...కొత్త లుక్ తో రాబోతున్న మారుతి సుజుకి 800

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ తన సహనటుడికి అంత విలువైన కారుని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇంకా తన విలువైన ఒక జాకెట్ ని కూడా సుదీప్ కి ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఈ జాకెట్ మీద పెల్ పెయింట్ ఉంది. సల్మాన్ ఖాన్ ఇతర విలువైన వస్తువులను చాలామందికి బహుమతులుగా కూడా ఇచ్చాడు. ఇతడు కత్రినా కైఫ్ కి ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ని, సల్మాన్ ఖాన్ తల్లికి లాంగ్ వీల్ బేస్ వెర్షన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.

Read More:వాహన ప్రియులకు శుభవార్త...లాంచ్ డేట్ ని ధ్రువీకరించిన బజాజ్ చేతక్!

సుదీప్‌కు బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ తనకి ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ ఎం 5 స్పోర్ట్స్ కార్‌ను బహుమతిగా ఇచ్చాడని సుదీప్ ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. అందులో కొన్నో ఫొటోస్ ని కూడా షేర్ చేయడం జరిగింది.

Read More:గుడ్ న్యూస్...త్వరలో మార్కెట్లోకి రానున్న ఎథెర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్!

Most Read Articles

English summary
Salman Khan gifts Dabangg-3 co-actor Sudeep a Rs 1.85 crore BMW M5 sportscar-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X