Just In
- 34 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 53 min ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 2 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
మరో'సారీ': యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్, TCS ఆనందం కాసేపు
- News
సుప్రీం తీర్పుతో వేగంగా నిమ్మగడ్డ అడుగులు- మారిన షెడ్యూల్- కేంద్ర సిబ్బందికి వినతి
- Sports
ఆసీస్ పర్యటనలో నా విజయ రహస్యం ఇదే: మహ్మద్ సిరాజ్
- Lifestyle
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా 'ఎన్యాక్ ఐవి' పేరుతో ఓ సరికొత్త ఎల్క్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి కొన్ని ఎక్స్టీరియర్ డిజైన్ స్కెచెస్‌ను కూడా విడుదల చేసింది.

తాజాగా, ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్‌ను వెల్లడించే స్కెచ్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇప్పటికే యూరోపియన్ రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1, 2020 వే తేదీన ప్రేగ్లో స్కొడా ఎన్యాక్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త స్కొడా ఎన్యాక్ ఐవి బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ అవుతుందని, త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకోనుంది. స్కొడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని దాని అనుబంధ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఎమ్ఈబి ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయనున్నారు.
MOST READ: మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

యాంత్రికంగా, స్కొడా ఎన్యాక్ ఐవి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 55 కిలోవాట్, 62 కిలోవాట్ లేదా 72 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. బేస్ ‘55 కిలోవాట్' ఎలక్ట్రిక్ మోటార్ 146 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 340 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

మిడ్-స్పెక్ ‘62 కిలోవాట్' ఎలక్ట్రిక్ మోటార్ 177 బిహెచ్పి శక్తిని, 390 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇకపోతే, టాప్-స్పెక్ 72 కిలోవాట్ మోటార్ 201 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.
MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

టాప్-స్పెక్ 72 కిలోవాట్ మోడల్లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, వీటని రెండు యాక్సిల్స్‌లో అమర్చబడి ఉంటాయి. ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అయితే, బేస్ మరియు మిడ్-స్పెక్ వేరియంట్లలో మాత్రం ఎలక్ట్రిక్ మోటార్లను వెనుక భాగంలో అమర్చబడి ఉంటాయి, ఇవి రియర్-వీల్-డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తాయి.

స్కొడా ఎన్యాక్ ఐవి ఎస్‌యూవీలను స్టాండర్డ్ 50 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. కాగా, కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 125 కిలోవాట్ ఛార్జర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. దీని సాయంతో కేవలం ఒక గంట వ్యవధిలోనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 0 - 100 శాతం నుండి ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇంటీరియర్స్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
స్కొడా ఎన్యాక్ ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ. పేరుకు తగినట్లుగానే ఇది పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.4 ఎలక్ట్రిక్ మోడల్లో ఉపయోగించిన అనేక విడిభాగాలను ఎన్యాక్లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. స్కొడా తమ ఎన్యాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో కూడా విడుదల చేస్తుందని అంచనా.