భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో భారత మార్కెట్ కోసం షెడ్యూల్ చేసిన 'స్కొడా కొడియాక్' బిఎస్6 ఎస్‌యూవీ విడుదల మరింత ఆలస్యం అయింది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ బిఎస్6 ఎస్‌యూవీ వచ్చే ఏడాదిలో ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

బిఎస్6 వెర్షన్ స్కొడా కొడియాక్‌లో టిఎస్‌ఐ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇదే ఇంజన్ ప్రస్తుతం స్కొడా బ్రాండ్ లైనప్‌లోని ఇతర మోడళ్లలో కూడా వినియోగిస్తున్నారు. స్కొడా కొడియాక్ టిఎస్‌ఐ ఎస్‌యూవీని తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు.

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

తాజా నివేదికల ప్రకారం, స్కొడా ఆటో 2021లో తమ పెట్రోల్ వెర్షన్ కొడియాక్‌‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని స్కొడా ఆటో ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తన ట్వీట్టర్ ఖాతాలో వెల్లడించారు.

MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

వాస్తవానికి ఈ ఏడాది చివరి నాటికి ఎప్పుడైనా ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి వస్తుందని భావించారు. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి మరియు వరుస లాక్‌డౌన్‌ల కారణంగా సప్లయ్ చైన్ నిర్వహణలో పెద్ద ఆలస్యం జరిగింది. ఈ కారు అసెంబ్లింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే అంశాల్లో ఇది కీలకమైనది కావటంతో ఆలస్యమైనట్లుగా తెలుస్తోంది.

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

స్కొడా కొడియాక్‌ టిఎస్‌ఐ విషయానికి వస్తే, ఇది చూడటానికి మునుపటి బిఎస్4 మోడల్‌ మాదిరిగానే అనిపిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఈ రెండు మోడళ్లకు చాలా పోలికలు ఉంటాయి. అయితే, ఇందులో అతిపెద్ద మార్పు బోనెట్ కింద చేయబడుతుంది, అంటే ఇది సరికొత్త ఇంజన్‌తో రాబోతోంది.

MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

స్కొడా కొడియాక్‌ బిఎస్6 ఎస్‌యూవీలో 2.0-లీటర్ టిఎస్‌ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇదే సెటప్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

ఈ ఇంజన్ 4200 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 188 బిహెచ్‌పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఈ మోడల్‌లో నిలిపివేసిన 2.0-లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌ 148 బిహెచ్‌పి మరియు 340 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసేది. దానితో పోలిస్తే, ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ అధికంగా 30 బిహెచ్‌పి శక్తిని మరియు 20 ఎన్ఎమ్ తక్కువ టార్క్‌ని కలిగి ఉంటుంది.

MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

దేశంలోని ఇతర తయారీదారుల మాదిరిగానే, భారత్‌లో బిఎస్6 ఉద్గారాలు అప్‌డేట్ అయిన తర్వాత స్కొడా కూడా డీజిల్ వాహనాలను తగ్గించి, పెట్రోల్ వాహనాలను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. అయితే, దేశంలో డీజిల్ కార్లకు గిరాకీ పెరిగితే, తిరిగి డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టే ఆస్కారం ఉందని కంపెనీ అధికారులు ధృవీకరించారు.

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

కొత్త స్కొడా కొడియాక్‌ బిఎస్6 దాని సొగసైన డిజైన్ మరియు బిఎస్4 మోడల్‌లోని లగ్జరీ ఫీచర్లను అలానే నిలుపుకుంటుంది. ఇందులో యాంబియంట్ లైటింగ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, వెంటిలేటెడ్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో హిల్-హోల్డ్ మరియు డీసెంట్ కంట్రోల్, ఇడిఎస్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, తొమ్మిది ఎయిర్‌బ్యాగులు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

స్కొడా కొడియాక్‌ ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్, ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా అల్ట్యురాస్ జి4 మరియు త్వరలో రాబోయే ఎమ్‌జి గ్లోస్టర్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. స్కొడా తమ బిఎస్4 కొడియాక్‌ ప్రైజ్ బ్రాకెట్‌లోనే కొత్త బిఎస్6 వెర్షన్‌ను కూడా విడుదల చేయవచ్చని అంచనా.

భారత్‌కు స్కొడా కొడియాక్ బిఎస్6 ఎస్‌యూవీ రాక ఆలస్యం; 2021లో విడుదల!

స్కొడా కొడియాక్ టిఎస్ఐ విడుదల ఆలస్యంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి ప్రధానంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా తయారీ ప్రక్రియలో పెద్ద జాప్యం జరిగింది. అయితే, ఇప్పుడిప్పుడే వాహన తయారీదారులు తమ వాహన ఉత్పత్తిలో సాధారణ స్థితికి చేరుకుంటున్నారు, త్వరలో పరిస్థితులు మునపటిలా మారుతాయనే ఆశాభావంతో ఉన్నారు.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
The Skoda Kodiaq BS6 SUV launch in the Indian market has been delayed. The BS6 SUV will come equipped with a TSI engine, that is currently powering other models in the brand's line-up. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X