Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కొడా కస్టమర్ల కోసం కాంటాక్ట్‌లెస్ ప్రోగ్రామ్ - వివరాలు
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఈ సదుపాయం ద్వారా కస్టమర్లు స్కొడా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ అభిమాన స్కొడా కారును బుక్ చేసుకోవచ్చు. ఈ విధానానికి దేశవ్యాప్తంగా వినియోగదారుల నుండి అధిక స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో, స్కొడా ఇండియా తమ కాంటాక్ట్‌లెస్ సేవల పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉత్పత్తికి సంబంధించిన సంప్రదింపులు మరియు ప్రదర్శనలు అన్నీ కాంటాక్ట్‌లెస్ రూపంలో ప్రత్యక్షంగా, కస్టమర్లను సంప్రదించకుండానే నిర్వహించనున్నారు.

మరోవైపు, స్కొడా టెస్ట్ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోంది, ఈ టెస్ట్ డ్రైవ్‌లను కూడా కస్టమర్ ఇంటి వద్దనే అందిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులు కోవిడ్-19 మహమ్మారి బారిన పడకుండా ఉంటారని, షోరూమ్‌లను సందర్శించి సామాజిక దూర ప్రమాణాలను పాటించాల్సిన అవసరం కూడా ఉండదని కంపెనీ చెబుతోంది.
MOST READ:పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

ఈ విషయంపై స్కొడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, "మా వినియోగదారులతో కనెక్ట్ అవ్వడానికి మరియు రాజీపడని సేల్స్ అండ్ సర్వీస్ అనుభవాన్ని అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలనే మా నిబద్ధతకు స్కొడా ఆటో కాంటాక్ట్‌లెస్ ప్రోగ్రామ్ సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తాజాగా తీసుకొచ్చిన ప్రణాళికతో కస్టమర్లు వారి ఇంటి నుంచే మా ఉత్పత్తులను అన్వేషించడం, టెస్ట్ డ్రైవ్ చేసి వాటిని ఆస్వాదించడం చేయవచ్చ"ని అన్నారు.

మరి అయితే, ఈ కొత్త ప్రణాళిక ఎలా పని చేస్తుంది? ఇందు కోసం కస్టమర్లు స్కొడా అధికారిక వెబ్‌సైట్‌లో సైన్ అప్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత వారు ప్రత్యక్ష సంప్రదింపులు మరియు వర్చువల్ ప్రోడక్ట్ డిస్‌ప్లే కోసం వారి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు లేదా పర్సనల్ కంప్యూటర్‌లకు ఓ వీడియో కాల్ లింక్‌ను పంపడం జరుగుతుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా స్కొడా సేల్స్ అసోసియేట్ కస్టమర్లకు ఎండ్-టూ-ఎండ్ సొల్యూషన్‌ను అందిస్తారు. ఈ ఫీచర్ దేశవ్యాప్తంగా 80కి పైగా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
MOST READ:ఒక నెలరోజుల తరువాత పట్టుబడ్డ లంబోర్ఘిని సూపర్ కార్ : ఎలాగో తెలుసా !

సరికొత్త మైస్కొడా మొబైల్ యాప్ సాయంతో కంపెనీ ఇప్పటికే తమ ప్రస్తుత లేదా భవిష్యత్ కస్టమర్ల కోసం వన్-ఆన్-వన్ ఇంటరాక్షన్స్‌ను నిర్వహిస్తోంది. ఈ యాప్ సాయంతో కస్టమర్లు తమకు సమీపంలోని డీలర్‌షిప్ సదుపాయాన్ని గుర్తించడం, సర్వీస్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవటం, సర్వీస్ హిస్టరీని యాక్సెస్ చేసుకోవటం, కాస్ట్ కాలిక్యులేటర్, యాక్సెసరీస్ షాప్ మరియు ఐటెమైజ్డ్ బిల్లింగ్ రికార్డ్ వంటి వివరాలను తెలుసుకోవటం చేయవచ్చు.

స్కొడా బ్రాండ్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, సరికొత్త తరం స్కొడా ఆక్టావియా సెడాన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మోడల్‌ను పూణే శివార్లలో కంపెనీ టెస్టింగ్ చేస్తోంది. మన దేశంలో ఈ సెడాన్ టెస్టింగ్‌ను గుర్తించడం ఇదే మొదటిసారి. కొత్త స్కొడా ఆక్టావియా 148 బిహెచ్‌పి 1.5-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ మరియు 188 బిహెచ్‌పి 2.0 లీటర్ టిఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభించవచ్చని తెలుస్తోంది.
MOST READ:మేడ్-ఇన్-ఇండియా సైకిల్ పై బ్రిటీష్ పిఎం బోరిస్ జాన్సన్

స్కొడా కాంటాక్ట్‌లెస్ ప్రోగ్రామ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం
ఈ కాంటాక్ట్‌లెస్ ప్రోగ్రామ్ ద్వారా స్కొడా ఇండియా తమ కస్టమర్ల జీవితాలను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతానికి, కస్టమర్లు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, ఒక బటన్ క్లిక్‌తో వారు స్కొడా కార్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు మరియు అదే సమయంలో సామాజిక దూరాన్ని కొనసాగించవచ్చు.