టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాటా గ్రావిటాస్' ఫుల్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించి తాజాగా కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తొలిసారిగా తమ గ్రావిటాస్ ఎస్‌యూవీని ప్రదర్శించిన సంగతి తెలిసినదే.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

తాజాగా కార్‌వాలే విడుదల చేసిన స్పై చిత్రాలలో, టాటా గ్రావిటాస్ ఇంటీరియర్స్ లీక్ అయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన గ్రావిటాస్ కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న గ్రావిటాస్‌కు అనేక పోలికలు ఉన్నాయి. ఇందులో డాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న హారియర్ ఎస్‌యూవీకి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా గ్రావిటాస్ మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, హారియర్ మరియు గ్రావిటాస్ మోడళ్లలో ఉపయోగించే టెక్నాలజీ, పరికరాలు దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంది. కాకపోతే, టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ త్రీ రో సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో విభిన్న సీటింగ్ లేఅవుట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

MOST READ:భారతదేశం యొక్క మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ: మెర్సిడెస్ బెంజ్ EQC 400 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

టాటా గ్రావిటాస్ టెస్టింగ్ వాహనంలోని ఇంటీరియర్స్‌లో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షనల్ స్టీరింగ్, ఇరువైపులా అనలాగ్ డయల్స్‌తో కూడిన మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, క్లైమేట్ కంట్రోల్ స్టాక్ మరియు డ్రైవ్ మోడ్ సెలక్షన్ కోసం రోటరీ డయల్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

అయితే, హారియర్‌లో కనిపించిన మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ గ్రావిటాస్ కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. టాటా గ్రావిటాస్‌లోని మ్యాన్యువల్ పార్కింగ్ బ్రేక్‌నుఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఇందులో సన్‌రూఫ్ కూడా లేదని తెలుస్తోంది. బహుశా టాప్-ఎండ్ వేరియంట్లలో ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ:భారత మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్ ఎప్పుడంటే?

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

మూడవ వరుసలోని ప్రయాణీకులకు మరింత హెడ్‌రూమ్ ఉండేలా వెనుక డిజైన్‌లో మార్పులు చేశారు. టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ స్టాండర్డ్ టాటా హారియర్ ఎస్‌యూవీ కంటే 62 మి.మీ పొడవుగా ఉంటుంది. ఫలితంగా, వెనుక వరుసలో ఎక్కువ స్థలం లభిస్తుంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్‌లో కూడా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందులో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌తో సహా పలు ఇతర ఫీచర్లను హారియర్ ఎస్‌యూవీ నుండి గ్రహించనున్నారు. అయితే, దీని టెయిల్-ల్యాంప్స్ డిజైన్ మాత్రం రివైజ్ చేసినట్లుగా అనిపిస్తుంది.

MOST READ:ఆర్‌సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

ఇకపోతే గ్రావిటాస్‌లోని ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కూడా హారియర్ ఎస్‌యూవీ నుండి తీసుకోబడతాయి. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ లేదా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎస్‌యూవీని పొడగించిన కారణంగా పెరిగిన అదనపు బరువుకు తోడ్పడేందుకు వీలుగా గ్రావిటాస్‌లోని ఇంజన్‌ను కొంచెం ఎక్కువ స్టేట్ ట్యూన్‌తో ఆఫర్ చేయవచ్చని అంచనా.

MOST READ:ఖరీదైన లగ్జరీ కారుకి నిప్పంటించిన యూట్యూబ్ ఛానల్ ఓనర్ ; ఎందుకో తెలుసా ?

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ లీక్స్; స్పై పిక్స్ మరియు లేటెస్ట్ డీటేల్స్

టాటా గ్రావిటాస్ ఇంటీరియర్ స్పై చిత్రాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ టెస్టింగ్‌ను కంపెనీ విస్తృతం చేయడాన్ని చూస్తుంటే, అతి త్వరలోనే ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. గ్రావిటాస్ మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ విభాగంలో మహీంద్రా ఎక్స్‌యువి500 మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Carwale

Most Read Articles

English summary
Tata Motors will be launching the new three-row SUV in the country called the Gravitas. The company had showcased the SUV at the 2020 Auto Expo in its pre-prodcution form. Since then, the Gravitas has been spied testing several times in the country confirming features expected in its final production form. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X