Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత మార్కెట్లో టాటా హారియర్ కొత్త ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
టాటా హారియర్ క్యామో ఎడిషన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 16.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఆకర్షణీయమైన కలర్స్ లో వచ్చిన స్పెషల్ ఎడిషన్, ఈ రోజు నుండి కంపెనీ డీలర్షిప్ మరియు వెబ్‌సైట్‌లో హారియర్ క్యామో యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
టాటా హారియర్ క్యామో ఎడిషన్ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్స్‌టి, ఎక్స్‌టి ప్లస్, ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్ ప్లస్, ఎక్స్‌జెఎ మరియు ఎక్స్‌జెఎ ప్లస్ వేరియంట్లు. దీని టాప్ స్పెక్ ధర 20.30 లక్షల రూపాయలు, (ఎక్స్-షోరూమ్).

Harrier XT CAMO | ₹16,50,000 |
Harrier XT+ CAMO | ₹17,30,000 |
Harrier XZ CAMO | ₹17,85,000 |
Harrier XZ+ CAMO | ₹19,10,000 |
Harrier XZA CAMO | ₹19,15,000 |
Harrier XZA+ CAMO | ₹20,30,000 |
హారియర్ క్యామో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది మరియు డార్క్ ఎడిషన్‌తో షేర్డ్ టాప్ వేరియంట్‌గా మారింది. ఇది కొత్త క్యామో షేడ్ లో ప్రవేశపెట్టబడింది, ఇది మొదట హెక్సాతో ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టబడింది, కంపెనీ తన మోడళ్లన్నింటినీ ఈ స్పెషల్ ఎడిషన్‌కు తీసుకువస్తుంది.

టాటా హారియర్ క్యామో ఎడిషన్ రూపకల్పనలో ఎటువంటి మార్పు జరగలేదు. కానీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రతిబింబించేలా 'క్యామో' గ్రీన్ కలర్ ఇవ్వబడింది. ఈ స్పెషల్ ఎడిషన్ మిలిటరీ వాహనాల వలె కనిపిస్తుంది, దీనికి ఆర్ 17 బ్లాక్‌స్టోన్ అల్లాయ్ వీల్ కలిగి ఉంది, దీని కారణంగా ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
MOST READ:భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మేటోర్ 350 బైక్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

ఈ స్పెషల్ ఎడిషన్‌లో బ్లాక్‌స్టోన్ మ్యాట్రిక్స్ డాష్‌బోర్డ్, ప్రీమియం బ్లాక్‌స్టోన్ లెదర్ సీట్, కాంట్రాస్ట్ క్యామో గ్రీన్ స్టిచింగ్ మరియు గన్‌మెటల్ గ్రేలో ఇంటీరియర్ ఉన్నాయి. ఇది స్పెషల్ క్యామో గ్రాఫిక్స్, బోనెట్‌లోని హారియర్ మస్కెట్, రూఫ్ రైల్, సైడ్ స్టెప్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌తో సహా అనేక యాక్ససరీస్ పొందుతుంది.

దీని క్యాబిన్‌లో బేక్ సీట్ ఆర్గనైజర్, సన్‌షేడ్, 3 డి మోల్డ్ మాట్స్, 3 డి ట్రంక్ మాట్స్ మరియు యాంటీ స్కిడ్ డాష్ మాట్స్ ఉన్నాయి. ఈ యాక్ససరీస్ క్యామో స్టీల్త్ మరియు క్యామో స్టీల్త్ ప్లస్ అనే రెండు ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి, వీటిని రూ. 26,999 అదనపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
MOST READ:మళ్ళీ పుంజుకున్న జావా పెరాక్ బైక్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా ?

దేశ రక్షణకై పాటుపడుతున్న సైనికుల యొక్క గౌరవార్థం టాటా హారియర్ క్యామో ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఏది ఏమైనా ఈ టాటా హారియర్ క్యామో ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉందని టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవత్స అన్నారు.

ఈ క్యామో ఎడిషన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని, ఈ విధంగా ఉండడం వల్ల పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలను చేపట్టే అవకాశం ఉన్నాడని కమపేని తెలిపింది. హారియర్ కస్టమర్లను మరింత ఆకర్శించడానికి, ఈ స్పెషల్ ఎడిషన్ మార్కెట్లో ప్రారంభించబడింది. దేనికి ఎలాంటి స్పందన ఉంటుందో వేచి చూడాలి.
MOST READ:కొత్త బైక్‌ను వెంబడించిన ట్రక్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందో చూడండి