స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ స్కొడా ర్యాపిడ్‌లో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెస్టింగ్ వాహనం ఒకటి ఇటీవలే భారత రోడ్లపై ప్రత్యక్షమైంది.

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

పరీక్ష దశలో స్కొడా ర్యాపిడ్ సిఎన్‌జి స్పై చిత్రాలు దొరకటం ఇదే మొదటిసారి. ఆటోగ్రామ్ లీక్ చేసిన చిత్రాల ప్రకారం, ఓ సిఎన్‌జ్ గ్యాస్ స్టేషన్ వద్ద ఫిల్లింగ్ చేయించుకుంటున్న స్కొడా ర్యాపిడ్‌ని తమ కెమెరాలో బంధించారు. ఈ టెస్టింగ్ వాహనంపై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేదు మరియు దీనిపై తాత్కాలిక టెస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది.

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

అంతే కాకుండా, ఈ టెస్టింగ్ వాహనంలో డిజైన్ పరంగా కూడా ఎలాంటి మార్పులు లేవు. ఇవన్నీ గమనిస్తే, స్కొడా ఆటో నుండి రాబోయే కొత్త ర్యాపిడ్ సిఎన్‌జి సెడాన్‌లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇది చూడటానికి మొత్తం దాని పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది.

MOST READ:భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: మెర్సిడెస్ బెంజ్ EQC 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

కొత్త 2020 స్కొడా ర్యాపిడ్ సెడాన్ కేవలం ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో 1.0-లీటర్, త్రీ సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

సిఎన్‌జి వెర్షన్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో అందించాలని కంపెనీ చూస్తోంది. అయితే, సిఎన్‌జి వేరియంట్ పవర్, టార్క్ గణాంకాలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, సిఎన్‌జి వెర్షన్ పెట్రోల్ వెర్షన్ కన్నా అధిక మైలేజీని ఆఫర్ చేయనుంది.

MOST READ:కైనెటిక్ సఫర్ జంబో ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

ప్రస్తుతం మార్కెట్లో 2020 స్కొడా ర్యాపిడ్ ఆరు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. అవి: రైడర్, రైడర్ ప్లస్, అంబిషన్, ఒనిక్స్, స్టైల్ మరియు మోంట్ కార్లో. ఈ సెడాన్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్లయిన రైడర్ మరియు రైడర్ ప్లస్‌లలో కంపెనీ సిఎన్‌జి ఆప్షన్‌లను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. మార్కెట్లో స్కొడా ర్యాపిడ్ ధరలు రూ.7.49 లక్షల నుండి రూ.13.29 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉన్నాయి.

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

ఈ కారులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, ముదురు ఆకుపచ్చ-లేతరంగు గల విండోస్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు సెడాన్‌లోని ఫ్రంట్ గ్రిల్ మరియు విండో లైన్ వంటి వివిధ భాగాలపై క్రోమ్ గార్నిష్ ఉంటుంది.

MOST READ:ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

ఇంటీరియర్స్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ ఇచ్చే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్కఫ్ ప్లేట్స్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, క్రూయిజ్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

స్కొడా ర్యాపిడ్‌లోని భద్రతా ఫీచర్లను గమనిస్తే, ఇందులో బహుళ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇబిడి, రియర్‌వ్యూ కెమెరా మరియు సెన్సార్లు, బ్రేక్ అసిస్ట్, ఆటో-డిమ్మింగ్ ఇంటర్నల్ రియర్-వ్యూ మిర్రర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:బాలీవుడ్ నటి చేసిన పనికి ఆనందంలో మునిగిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఎం చేసిందో తెలుసా?

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో సిఎన్‌జి వెర్షన్ వస్తోందా..?

స్కొడా ర్యాపిడ్ సిఎన్‌జి వెర్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం మార్కెట్లో స్కొడా ర్యాపిడ్ సెడాన్ కేవలం ఒకే ఒక ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ర్యాపిడ్ అమ్మకాలను పెంచేందుకు ఇందులో కొత్త సిఎన్‌జి వేరియంట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ మరియు ఫోక్స్‌వ్యాగన్ వెంటోల వంటి మోడళ్లకు స్కొడా ర్యాపిడ్ పోటీగా నిలుస్తుంది. ఫ్యాక్టరీతో ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో రాబోయే ర్యాపిడ్ సెడాన్‌కు ఈ విభాగంలో ప్రస్తుతం ఎలాంటి పోటీ ఉండబోదు.

Source:Autogram

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Rapid CNG model has been spied testing for the first time ahead of launch in the country. The Rapid is currently the brand's entry-level sedan model, which could soon be offered with a factory-fitted CNG kit in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X