Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ మాడిఫైడ్ సుజుకి జిమ్నీ ఎస్‌యువి హార్స్ పవర్ ఎంతో తెలుసా..?
దేశీయ మార్కెట్లో సుజుకి జిమ్నీ తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. సుజుకి జిమ్నీ ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా తయారు చేయబడింది. ఈ కారణంగా చాలామంది వినియోగదారులను ఆకర్షించింది. ఇప్పుడు మాడిఫై చేయబడిన మారుతీ సుజుకి జిమ్నీ కారు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఐకానిక్ ఆఫ్-రోడ్ స్పెషలిస్ట్ అయిన సుజుకి జిమ్నీ అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన మినీ ఎస్‌యువి. అటువంటి ప్రసిద్ధ ఎస్‌యువిని ఆకర్షణీయమైన మరియు శక్తివంతమైన ఎస్‌యువిగా మాడిఫై చేయబడింది.

సుజుకి జిమ్మీ మినీ ఎస్‌యువిని ఆటోప్లస్ కస్టమ్ మాడిఫై చేసింది. మాడిఫై చేయబడిన మినీ సుజుకి జిమ్నీ ఎస్‌యువిలో టర్బో కిట్ అమర్చబడి ఉంది. ఈ టర్బో కిట్‌ను యుఎఇ ఆధారిత ఎఫ్-పెర్ఫార్మెన్స్ నిర్మించింది. ఈ జిమ్మీ మినీ ఎస్‌యువిలో ఇంధన ఇంజెక్షన్ సిస్టమ్ మరియు కొత్త ఇసియు కూడా ఉన్నాయి. ఈ మోడిఫై మోడల్ కారుకి మరియు మార్కెట్లో ఉండే సాధారణ జిమ్నీ ఎస్‌యువికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
MOST READ:భారతదేశంలో నార్టన్ బైక్‌లను తయారీ చేయనున్న టీవీఎస్

మాడిఫై చేసిన జిమ్నీ ఎస్‌యువి 200 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా జిమ్నీ ఎస్‌యువిలో వేస్ట్‌గేట్ బ్లో-ఆఫ్ వాల్వ్ మరియు ఆటోప్లస్ సైడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఏర్పాటుచేయబడి ఉంటుంది.

మాడిఫైడ్ సుజుకి జిమ్నీలో అదనంగా ఆటోప్లస్ బ్రేక్ రోటర్లు మరియు ప్యాడ్లు, 18-అంగుళాల వోల్క్ రేసింగ్ కాంకేవ్ అల్లాయ్ వీల్ మరియు రెకారో రేసింగ్ సీట్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ మినీ ఎస్‌యూవీ యొక్క శక్తిని 100% వరకు పెంచారు. దీని కోసం ఇందులో రేస్-గ్రేడ్ మోతుల్ 300 వి ఇంజన్ అమర్చారు.
MOST READ:హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్ పై వెళ్లిన హీరో అజిత్ కుమార్

ఇటీవల సుజుకి జిమ్మీ ఎస్‌యువి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ నేటికీ వీటికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఎస్‌యువి యొక్క ప్రత్యేకత ఏమిటంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ అసలు మోడల్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

భారతదేశంలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ 1980 లో మారుతి జిప్సీ వేరియంట్లో రెండవ తరం మోడల్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి జిప్సీ భారత మార్కెట్లో వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వాహనాలలో ఇది కూడా ఒకటి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం బిఎస్ -6 కాలుష్యం కారణంగా ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీని నిలిపివేశారు.
MOST READ:మీ అభిమాన బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ఇకపై లేనట్టే, ఎందుకో తెలుసా..?

మారుతీ సుజుకి మరో కొత్త జిమ్మీ ఎస్‌యువిని భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతున్నారు. ఇది 33 సంవత్సరాలుగా దేశంలో అమ్ముడవుతున్న ప్రముఖ జిప్సీ ఎస్‌యువికి వారసురాలు అవుతుంది.
ఈ కొత్త జిమ్నీ మినీ ఎస్‌యువిలో 3 లింక్ యాక్సిల్ సస్పెన్షన్ ఉంది. కఠినమైన భూభాగంలో సజావుగా నావిగేట్ చేయడానికి చాల అనుకూలంగా తయారు చేయబడి ఉంటుంది. ఈ మినీ ఎస్‌యువికి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు.
MOST READ:కోవిడ్-19 టెస్ట్ కోసం తిరంగ ప్రాజెక్టును ప్రారంభించిన కేరళ గవర్నమెంట్

మారుతి సుజుకి జిమ్ని భారత మార్కెట్లో లాంచ్ చేయబోయే అత్యంత బహుముఖ ఎస్‌యువిలలో ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రశంసలు అందుకున్న మారుతి సుజుకికి చెందిన జిమ్నీ మినీ ఎస్‌యువి త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది.