టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఆల్ట్రోజ్ కారులో త్వరలోనే మరింత శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్ విడుదలకు ముందే, కంపెనీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌ను దేశంలో విస్తృతంగా పరీక్షించింది.

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

తాజాగా, టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన నివేదిక ప్రకారం, టాటా మోటార్స్ ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ ఫోటోలను, వివరాలను ఉంచినట్లుగా తెలుస్తోంది. ఈ ఫొటోలో టాటా ఆల్ట్రోజ్ వెనుక భాగంలో స్మోక్డ్ టెయిల్ లైట్స్‌కు పక్కన ‘ఐటర్బో' అనే బ్యాడ్జింగ్‌ను మనం చూడవచ్చు.

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

ఇదివరకు లీకైన స్పై చిత్రాల్లోని మోడళ్లపై కేవలం ‘టర్బో' అనే బ్యాడ్జింగ్ మాత్రమే ఉండేది. అది కూడా బూట్ లిడ్ క్రింది భాగంలో ఉండేది. కాగా, వెబ్‌సైట్‌లో కనిపించిన ఫోటోలు బహుశా టర్బో-పెట్రోల్ వేరియంట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది.

MOST READ:ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ ఫుల్లీ-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ EQC లాంచ్ : ధర & ఇతర వివరాలు

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

ఇందులో కేవలం బ్యాడ్జ్ మినహా మిగిలిన అన్ని ఫీచర్లు అల్లాయ్ వీల్స్‌తో సహా ఇదివరకటి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయని తెలుస్తోంది. టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్‌లో పవర్‌ఫుల్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

గేర్‌బాక్స్ ఆప్షన్ విషయానికి వస్తే, టాటా ఆల్ట్రోజ్ టర్బోలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. మాన్యువల్ సిక్స్-స్పీడ్ యూనిట్ రూపంలోను మరియు ఆటోమేటిక్ డ్యూయెల్-క్లచ్ ట్రాన్స్మిషన్ (డిసిటి) రూపంలోనూ ఉండొచ్చని తెలుస్తోంది. టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌లో స్పోర్టీ అనుభూతిని పెంచేందుకు పాడిల్ షిఫ్టర్లు కూడా ఉండనున్నాయి.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే భిన్నంగా ఉండేందుకు టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ ఐటర్బో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్‌లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అకాశం ఉంది. అయితే, ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం చూడటానికి ప్రస్తుత ఆల్ట్రోజ్ మాదిరిగానే అనిపిస్తుంది.

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

స్టాండర్డ్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు ఉ్ననాయి.

MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

టాటా మోటార్స్ ప్రస్తుతం ఆల్ట్రోజ్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. ఇందులో మొదటిది 1.2-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఇది. గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవది 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో లభిస్తాయి. ప్రస్తుతం టాటా ఆల్ట్రోజ్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌గా అందుబాటులో లేదు.

టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో టిఎస్ఐ మరియు రాబోయే నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ ఐ 20 వంటి ప్రీమియం మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్‌ను కొన్ని ట్రిమ్ ఆప్షన్స్‌తో పాటు కొన్ని ఎక్స్‌క్లూజివ్ పెయింట్ స్కీమ్‌తో కూడా అందివచ్చని తెలుస్తోంది.

MOST READ:ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్న హోండా హై‌నెస్ సిబి 350 బైక్ ఫస్ట్ లుక్

టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్

టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ కూడా ఒకటి. ఇటీవలి కాలంలో భారత్‌లో టర్బో పెట్రోల్ ఇంజన్‌లు అన్ని వాహనాల విభాగాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ప్రస్తుత పండుగ సీజన్లో తమ పాపులర్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో కొత్త వేరియంట్‌ను అందించాలని చూస్తోంది, ఇది బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుంది.

Source: Team BHP

Most Read Articles

English summary
Tata Motors will be soon introducing a more powerful turbo-petrol engine on its Altroz premium hatchback in the Indian market. Ahead of its launch, the upcoming turbo-petrol variant of the hatchback has been spied several times testing in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X