Just In
- 35 min ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 1 hr ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 2 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Sports
ఓ బౌన్సర్ తగిలితే భయం పోతుంది: శుభ్‌మన్ గిల్
- News
భారత జవాన్ల చేతిలో చైనా సైనికులకు చావుదెబ్బ: 20 మందికి గాయాలు: తరిమికొట్టిన సరిహద్దు బలగాలు
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Finance
Gold prices today: రూ.49,000 స్థాయికి బంగారం ధరలు, వెండి స్వల్పంగా అప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోండి!
టాటా మోటార్స్ ఇటీవల తమ తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కారును ఇండియన్ మార్కెట్లో విడుదల చేసి, భారీ విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను స్పోర్టివ్ వెర్షన్లో అందించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన టుర్బో-పెట్రోల్ ఇంజన్‌తో టాటా ఆల్ట్రోజ్‌ను ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తూ, మీడియా కంటపడింది.

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును పవర్ఫుల్ 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ మరియు డైరక్ట్ క్లచ్ ట్రాన్స్మిషన్ గల ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో శక్తివంతమైన స్పోర్టివ్ వేరియంట్ అందించేందుకు టాటా సిద్దమవుతోంది.

రహస్యంగా పరీక్షిస్తుండగా సేకరించిన ఫోటోలను పరిశీలిస్తే, కారు మొత్తాన్ని నలుపు-తెలుపు రంగు పేపర్‌తో కప్పేశారు. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా జరిగిన మార్పులు గుర్తించడానికి ఏ మాత్రం అవకాశం లేదు.

అయితే, X451 అనే కోడ్ పేరుతో దీనిని పరీక్షిస్తున్నట్లు తెలిపే కొన్ని స్టిక్కర్లను గమనించవచ్చు. బీఎస్6 ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ వీజీటీసీ ఇంజన్ అందించినట్లు తెలిపే కొన్ని అక్షరాలు కూడా ఉన్నాయి.

1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్‌కు సంభందించిన సాంకేతిక వివరాలను ఇంకా గోప్యంగానే ఉంచారు. అయితే 2019 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన వెర్షన్ మేరకు, ఇది సుమారుగా 100బిహెచ్పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

విడుదల విషయానికి వస్తే, 2020 ఆగష్టు లేదా ఆక్టోబరులో పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉంది. పలు ఎక్ట్సీరియర్ మార్పులు మరియు నూతన ఫీచర్లను విడుదలకు కొన్ని రోజులు ముందు నిర్వహించే అధికారిక ఆవిష్కరణలో రివీల్ చేసే అవకాశం ఉంది. మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం డ్రైవ్స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి!
Source: Carwale