Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తగ్గిన డిమాండ్, టాటా టియాగో, టిగోర్ జెటిపి మోడళ్ల నిలిపివేత!
టాటా మోటార్స్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'టాటా టియాగో' (Tata Tiago) మరియు 'టాటా టిగోర్' (Tata Tigor) మోడళ్లలో జెటిపి (JTP) వేరియంట్లను కంపెనీ నిలిపివేసింది. జేయెం (Jayem) ఆటోమోటివ్ సంస్థతో టాటా మోటార్స్ కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి ఈ స్పెషల్ ఎడిషన్ టియాగా జెటిపి మరియు టిగోర్ జెటిపి వేరియంట్లను గతంలో మార్కెట్లో విడుదల చేశారు.

గత 2017లో చేపట్టిన ఈ 50:50 జాయింట్ వెంచర్‌లో భాగంగా టాటా మోటార్స్ మరియు జేయెం కంపెనీలు రెండూ కలసి సంయుక్తంగా పనిచేసి టాటా మోటార్స్ అందిస్తున్న టియాగో, టిగోర్ మోడళ్లలో పెర్ఫార్మెన్స్ వెర్షన్లను అభివృద్ధి చేశాయి. వాటిని ప్రత్యేక జెటిపి బ్రాండింగ్‌తో మార్కెట్లో విడుదల చేశారు.

ఈ జాయింట్ వెంచర్ నుంచి 2018లో టియాగో జెటిపి, టిగోర్ జెటిపి మోడళ్లు పుట్టుకొచ్చాయి. టాటా మోటార్స్ అందిస్తున్న రెగ్యుల్ వెర్షన్లతో పోల్చుకుంటే ఈ జెటిపి వెర్షన్లు మరింత స్పోర్టీగా ఉండటమే కాకుండా మంచి పెర్ఫార్మెన్స్‌ను కూడా కలిగి ఉంటాయి.
MOST READ: కరోనా ఎఫెక్ట్ : పెట్రోల్ బంక్ లో కొత్త సిస్టం

ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా ఆటోమొబైల్ పరిశ్రమ తలక్రిందులు కావటంతో పాటుగా ఈ జాయింట్ వెంచర్ నుంచి వచ్చిన ఈ రెండు మోడళ్లు కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందలేకపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో, టాటా మోటార్స్ ఇకపై ఈ జెటిపి పెర్ఫార్మెన్స్ వెర్షన్ కార్లను మార్కెట్ నుంచి తొలగించాలని నిర్ణయించింది.

టాటా మోటార్స్ స్టాక్ ఎక్సేంజ్‌కి పంపించిన ఓ స్టేట్‌మెంట్‌లో జెటి స్పెషల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని జేయం ఆటోమోటివ్ విభాగానికి సంబంధించిన మిగిలిన 50 శాతం వాటాలను కూడా తామే కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో జెటి స్పెషల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా టాటా స్వాధీనం అయ్యింది.
MOST READ: మాకొక కొత్త పార్ట్‌నర్ కావాలి: మహీంద్రా అండ్ మహీంద్రా

"గత 2018లో విడుదలైన టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి మోడళ్లు వాటి విశిష్టమైన స్టైలింగ్ మరియు సాటిలేని పెర్ఫార్మెన్స్‌లతో విశ్వసనీయమైన వినియోగదారుల అభిమానాన్ని సంపాదించుకున్నాయి. కానీ, గడచిన ఆర్థిక సంవత్సరం (20019-20)లో ప్యాసింజర్ కార్ల పరిశ్రమ పెను సవాళ్లను ఎదురుచూసింది. ప్రత్యేకించి ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇటువంటి వాహనాలకు డిమాండ్ కూడా తగ్గిపోయింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకుని టాటా మోటార్స్, జేయెం ఆటోమోటివ్‌లు ఈ జాయింట్ వెంచర్‌ను రద్దు చేయాలని నిర్ణయించా"యని టాటా మోటార్స్ తన ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఇప్పటికే టాటా టియాగో జెటిపి మరియు టాటా టిగోర్ జెటిపి మోడళ్లను కొనుగోలు చేసిన కస్టమర్లు చింతించాల్సిన అవసరం లేదని, ఈ స్పెషల్ కార్ల వారికి కావల్సిన పూర్తి సపోర్ట్ మరియు సర్వీసులను యధావిధిగా కొనసాగిస్తామని టాటా మోటార్స్ భరోసా ఇచ్చింది.
MOST READ: ముంబై పోలీసులకి సెగ్వే ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా ?

టాటా టియాగో జెటిపి మరియు టాటా టిగోర్ జెటిపి మోడళ్ల విషయానికి వస్తే.. ఈ స్పెషల్ ఎడిషన్ కార్లలో పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేకమైన కార్లలో పవర్‌ఫుల్ ఇంజన్‌తో పాటుగా డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులు, చేర్పులు ఉన్నాయి.

సాధారణ మోడళ్లతో పోల్చుకుంటే ప్రత్యేకమైన ఈ జెటిపి మోడళ్లలో వెడల్పాటి టైర్లు, రీవర్క్ చేయబడిన సస్పెన్షన్, జెటిపి బ్యాడ్జింగ్, స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్ వంటి మరెన్నో ఫీచర్లను ఇందులో జోడించారు.
MOST READ: ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

టాటా టియాగో జెటిపి, టిగోర్ జెటిపి మోడళ్ల నిలిపివేతపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా కార్లలో పెర్ఫార్మెన్స్ వెర్షన్లను కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్, జేయెం ఆటోమోటివ్ కంపెనీలు ఈ సరికొత్త టియాగో జెటిపి, టిగోర్ జెటిపిలను మార్కెట్లో విడుదల చేశాయు. దాదాపు రెండేళ్ల పాటు మార్కెట్లో సందడి చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయాయి. అయితే, జెటి స్పెషల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను టాటా మోటార్స్ పూర్తిగా స్వాదీనం చేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పెర్ఫార్మెన్స్ కార్లు పుట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.