2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

2020లో కొత్త స్కోడా ఇండియా 2.0 కార్పొరేట్ స్ట్రాటజీ కింద భారత మార్కెట్లో కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. స్కోడా సంస్థ ఇండియాలో ఈ సంవత్సరం కార్లను లాంచ్‌ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇది కార్లను లాంచ్ చేయడానికి 2020 ఆటో ఎక్స్‌పోను వేదికగా చేసుకోనుంది.

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

స్కోడా ఆటో ఇండియా కొత్తగా నియమించబడిన డైరెక్టర్ జాక్ హోలిస్ భారత మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి తయారీదారు యొక్క కొత్త వ్యూహం గురించి టెలిగ్రాఫ్ ఇండియాకు తెలియజేసాడు. జాక్ హోలిస్ ధృవీకరించినట్లుగా స్కోడా 2020 ఆటో ఎక్స్‌పోలో కరోక్ ఎస్‌యూవీ, ఆక్టేవియా ఆర్‌ఎస్, బిఎస్-VI రాపిడ్ ఫేస్‌లిఫ్ట్ మరియు సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్‌లను ప్రదర్శించబోతోంది.

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

స్కోడా వివిధ రకాల మోడళ్లతో పాటు, స్కోడా విజన్ ఇన్ కాన్సెప్ట్‌ను కూడా ఎక్స్‌పోలో షోస్టాపర్‌గా ప్రదర్శిస్తుంది. దీనిని ఇంతకు ముందు స్కోడా MQB A0 IN SUV అని పిలిచేవారు. తరువాత అధికారికంగా స్కోడా విజన్ ఇన్ గా పేరు మార్చారు. ఇప్పుడు ఇది ఉత్పత్తిలో విజన్ ఇన్ మొదటి MQB A0 IN ప్లాట్‌ఫాం-ఆధారిత ప్రీమియం B-SUV అవుతుంది.

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

స్కోడా భారత మార్కెట్‌ను కరోక్ అనే ప్రీమియం ఎస్‌యూవీతో ఎన్‌కాష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది సిబియు మార్గం ద్వారా లాంచ్ అవుతుంది మరియు ఇది జీప్ కంపాస్‌తో పోటీపడుతుంది. ఈ కారు కామిక్ తరువాత ఉండబోతుంది. స్కొడాలో ఇది పెద్ద ఎస్‌యూవీ మరియు ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించబడుతుందని భావిస్తున్నారు. అయితే దాని ప్రయోగ ప్రణాళికలు ఇంకా మనకు స్పష్టంగా తెలియలేదు.

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

స్కోడా రాపిడ్, ఇది మిడ్-సైజ్ సెడాన్. ఇది ఫేస్ లిఫ్ట్ అందుకుంటుంది మరియు ఏప్రిల్ 2020 లో ప్రారంభించబడుతుంది. డిజైన్ పరంగా చిన్న మార్పులు ఉన్నప్పటికీ రాపిడ్ స్థానికంగా తయారుచేసిన 1.0 ఎల్ టిఎస్ఐ టర్బోచార్జ్డ్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ను పొందుతుంది.

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

కొత్త రాపిడ్ విషయానికొస్తే, ఇది MQB A0 IN ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది ఆటో ఎక్స్పోలో ప్రారంభించబడుతుంది. దాదాపుగా స్కోడా యొక్క ఈ ఐదు బ్రాండ్లు ఈ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి.

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

తరువాత స్కోడా బ్రాండ్ లో చెప్పుకోదగ్గది రాపిడ్ సెడాన్‌. రాపిడ్ సెడాన్ కొత్త 2.0-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. స్కోడా డీజిల్ మోడల్‌ను తొలగించి, సంవత్సరం తరువాత ప్రవేశపెట్టవచ్చు. ఇది టొయోటా కేమ్రీ మరియు హోండా అకార్డ్ వంటివారికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.

Read More:ఇండియాలో ప్రారంభించబోయే బెనెల్లి 302 ఎస్, టిఎన్‌టి 300 ని భర్తీ చేయనుందా....?

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

చివరగా స్కోడా ఆర్ఎస్ 245 అని పిలువబడే స్పోర్టియర్ అవతార్. స్కోడా ఇప్పుడు భారతదేశంలో ఆక్టేవియా ఆర్ఎస్ మోడల్‌ను తిరిగి ప్రారంభిస్తుంది. స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్ 245 స్కోడా లైనప్‌లో అత్యంత వేగవంతమైన మరియు అత్యంత ఖరీదైన కారు అవుతుంది మరియు దీని ధర సుమారు రూ. 35 లక్షలు.

Read More:నూతన సంవత్సర వేడుకల్లో విషాదం....ఎక్కడంటే?

2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 5 కార్లను విడుదల చేయనున్న స్కోడా!

స్కోడా ప్రారంభించనున్న ఈ కార్లన్నీ కూడా ఇప్పుడు ఉన్న వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోగలవు. వినియోగదారుడు వినియోగించడానికి చాల అనుకూలంగా కూడా ఉంటాయి. ఒక్క సారిగా 5 కార్లు స్కోడా బ్రాండ్ నుండి వెలువడటం అనేది చాల గొప్ప విషయం.

Read More:జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda To Showcase These 5 New Cars At 2020 Indian Auto Expo Next Month-Read in Telugu
Story first published: Thursday, January 2, 2020, 16:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X