Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కొడా యన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ స్కెచెస్ విడుదల - వివరాలు
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఓ సరికొత్త ఎల్క్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. 'స్కొడా ఎన్యాక్ ఐవి' పేరుతో తయారవుతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

కొత్త స్కొడా ఎన్యాక్ ఐవి బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ అవుతుందని, త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1న ప్రేగ్లో తమ ఎన్యాక్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రదర్శించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

స్కొడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని దాని అనుబంధ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఎమ్ఈబి ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేయనున్నారు. ఇందులో వివిధ రకాల పవర్ట్రైన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. స్కొడా ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రోటోటైప్‌ల చిత్రాలను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఎన్యాక్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిజైన్ స్కెచ్లను కంపెనీ విడుదల చేసింది.

యాంత్రికంగా, స్కొడా ఎన్యాక్ ఐవి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 55 కిలోవాట్, 62 కిలోవాట్ లేదా 72 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. బేస్ ‘55 కిలోవాట్' ఎలక్ట్రిక్ మోటార్ 146 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 340 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

మిడ్-స్పెక్ ‘62 కిలోవాట్' ఎలక్ట్రిక్ మోటార్ 177 బిహెచ్పి శక్తిని, 390 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇకపోతే, టాప్-స్పెక్ 72 కిలోవాట్ మోటార్ 201 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.
MOST READ:కరోనా లాక్డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

టాప్-స్పెక్ 72 కిలోవాట్ మోడల్లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, వీటని రెండు యాక్సిల్స్‌లో అమర్చబడి ఉంటాయి. ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అయితే, బేస్ మరియు మిడ్-స్పెక్ వేరియంట్లలో మాత్రం ఎలక్ట్రిక్ మోటార్లను వెనుక భాగంలో అమర్చబడి ఉంటాయి, ఇవి రియర్-వీల్-డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తాయి.

స్కొడా ఎన్యాక్ ఐవి ఎస్‌యూవీలను స్టాండర్డ్ 50 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. కాగా, కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 125 కిలోవాట్ ఛార్జర్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. దీని సాయంతో కేవలం ఒక గంట వ్యవధిలోనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 0 - 100 శాతం నుండి ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
MOST READ:డస్టర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ టీజర్ లాంచ్ చేసిన రెనాల్ట్

స్కొడా ఎక్స్టీరియర్ డిజైన్ హెడ్ కార్ల్ న్యూహోల్డ్ మాట్లాడుతూ, "ఎన్యాక్ ఐవిను, మేము మళ్ళీ స్కాలా, కమిక్ మరియు కొత్త, నాల్గవ తరం ఆక్టేవియా మోడళ్లను వర్ణించే ఎమోటివ్ స్కొడా డిజైన్‌తో అభివృద్ధి చేశాము. ఎన్యాక్ ఐవి కారులో స్కల్ప్చరల్ లైన్స్ ఉంటాయి, ఇంకా ఇందులో బోహేమియన్ క్రిస్టల్ ఆర్ట్ నుండి ప్రేరణ పొందిన క్రిస్టల్లైన్ ఎలిమెంట్స్ మరియు క్లియర్ సర్ఫేస్లు ఉంటాయి. అయితే, దాని నిష్పత్తులు మా మునుపటి ఎస్యూవీ మోడళ్ల కంటే భిన్నంగా ఉంటాయి. ఎన్యాక్ ఐవి తక్కువ ఫ్రంట్ ఎండ్ మరియు పొడవైన రూఫ్ ఉంటుది. ఇది ఎస్‌యూవీకి మంచి డైనమిక్ రూపాన్ని అందిస్తుంది, చూడటానికి 'స్పేస్ షటిల్' అనేలా అనిపిస్తుందని" అన్నారు.

స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
స్కొడా ఎన్యాక్ ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ. పేరుకు తగినట్లుగానే ఇది పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ ఐడి.4 ఎలక్ట్రిక్ మోడల్లో ఉపయోగించిన అనేక విడిభాగాలను ఎన్యాక్లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. స్కొడా తమ ఎన్యాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేస్తుందని అంచనా.
MOST READ:వైకల్యాన్ని అధిగమించి స్కూటర్ తయారుచేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా ?