దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

టాటా మోటార్స్ మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకూ పలు కొత్త మోడళ్లతో మార్కెట్లో సునామీ సృష్టించిన టాటా ఇప్పుడు ఎవ్వరూ ఊహించని ఒక కొత్త మోడల్‌తో దిగ్గజాలకు దడపుట్టిస్తోంది. టాటా హార్న్‌బిల్ పేరుతో మైక్రో ఎస్‌యూవీని ఇటీవల రోడ్డెక్కించింది.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

టాటా మోటార్స్ అత్యంత రహస్యంగా హార్న్‌బిల్ మైక్రో ఎస్‌యూవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. మోటార్‌బీమ్ వెబ్‌సైట్ రహస్యంగా సేకరించిన ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చల్‌చల్ చేస్తున్నాయి.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

టాటా మోటార్స్ గత ఏడాదే జెనీవాలో జరిగిన మోటార్ షోలో హెచ్2ఎక్స్ పేరుతో కాన్సెప్ట్ వెర్షన్‌ను తొలిసారిగా ఆవిష్కరించింది. హెచ్2ఎక్స్ కోడ్ పేరు స్థానంలో హార్న్‌బిల్ మోడల్‌ పేరుతో మార్కెట్లోకి రానుంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన టాటా హార్న్‌బిల్ చూడటానికి ఎస్‌యూవీ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇది మైక్రో-ఎస్‌యూవీ సెగ్మెంట్ కిందకు వస్తుంది. అర్ధ-చతురస్రాకారంలో ఉన్న వీల్ ఆర్చెస్, కాన్సెప్ట్ వెర్షన్‌లో చూసినట్లు అదే తరహా ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రియర్ విండ్ షీల్డ్ వైపర్ మరియు రియర్ డోర్లకు పైభాగంలో డోర్ హ్యాండిల్స్ వంటివి హైలెట్‌గా నిలిచాయి.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

ఇప్పటి వరకూ టాటా హెచ్2ఎక్స్ ఎక్ట్సీరియర్ డిజైన్ మాత్రమే రివీల్ అయ్యింది. టాటా హ్యారియర్ తరహాలో ఫ్రంట్ డిజైన్‌లో రెండు భాగాలుగా సెపరేట్ చేసిన హెడ్ ల్యాంప్ క్లస్టర్, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, ముందు భాగంలో హనికాంబ్ స్లిమ్ ఫ్రంట్ గ్రిల్ వంటి ఎన్నో అత్యాధునిక స్టైలింగ్ ఎలిమెంట్స్ వచ్చాయి.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

టాటా హెచ్2ఎక్స్ ఎస్‌యూవీలోని మరో కీలకమైన పార్ట్ స్లోపింగ్ రూఫ్ (వెనుక వైపుకు వాలుగా ఉండేలా)టాప్. ఈ ఎస్‌యూవీ పొడవు 3,840మిమీ, వెడల్పు 1.,822మిమీ, ఎత్తు 1,635మిమీ మరియు వీల్‌బేస్ 2,450మిమీలుగా ఉంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

టాటా హెచ్2ఎక్స్ మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ కింద స్థానంలో నిలుస్తుంది. దీనిని కూడా టాటా ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేశారు. అంతే కాకుండా

టాటా హెచ్2ఎక్స్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధిస్తుందని మొదటి రోజు నుండి చెప్తూనే ఉంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

నాలుగు-మీటర్ల పొడవులోపే ఉండటంతో అడ్వాన్స్‌డ్ మోడ్యూలర్ ఫ్లాట్‌ఫామ్ మీదనే నిర్మించే అవకాశం ఉంది. ఫ్యూచర్‌లో రాబోయే అన్ని ప్యాసింజర్ కార్లను కూడా ఇదే ప్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేయనున్నారు.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

టాటా హార్న్‌బిల్ (హెచ్2ఎక్స్) సాంకేతికంగా 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో రానుంది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో కూడా ఇదే ఇంజన్ కలదు. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు రకాల ట్రాన్స్‌మిషన్‌లో లభించే అవకాశం ఉంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

టాటా హార్న్‌బిల్ 2020 మధ్య భాగానికల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న మహీంద్రా కెయువి100 మరియు మారుతి ఎస్-ప్రెస్సో మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

దిగ్గజాలకు దడ పుట్టించిన టాటా కొత్త ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా హార్న్‌బిల్/హెచ్2ఎక్స్ ఫోటోల్లో చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది, ప్యాసింజర్ కార్ మార్కెట్లోకి టాటా కొత్త గాలిని తీసుకొస్తోందని చెప్పాలి. ఇంజన్ పరంగా కొత్తదనమేమీ లేకపోయినా డిజైన్ పరంగా చూస్తే భారీగా పెద్ద సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Tata H2X (Hornbill) Compact-SUV Spied Testing Yet Again In India: Spy Pics & Details. Read in Telugu.
Story first published: Saturday, January 11, 2020, 11:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X