ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా మోటార్స్ సరికొత్త ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును జనవరి 22 న విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంది. విడుదలకు మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‍‌బ్యాక్ షోరూములను చేరుతోంది. టాటా షోరూముల్లో ఆల్ట్రోజ్ రాకతో సందడి నెలకొంది.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా డీలర్లను చేరిన తొలి విడత ఆల్ట్రోజ్ కార్ల ఫోటోలను అశ్విన్ మరియు అమల్ రాయ్ పౌల్ కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు. మార్కెట్లో ప్రధాన పోటీనిచ్చే మారుతి బాలెనో పక్కనే షోరూము ముందు పార్క్ చేసిన డౌన్‌టౌన్ రెడ్ పెయింట్ స్కీమ్‌లో ఉన్న టాటా ఆల్ట్రోజ్ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా ఆల్ట్రోజ్ ఇండియన్ మార్కెట్లో కంపెనీ యొక్క మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా బ్రాండ్ ఆవిష్కరించిన ఆల్ఫా ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద వచ్చిన తొలి మోడల్ కూడా ఇదే. అంతే కాకుండా కంపెనీ యొక్క ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాగ్వేంజ్ ఆధారంగా అభివృద్ది చేశారు. ఈ డిజైన్ ఫిలాసఫీలో వచ్చిన తొలి మోడల్ హ్యారియర్ ఎస్‌యూవీ కాగా రెండవ మోడల్ టాటా ఆల్ట్రోజ్.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా ఆల్ట్రోజ్ మీద బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా టాటా షోరూమ్‌లో రూ. 21,000 చెల్లించి టాటా ఆల్ట్రోజ్ కారును బుక్ చేసుకోవచ్చు. అత్యంత ఆకర్షణీయమైన ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఇంటీరియర్‌ టాటా ఆల్ట్రోజ్ సొంతం.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

ఎల్ఈడీ డీఆర్ఎల్స్ గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అతి పెద్ద ఫ్లోటింగ్ టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథర్ ఫినిషింగ్‌తో మల్టిపుల్ కంట్రోల్ బటన్స్ గల స్టీరింగ్ వీల్, విభిన్న డ్రైవింగ్ మోడ్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా ఆల్ట్రోజ్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభించనుంది. అవి, XE, XM, XT మరియు XZ. అన్ని వేరియంట్లు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ స్టాండర్డ్ గేర్‌‌బాక్స్‌తో లభిస్తాయి.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2-లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86బిహెచ్‌‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా ఇందులోని 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

ఇటీవల టాటా ఆల్ట్రోజ్ కారును టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం లభించింది. ఈ మోడల్ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అత్యద్భుతమైన ఫీచర్లు, నమ్మశక్యంగాని పర్ఫామెన్స్ లెవల్స్ మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్ వంటి అంశాలు ఎంతగానో ఆకర్షించాయి. టాటా ఆల్ట్రోజ్ రివ్యూ స్టోరీలో దీని గురించిన ప్లస్సులు, మైనస్సులు, మా పూర్తి డ్రైవింగ్ అనుభవం మరియు అభిప్రాయాన్ని చదవండి.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

టాటా ఆల్ట్రోజ్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అవి, స్కైలైన్ సిల్వర్, డౌన్‌టౌన్ రెడ్, మిడ్‌టైన్ గ్రే, అవెన్యూ వైట్ మరియు హై-స్ట్రీట్ గోల్డ్.

ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో పండగ వాతావరణం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా ఆల్ట్రోజ్ రాకతో టాటా షోరూముల్లో సందడి వాతావరణం నెలకొంది. టాటా మోటార్స్ ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకున్న మోడళ్లలో టాటా ఆల్ట్రోజ్ ఫస్ట్ కారు. దీని తర్వాత దశల వారీగా గ్రావిటాస్, నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుతో పాటు టియాగో, టిగోర్ మరియు నెక్సాన్ ఎస్‌యూవీలను ఫేస్‌‌లిఫ్ట్ వెర్షన్‌లో రిలీజ్ చేయనుంది.

Most Read Articles

English summary
Tata Altroz Starts Arriving At Dealerships Ahead Of India-Launch: Will Rival The Maruti Baleno. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X