Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్కొడా స్లావియా రోడ్‌స్టర్ కారు ఆవిష్కరణ, తయారు చేసింది ఎవరో తెలుసా?
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న స్కొడా రోడ్‌స్టర్ కారును చూశారా, ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ కారుని స్కోడా స్కాలా మోడల్ ఆధారం తయారు చేశారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్కొడా ఆటో తమ స్టూడెంట్ కార్ ప్రాజెక్ట్‌లో భాగంగాఈ ఏడవ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ కారుని స్కొడా స్లావియా రోడ్‌స్టర్‌గా పిలవనున్నారు.

ఆకర్షణీయమైన కార్లను డిజైన్ చేసే స్టూడెంట్ కార్ ప్రాజెక్ట్‌లో భాగంగా స్కొడా స్కాలాను తయారు చేశారు, అయితే ఇది కేవలం కాన్సెప్ట్ వాహనంగానే మిగిలిపోనుంది, ఉత్పత్తి దశకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈ కారును కంపెనీ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్మించారు, ఇది స్కొడాలో వారి వృత్తిని ప్రారంభించడంలో సహాయపడటానికి అనేక విభాగాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది.

ఈ సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు స్కోడా స్కాలాను స్పోర్టీ స్పైడర్‌గా మోడిఫై చేయటాన్ని ఎంచుకున్నారు. ఈ ఏడాది 31 మంది విద్యార్థులు చెక్ రిపబ్లిక్‌లోని స్కోడా ప్లాంట్ వద్ద ఈ కారు నిర్మాణంలో పాల్గొన్నారు.
MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

స్కొడా బ్రాండ్ వ్యవస్థాపకులు 1957లో తయారు చేసిన 1100 ఓహెచ్‌సి స్పోర్ట్స్ ప్రోటోటైప్ నుండి స్పూర్తి పొంది, బ్రాండ్ విక్రయించే సైకిళ్ల పేరుతో ఈ కొత్త 'స్కొడా స్లావియా' రోడ్‌స్టర్ కారును అభివృద్ధి చేశారు. స్కొడా 1100 ఓహెచ్‌సి కారును అప్పట్లో రేసులు మరియు ర్యాలీల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఓపెన్ టాప్ టూ-సీటర్ కారు.

మోడిఫై చేసిన స్కొడా స్కాలాలో రీన్ఫోర్స్డ్ అండర్‌బాడీ మరియు వెల్డింగ్ చేయబడిన వెనుక డోర్స్ ఉంటాయి.ఈ మోడల్‌ను రెండు సీట్ల కారుగా మోడిఫై చేశారు. ఇందులో స్పీడ్ స్టర్-స్టైల్ హంప్స్ మరియు కొత్త రియర్ స్పాయిలర్, కస్టమ్ మేడ్ రియర్ సీట్ కవర్ ఉంటాయి.
MOST READ:అమెజాన్ పే ద్వారా కార్ & బైక్ భీమా మరింత సులభం, ఎలాగో తెలుసా ?

స్కోడా కోడియాక్ విఆర్ఎస్ మోడల్‌లో ఉపయోగించిన 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఆక్టేవియా విఆర్‌ఎస్ కారులో ఉపయోగించిన బ్రేకింగ్ సిస్టమ్‌లను ఈ రోడ్‌స్టర్‌లో ఉపయోగించారు. స్కొడా స్లావియాలో అప్‍డేట్ చేసిన ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంది.

ఈ కారును నియాన్ బ్లూ హైలైట్‌లతో వైట్ క్రిస్టల్ బ్లూ పియర్లెస్సెంట్ పెయింట్‌లో ఫినిషింగ్ చేశారు. దీని డోర్ సిల్స్‌లో ప్రోగ్రామబల్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ఇవి చెక్ రిపబ్లిక్ దేశపు జెండా రంగులను (ఎరుపు, తెలుపు మరియు నీలం) ప్రొజెక్ట్ చేస్తుంది.
MOST READ:టీవీఎస్ జెస్ట్ 110 బిఎస్6 స్కూటర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంటీరియర్స్‌లో లెథర్ స్పార్కో రేసింగ్ సీట్లు, ఫోర్-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఇంటీరియర్ లెదర్ ట్రిమ్స్, డ్యూయల్-టోన్ స్టీరింగ్ వీల్ మరియు రెండు బాస్ స్పీకర్ల మధ్య భాగంలో ఆ దేశపు చిహ్నమైన సింహం గుర్తుతో ఎంబ్రాయిడరీ చేసిన లెథర్ షెల్ఫ్ ఉంటాయి.

స్కొడా స్లావియాను స్కొడా స్కాలా ఆధారంగా తయారు చేశారు. అయితే, స్లావియాలో ఇంజన్ పరంగా ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. బహుశా స్కాలా ఇంజన్‌నే యధావిధిగా ఇందులో ఉపయోగించి ఉండొచ్చని అంచనా.
MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

స్కొడా స్కాలా మోడళ్లలో 1.0-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ ఇంజన్ 95 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 148 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

స్కొడా స్కాలా బ్రాండ్ యొక్క విజన్ ఆర్ఎస్ కాన్సెప్ట్ వాహనం ఆధారంగా తయారు చేసిన ఫ్యామిలీ కార్. ఈ కారుని తొలిసారిగా 2018లో ఆవిష్కరించారు. ఆ తర్వాత 2019 ఏప్రిల్‌లో ఈ మోడల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. స్కొడా ఈ మోడల్‌ను ఇంకా భారత మార్కెట్లో ప్రవేశపెట్టలేదు.

స్కొడా స్లావియా రోడ్‌స్టర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
రెగ్యులర్ స్కాడా స్కాలా కారును స్లావియా రోడ్‌స్టర్‌గా మార్చడంలో కంపెనీ విద్యార్థులు చక్కని ప్రతిభను కనబరచానే చెప్పాలి. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా కనిపించే ఈ మోడల్ కేవలం కాన్సెప్ట్‌కే పరిమితం కావటం కాస్తంత విచారకరమైన విషయమే.