కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారులో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ యూరోపియన్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్విఫ్ట్ కారులో కొత్త 2021 మోడల్‌ను ఆవిష్కరించింది.

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

యూరో-స్పెక్ సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ కొత్త ఫ్రంట్ ఎండ్ స్టైలింగ్, హై స్టాండర్డ్ స్పెసిఫికేషన్ మరియు మెరుగైన భద్రతా ఫీచర్లతో రూపుదిద్దుకుంది. ఒకవేళ మారుతి సుజుకి ఇండియా కూడా భారత్‌లో కొత్త ఫేస్‌లిఫ్ట్ స్విఫ్ట్ కారు ప్రవేశపెట్టాలని ప్లాన్ చూస్తే, యూరోపియన్ వెర్షన్‌కు ఇండియన్ వెర్షన్‌కు కొన్ని పోలికలు ఉండే అవకాశం ఉంది.

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

ఇక యూరోపియన్ వెర్షన్ సుజుకి స్విఫ్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు సుజుకి తమ అన్ని మోడళ్లలో 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. సుజుకి ఈ కారును యూరప్ మార్కెట్లో ఎస్‌జెడ్-ఎల్, ఎస్‌జెడ్-టి, ఎస్‌జెడ్5 మరియు ఎస్‌జెడ్5 ఆల్‌గ్రిప్ వేరియంట్లలో విక్రయిస్తోంది. అన్ని వేరియంట్లలో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను జోడించింది.

MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

ఎస్‌జెడ్-ఎల్ వేరియంట్లలో ఎయిర్ కండిషనింగ్, రియర్‌వ్యూ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, రాడార్ బ్రేక్ సపోర్ట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిఏబి రేడియో, లెదర్ స్టీరింగ్ వీల్, ప్రైవసీ గ్లాస్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి రియర్ కాంబినేషన్ ల్యాంప్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ ఎలక్ట్రిక్ పవర్ విండోస్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

స్విఫ్ట్ ఎస్‌జెడ్-టి వేరియంట్లో గ్రే పెయింట్‌లో ఫినిష్ చేసిన 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, లేన్ డిపార్చర్ అలెర్ట్ అండ్ కంట్రోల్, వీవింగ్ అలర్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

ఇకపోతే, ఎస్‌జెడ్5 వేరియంట్లో నావిగేషన్, 16 ఇంచ్ పాలిష్డ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ అండ్ స్టార్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అడ్జస్ట్‌మెంట్, రియర్ ఎలక్ట్రిక్ పవర్ విండోస్ మరియు డోర్ మిర్రర్ సైడ్ టర్న్ ఇండికేటర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

ఆసక్తికరంగా, ఈ వేరియంట్లో 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. యూరోపియన్ స్పెక్ 6 ఆప్షనల్ మెటాలిక్ రంగులలో లభిస్తుంది. ఇందులో 3 డ్యూయల్-టోన్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి. కస్టమర్లు కావాలనుకుంటే బ్లాక్ పెరల్ రూఫ్ కూడా ఆప్షనల్‌గా పొందవచ్చు.

MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

ఇక ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, యూరో-స్పెక్ స్విఫ్ట్ కారులో కె12డి 1.2-లీటర్ డ్యూయల్జెట్ హైబ్రిడ్, ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 81 బిహెచ్‌పి శక్తిని మరియు 107 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఇలానే ఉంటుందా?

కొత్త 2021 సుజుకి స్విఫ్ట్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత్‌లో లభిస్తున్న స్విఫ్ట్ కారులో మేజర్ డిజైన్ అప్‌గ్రేడ్ వచ్చి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి కూడా తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటీవలే హ్యుందాయ్ కూడా తమ ఐ20లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టడాన్ని చూస్తుంటే, మారుతి సుజుకి ఈ విభాగంలో పోటీని తట్టుకోవడానికి కొత్త స్విఫ్ట్ కారును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

MOST READ:గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
Japanese car brand Suzuki has unveiled the 2021 Swift facelift for Europe market. Take a look. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X