Just In
- 1 hr ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 3 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Lifestyle
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Sports
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కొడా ఫ్యాబియాలో లేటెస్ట్ జనరేషన్ మోడల్; ఇది భారత్‌కు వచ్చేనా?
మీకు స్కొడా ఫ్యాబియా గుర్తుందా? చెక్ రిపబ్లిక్కు చెందిన కార్ కంపెనీ తమ మొదటి తరం ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా 2008లో మార్కెట్లో విడుదల చేసింది. ఆరంభం నుండి కూడా ఈ కారు స్కొడాకు అమ్మకాల పరంగా మంచి విజయాలను తెచ్చిపెట్టింది.

అయితే, ఇటీవలి కాలంలో భారత స్మాల్ కార్ మార్కెట్లో పెరిగిన పోటీని తట్టుకోవటం స్కొడా ఫ్యాబియా విజయవంతం కాలేకపోయింది. ఫ్యాబియా అమ్మకాలను పెంచేందుకు కంపెనీ ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫ్యాబియా అమ్మకాలు భారీగా క్షీణించడంతో స్కొడా భారత మార్కెట్లో ఫ్యాబియా మోడల్‌ను నిలిపివేసింది.

కాగా.. తాజాగా గాడివాడి నుండి వచ్చిన నివేదిక ప్రకారం, స్కొడా ఆటో తమ నాల్గవ తరం ఫ్యాబియాను యూరప్ వంటి మార్కెట్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త తరం 2021 స్కొడా ఫ్యాబియా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత ఇది భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
MOST READ:మహీంద్రా లాంచ్ చేసిన 210 అనివెర్సరీ స్పెషల్ ఎడిషన్ : ప్యూజో 125 స్కూటర్

ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ మార్కెట్ పరిమాణం విస్తృతంగా పెరిగుతోంది. కొత్త మోడళ్ల రాకతో పాటుగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. కొత్త 2021 స్కొడా ఫ్యాబియా కూడా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రావచ్చని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్, మారుతి సుజుకి బాలెనో, టొయోటా గ్లాంజా వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

స్కొడా తమ ఆక్టేవియా మోడల్లో తేలికపాటి-హైబ్రిడ్ 1.0-లీటర్ టిడిఐ ఇవో ఈ-టెక్ ఇంజన్‌ను ఉపయోగిస్తోంది. ఈ ఇంజన్ 110 పిఎస్ పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్‌ను కొత్త తరం ఫ్యాబియాలో కూడా ఉపయోగించవచ్చని సమాచారం. ఇకపోతే, ఇందులో 1.5-లీటర్ టిఎస్ఐ ఇవో ఈ-టెక్ పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉండనుంది. ఈ ఇంజన్ 150 పిఎస్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. ఈ బస్సులకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు

అయితే, నాల్గవ తరం స్కొడా ఫ్యాబియాలోని 1.0-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ యూనిట్‌ను విభిన్నమైన ట్యూనింగ్‌లో వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది 48 వి లి-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.

ఫ్యాబియా హుడ్ కింద, సరికొత్త 48వి తేలికపాటి-హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుందని అంచనా. ఇది ఆక్టేవియాలో కనిపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఆక్టేవియా 1.0-లీటర్ టిడిఐ ఇవో ఈ-టెక్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:హ్యుందాయ్ క్రెటాలో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

స్కొడా బ్రాండ్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ కొత్త రాపిడ్ సెడాన్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.9.49 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. ఇది రైడర్ ప్లస్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది.

కొత్త స్కొడా రాపిడ్ టిఎస్ఐ ఆటోమేటిక్ మోడల్లో అదే 999సిసి త్రీ సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:రోల్స్ రాయిస్ నుంచి రానున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ విమానం ఇదే.. చూసారా !

స్కొడా ఫ్యాబియా ఇండియా రాకపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
స్కొడా ఫ్యాబియా నిజానికి ఓ అద్భుతమైన హ్యాచ్‌బ్యాక్, ఇది భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత చాలా ప్రశంసలు అందుకుంది. ఈ కొత్త తరం స్కొడా ఫ్యాబియా భారత మార్కెట్‌కు రావాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం.