YouTube

36 లక్షల ధరతో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 విడుదల: ఇంత రేటు ఎందుకో తెలుసుకోవాల్సిందే!

ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2020లో స్కోడా కంపెనీ సరికొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 కారును విడుదల చేసింది. 2020 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 పవర్‌ఫుల్ లగ్జరీ సెడాన్ కారు ధర రూ. 36 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా). కేవలం 200 యూనిట్లను మాత్రమే ఇండియాలో విక్రయిస్తున్నట్లు స్కోడా ఆటో ప్రకటించింది. అత్యంత అరుదుగా కేవలం 200 మంది కస్టమర్లకే విక్రయించే దీని ప్రత్యేకతలేంటో చూద్దాం రండి...

36 లక్షల ధరతో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 విడుదల: ఇంత రేటు ఎందుకో తెలుసుకోవాల్సిందే!

స్కోడా ఆటో ఇండియా ఆక్టావియా ఆర్ఎస్245 కారును కంప్లిట్లీ బిల్ట్ యూనిట్ (CBU) ద్వారా దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయించనున్నారు. స్కోడా ఆక్టావియా పర్ఫామెన్స్ వెర్షన్ అట్రాక్టివ్ స్టైలిష్ ఎలిమెంట్లతో వచ్చింది.

36 లక్షల ధరతో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 విడుదల: ఇంత రేటు ఎందుకో తెలుసుకోవాల్సిందే!

ఫ్రంట్ డిజైన్‌లో విశాలమైన ఎయిర్ ఇంటేకర్, ముందు వైపున స్పోర్టివ్ బంపర్, వెనుక వైపున డిఫ్యూజర్, అతి పెద్ద అల్లాయ్ వీల్స్, అతి తక్కువ గ్రౌండ్ క్లియెరన్స్ అదే విధంగా స్పోర్టివ్ ఫీలింగ్ ఇచ్చేందుకు ఆల్-బ్లాక్ క్యాబిన్ మరియు పర్ఫామెన్స్ టైర్లు వచ్చాయి.

36 లక్షల ధరతో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 విడుదల: ఇంత రేటు ఎందుకో తెలుసుకోవాల్సిందే!

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 ఇంటీరియర్‌లో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వర్చువల్-కాక్‌పిట్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, స్పోర్టివ్ సీట్లు మరియు అప్‌హోల్‌‌స్ట్రే మరియు పర్ఫామెన్స్ సెడాన్‌కు కావాల్సిన ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

36 లక్షల ధరతో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 విడుదల: ఇంత రేటు ఎందుకో తెలుసుకోవాల్సిందే!

సరికొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 పర్ఫామెన్స్ సెడాన్ కారులో అత్యంత శక్తివంతమైన 2.0-లీటర్ కెపాసిటీ గల టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ వచ్చింది. 7-స్పీడ్ డైరక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 242బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 6.6 సెకండ్లలోనే గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లు.

36 లక్షల ధరతో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245 విడుదల: ఇంత రేటు ఎందుకో తెలుసుకోవాల్సిందే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్ల విషయానికి వస్తే, నిజమైన కార్ ప్రేమికులు రెండు అంశాల పరంగా కార్లను ఎంచుకుంటారు. అందులో ఒకటి లగ్జరీ, మరొకటి పర్ఫామెన్స్. లగ్జరీ అంశాలతో కూడిన స్పోర్టివ్ కార్లను కోరుకునే కస్టమర్లకు కోసం స్కోడా ఇండియా ప్రత్యేకంగా ఆక్టావియా ఆర్ఎస్ 245 కారును దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. గతంలో కూడా పరిమిత సంఖ్యలో లాంచ్ చేసినప్పటికీ, హాట్ కేకుల్లా అన్ని కార్లు అమ్ముడయ్యాయి. దీంతో ఆర్ఎస్245 కారును మళ్లీ తీసుకొచ్చారు. ఇది మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, బీఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ మరియు జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Skoda Octavia RS 245 Launched At Rs 36 Lakh - Limited To Just 200 Units In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X