కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

ప్రముఖ చమురు సంస్థ షెల్ లూబ్రికెంట్స్ బెంగుళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిట్‌స్టాప్‌తో చేతులు కలిపి ఓ సరికొత్త జీరో-కాంటాక్ట్ డోర్‌స్టెప్ వెహికల్ సర్వీసింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్-19 భయానక పరిస్థితుల నేపథ్యంలో వాహన వినియోగదారులు ఆయిల్ ఛేంజ్ కోసం గంటల తరబడి షోరూమ్‌ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నేరుగా కస్టమర్ ఇంటి నుంచే వాహనాన్ని పికప్ చేసుకొని సర్వీస్ అనంతరం నేరుగా కస్టమర్ ఇంటి వద్దకే వాహనాన్ని చేర్చే విధంగా కొత్త ప్రణాళితో షెల్-పిట్‌స్టాప్ కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి.

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

వాహనాల మెయింటినెన్స్‌లో భాగంగా మార్చాల్సిన అనేక రకాల ఫ్లూయిడ్స్‌ను షెల్ లూబ్రికెంట్స్ ఆఫర్ చేస్తోంది. ఇక పిట్‌స్టాప్ కూడా కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే ఆయిల్ ఛేంజ్ సేవలు అందించేలా మొబైల్ సర్వీసింగ్ ఆప్షన్లను అందిస్తోంది. ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తూ కస్టమర్ల వాహనాల ఆయిల్ ఛేంజ్ అనుభూతిని మరింత సులభతరం చేస్తున్నాయి.

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

ఈ కొత్త సర్వీస్ వలన వాహన మెయింటినెన్స్ సమయంలో కస్టమర్లు మరియు మెకానిక్‌లు అతి తక్కువగా బయటి వాతావరణంలో ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి భయం ఉండదు. కోవిడ్-19 కారణంగా దాదాపు 3 నెలలుగా జీవనోపాధి కోల్పోయిన మెకానిక్‌లకు ఈ కొత్త సర్వీస్ స్కీమ్ కొత్తగా ఉపాధి అవకాశాలను కల్పించనుంది.

MOST READ: మారుతి కార్లపై లాక్‌డౌన్ ఎఫెక్ట్; భారీ నష్టం!

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

కస్టమర్ల ఇంటి వద్దకే వాహన మెయింటెన్స్ సేవలు అందించే ఈ కొత్త భాగస్వామ్యంలో భాగంగా, సుమారు 500 సర్వీస్ వ్యాన్లు నిత్యం నగరాల్లో సంచరిస్తూ కస్టమర్ల అవసరాలను తీర్చనున్నాయి. ఈ వాహనాలను నిపుణులైన మెకానిక్‌లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వాహనాల్లో కార్ల మెయింటినెన్స్‌కు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

ప్రారంభ దశలో భాగంగా ఈ సేవలను తొలుతగా 20 ప్రధాన నగరాల్లో ఆఫర్ చేయనున్నారు. ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, పూనే మరియు హైదరాబాద్‌లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ వాహనాలను నిర్వహించే మెకానిక్‌లు అందరూ కూడా పూర్తిగా శిక్షణ పొందబడి ఉంటారు మరియు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పిపిఈ కిట్లతో పాటుగా అన్ని రకాల భద్రతా పరికరాలను ధరిస్తారు.

MOST READ: ఒకే ఫ్యామిలీ నాలుగు తరాలుగా ఉపయోగిస్తున్న సైకిల్

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్‌ను కావాలనుకునే కస్టమర్లు యాప్ స్టోర్ నుంచి పిట్‌స్టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కస్టమర్లు తమ వాహనాన్ని ఏ రోజు, ఏ సమయంలో సర్వీస్ చేయాలనే విషయాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

ఇలా ఒకసారి వాహన మెయింటినెన్స్ తేదీ, సమయాన్ని బుక్ చేసుకున్న తర్వాత సదరు కస్టమర్‌కు పిట్‌స్టాప్ కంపెనీ ఓ మెకానిక్ వెహికల్‌తో కనెక్ట్ చేస్తుంది. సదరు మెకానిక్ కస్టమరును సంప్రదించి, వివరాలను తెలుసుకొని కస్టమర్ ఇంటి వద్దే మెయింటినెన్స్ చేయటం జరుగుతుంది. ఈ సర్వీస్‌కి సంబంధిచిన చెల్లింపులను కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు.

MOST READ: దేశవ్యాప్తంగా 100 నగరాల్లో సర్వీస్ స్టార్ట్ చేసిన రాపిడో

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

ఈ పార్ట్‌నర్‌షిప్ సందర్భంగా షెల్ లూబ్రికెంట్స్ ఇండియా హెడ్ రామ్ ఓజా మాట్లాడుతూ.. కోవిడ్-19 తర్వాత దేశంలో పరిస్థితులు తారుమారు అయ్యాయని, మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగానే సురక్షితమైన పద్దతిలో మరియు వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన రీతిలో వాహన మెయింటినెన్స్ సేవలు అందించేందుకు ఈ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చామని, వినియోగదారులు తమపై నిస్సందేహంగా భరోసా ఉంచవచ్చని అన్నారు.

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

కాగా.. పిట్‌స్టాప్ ఫౌండర్ మరియు సీఈఓ ఈ పార్ట్‌నర్‌షిప్‌పై స్పందిస్తూ.. తమ లూబ్రికెంట్ పార్ట్‌నర్‌గా షెల్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని, ఇటువంటి కష్ట కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు.

కస్టమర్ల కోసం షెల్ డోర్‌స్టెప్ వెహికల్ మెయింటినెన్స్ సర్వీస్

షెల్ - పిట్‌స్టాప్ ఒప్పందంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 తర్వాత దేశపు ఆటోమొబైల్ రంగంలో అనేక కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా డిజిటల్ మార్గంలో తమ వినియోగదారులకు సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇవి కస్టమర్లకు మరింత సౌకర్యంగా మరియు సురక్షితంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో షెల్-పిట్‌స్టాప్ నుంచి వచ్చిన ఈ కొత్త వెహికల్ మెయింటినెన్స్ స్కీమ్ కూడా కస్టమర్లు కంఫర్ట్‌తో పాటు కరోనా సేఫ్టీని కూడా అందిస్తోంది.

Most Read Articles

English summary
Shell Lubricants has partnered with a Bengaluru-based start-up, Pitstop to enable zero-contact doorstep servicing of vehicles for its consumers. Both brands aim to provide safe and hassle-free vehicle maintenance at the customer's doorstep during the Covid-19 times in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X