Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మోటార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలంటే పియూసి తప్పనిసరి: సుప్రీం కోర్ట్
మోటారిస్టులకు షాకింగ్ న్యూస్, ఇకపై మీరు మీ వాహన ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా కాలుష్య నిబంధలను కఠినతరం చేసేలా, వాహన భీమా పునరుద్ధరణ కోసం పియుసి తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే వాహనాలను రోడ్లకు దూరంగా ఉంచాలన్నదే సుప్రీం కోర్టు ప్రధాన లక్ష్యం. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఎఐ) ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో, సాధారణ బీమా కంపెనీలు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది.

ఇకపై మోటారు భీమా పాలసీల పునరుద్ధరణ సమయంలో చెల్లుబాటు అయ్యే పియుసి సర్టిఫికేట్‌ను బీమా కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. సరైన పియుసి సర్టిఫికెట్ లేని వాహనాలకు బీమా కంపెనీలు మోటార్ ఇన్సూరెన్స్‌ను రెన్యువల్ చేయటం చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది.
MOST READ: విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

ఆగస్టు 20, 2020ల చేదీన జారీ చేసిన సర్క్యులర్‌లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఎఐ) "దేశ రాజధాని ఢిల్లీ (ఢిల్లీ - ఎన్‌సిఆర్) ప్రాంతంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడంలో వైఫల్యం గురించి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సిపిసిబి) ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ (ఢిల్లీ - ఎన్‌సిఆర్) ప్రాంతంలో ప్రత్యేక దృష్టి సారించి భారత సుప్రీంకోర్టు ఆదేశాలను తక్షణమే పాటించేలా చూసుకోండి" అని పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఈ కొత్త నిబంధనను పాటించడంతో పాటుగా ప్రత్యేకించి కాలుష్యం నానాటికీ పెరిగిపోతున్న దేశ రాజధాని ఢిల్లీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంటోంది, ఇ్పపుడు ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన నగరాల్లో ఒకటిగా మారింది.
MOST READ: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

మోటారు వాహన భీమా పునరుద్ధరణ కోసం కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉద్గార పరీక్షలో నాణ్యత లేని లేదా పియుసి పాస్ కాని వాహనాలకు బీమా ఇవ్వకపోయినట్లయితే, అలాంటి వాహనాలు రోడ్లపై తిరగకుండా చేసి కాలుష్యాన్ని అరికట్టవచ్చు.

మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం, ఏదైనా బహిరంగ ప్రదేశంలో మోటారు వాహనాన్ని నడుపుతున్న ఏ వ్యక్తి అయినా సరే భీమా ధృవీకరణ పత్రం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
MOST READ: టాప్ కార్ న్యూస్: మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లు; ఎస్‌యూవీలదే పైచేయి

రవాణా వాహనం (ట్రాన్స్‌పోర్ట్ వెహికల్) విషయంలో అయితే, సెక్షన్ 56లో సూచించినట్లుగా ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాగే, వాహనం యొక్క ఉపయోగానికి సంబంధించి, ఈ చట్టం క్రింద మంజూరు చేయబడిన మినహాయింపు ఏదైనా ఉంటే, అందుకు సంబంధించిన ధృవీకరణ లేదా అధికారిక పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

పియుసి సర్టిఫికెట్ ఏదైనా వాహనం ఆమోదయోగ్యమైన పరిమితిలో కాలుష్య ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందనే ప్రామాణికతను ధృవీకరిస్తుంది. ఈ ప్రామాణికత ముగిసేలోపుగా కాలుష్య ధృవీకరణ పత్రాన్ని (పియుసి) క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఇది దేశంలోని అన్ని కంబస్టియన్ ఇంజన్‌తో నడిచే వాహనాలకు తప్పనిసరిగా ఉండాలి. అయితే, రిజిస్ట్రేషన్ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు పియుసి సర్టిఫికేట్ అవసరం ఉండదు.
MOST READ: కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

మోటార్ వాహన బీమా రెన్యువల్ కోసం పియుసిని తప్పనిసరి చేయటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రపంచంలోని అనేక దేశాలను పట్టి పీడిస్తున్న సమస్యల్లో వాహన కాలుష్యం చాలా ప్రధానమైనది. మనదేశంలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో వాహనాల వినియోగం నానాటికీ అధికమై కాలుష్య స్థాయి హద్దులు దాటిపోయింది. ఈ నేపథ్యంలో, కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే వాహనాలకు చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకోవటం హర్షనీయంగా చెప్పుకోవచ్చు.