బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ ప్రారంభ ధర రూ. 5.29 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా టాటా ప్రతినిధులు నిర్ణయించారు. గత ఏడాది డిసెంబరులో అధికారికంగా ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ కారు మీద డిసెంబర్ 27 నుండి బుకింగ్స్ కూడా ప్రారంభించారు.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

మారుతి బాలెనో కారుకు సరాసరి పోటీనిచ్చే టాటా ఆల్ట్రోజ్ వేరియంట్లు, వేరియంట్ల వారీగా ధరలు, ఇంజన్, మైలేజ్, ఫీచర్లు మరియు ఫోటోలతో పాటు పూర్తి వివరాలు ఇవాళ్టి టాటా ఆల్ట్రోజ్ లాంచ్ స్టోరీలో తెలుసుకుందాం రండి..

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా మోటార్స్ కొత్త కార్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ది చేసిన ఆల్ఫా ( ALFA) ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన తొలి మోడల్ టాటా ఆల్ట్రోజ్. ధృడమైన బాడీ, తక్కువ బరువుతో మరియు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని కల్పించేలా ఈ ఫ్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేశారు. అంతే కాకుండా టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును టాట వారి ఇంపాక్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా డిజైన్ చేశారు.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో అత్యాధునిక ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16-ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ కారులో ఇప్పటి వరకూ మరే ఇతర కార్లలో పరిచయం కానటువంటి అత్యంత అరుదైన టెక్నాలజీ మరియు ఫీచర్లను అందించారు. అందులో 90-డిగ్రీల వరకు తెరుచుకోగల డోర్లు అందించారు. అత్యంత సులభంగా కారులో కూర్చోడానికి మరియు బయటికి రావడానికి ఈ డోర్లు ఎంతగానో హెల్ప్ అవుతాయి.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

ఇంటీరియర్‌లో లగ్జరీ కార్లను పోలి ఉండే సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉపయోగించారు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్‌కు అత్యంత విశాలమైన స్పేస్ అందించారు.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కారే అయినప్పటికీ సెడాన్ కార్ల తరహాలో అత్యుత్తమ లగేజ్ స్పేస్ అందించారు. ఇందులో 345-లీటర్ల స్టోరేజ్ స్పేస్ కలదు, రెండో వరుస సీటును పూర్తిగా కిందకు మడిపేస్తే స్టోరేజ్ స్పేస్‌ను 665-లీటర్లకు పెంచుకోవచ్చు.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ చూడటానికి ఎంత స్టైలిష్‌గా ఉంటుందో.. అంతే శక్తివంతమైనది కూడా. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2-లీటర్ రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా డీజల్ వెర్షన్ విషయానికి వస్తే ఇందులోని 1.5-లీటర్ డీజల్ యూనిట్ 90బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

ఆల్ట్రోజ్‌లోని పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి. అతి త్వరలో టాటా ఆల్ట్రోజ్ మోడల్‌ను ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లో కూడా పరిచయం చేయనున్నారు.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ సేఫ్టీ విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో అత్యంత సురక్షితమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా ఆల్ట్రోజ్‌ మొదటి స్థానంలో ఉంది. కార్ల సేఫ్టీని పరీక్షించే గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో టాటా ఆల్ట్రోజ్ 5-స్టార్ రేటింగ్ పొంది, సేఫెస్ట్ కారుగా రికార్డు సృష్టించింది.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ కారులో ఉన్న సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, యాంటీ-గ్లేర్ ఇన్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటివి వచ్చాయి.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

టాటా ఆల్ట్రోజ్ ఐదు విభిన్న వేరియంట్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి, XE, XM, XT, XZ, XZ (O). వీటిని మళ్లీ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో లభిస్తోంది. మొత్తం 10 ఎంచుకోదగిన వేరియంట్లలో లభించే టాటా ఆల్ట్రోజ్ ధరల శ్రేణి రూ. 5.29 లక్షల నుండి రూ. 9.29 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

బ్రేకింగ్: టాటా ఆల్ట్రోజ్ విడుదల.. ధర, మైలేజ్, ఫీచర్లు & ఫోటోలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అద్భుతమైన ఫ్యామిలీ కారు. ఆకర్షణీయమైన డిజైన్, లగ్జరీ ఫీలింగ్ కల్పించే ఇంటీరియర్, లెక్కలేనన్ని ఫీచర్లు, సౌకర్యవంతమైన మరియు సేఫ్టీ ఫీచర్లతో పాటు ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో వచ్చింది.

టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు వోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Tata Altroz Launched In India Starting At Rs 5.29 Lakh Ex-Showroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X