టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

రతన్ టాటా స్థాపించిన దేశీయ ఆటోమొబైల్ బ్రాండ్ టాటా మోటార్స్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా మోటార్స్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో అధునాతన ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తోంది.

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

టాటా మోటార్స్ తాజాగా ఏషియన్ మార్కెట్ల కోసం ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన రహస్య చిత్రాలు (స్పై పిక్స్) ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. గడచిన ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఆవిష్కరించిన కాన్సెప్ట్ కార్ ఆధారంగా ఓ ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌ను టాటా టెస్ట్ చేస్తోంది. లాక్‌డౌన్ ముగియడంతో టాటా ఈ కారును రోడ్లపై తిరిగి టెస్ట్ చేయటం ప్రారంభించింది.

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

ప్రస్తుతానికి టాటా హెచ్‌బిఎక్స్ (Tata HBX) అనే పేరుతో అభివృద్ధి దశలో ఉన్న ఈ మైక్రో ఎస్‌యూవీ టెస్టింగ్ విజయవంతం అయితే, అతి త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. పూర్తిగా క్యామోఫ్లేజ్ (డిజైన్ వివరాలు కనపడకుండా కప్పబడి ఉంచడం) చేయబడిన టాటా హెచ్‌బిఎక్స్ వాహనాన్ని టాటా మోటార్స్ మహారాష్ట్ర వీధులపై టెస్ట్ చేస్తుండగా ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు. క్యామోఫ్లేజ్ కారణంగా ఇందులో Y షేప్ టెయిల్ లైట్లు మినహా పెద్దగా డిజైన్ డీటేల్స్ ఏమీ తెలియడం లేదు.

MOST READ: 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

టాటా మోటార్స్ 2018 ఆటో ఎక్స్‌పోలో తమ ఫ్యూచర్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఆ తర్వాత 2020 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ మరింత అప్‌గ్రేడ్ చేసిన హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని తక్కవ ధరలో అందుబాటులో ఉండేలా ఈ కారును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ సజావుగా జరిగితే ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ఈ కారు విడుదల కావచ్చని తెలుస్తోంది.

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

టాటా నుంచి రానున్న ఈ సరికొత్త ఎస్‌యూవీని 'హార్న్‌బిల్' (Hornbill) అనే కోడ్ నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. కంపెనీ నుంచి విడుదలైన పాపులర్ కార్ టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను డిజైన్ చేసినట్లుగానే ఆల్ఫా ఆర్కిటెక్చర్ మరియు ఇంపాక్ట్ 2.0 డిజైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఈ మైక్రో ఎస్‌యూవీని అభివృద్ది చేయనున్నట్లు సమాచారం. టాటా హ్యారియర్ ఎస్‌యూవీ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఎత్తుగా ఉండేలా దీనిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

MOST READ: భారత్‌లో నిలిపివేయబడిన బిఎస్ 4 టాటా హెక్సా, ఎందుకో తెలుసా!

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

భారత్‌లోని గ్రామీణ పట్టణ రోడ్లకు అనుకూలంగా ఉండేలా రగ్డ్ లుక్‌తో మరియు బంప్‌లను తట్టుకునేందుకు వీలుగా పెద్ద వీల్ ఆర్చెస్‌తో హార్న్‌బిల్ రూపుదిద్దుకునే ఆస్కారం ఉంది. ఆకర్షణీయమైన బాడీ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, పెద్ద అల్లాయ్ వీల్స్‌తో ఈ చిన్న కారు మరింత స్టయిలిష్‌గా కనిపించనుంది.

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే.. దీని ధరను అందుబాటులో ఉంచేందుకు గాను కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగిస్తున్న ఇంటీరియర్ తరహాలోనే ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలో దాదాపు అవే ఇంటీరియర్స్ కనిపించే అవకాశం ఉంది. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయెల్ టోన్ అప్‌హోలెస్ట్రీ మరియు డ్యాష్‌బోర్డ్, ఆంబియెంట్ ఇంటీరియర్ లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఈ కొత్త కారులో కూడా ఉండే అవకాశం ఉంది.

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

ఇంజన్ విషయానికి వస్తే.. టాటా ఆల్ట్రోజ్ కారులో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త టాటా హెచ్‌బిఎక్స్‌లో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇలా చేయటం వలన హెచ్‌బిఎక్స్ ఉత్పత్తి వ్యయం చాలా వరకు తగ్గి, సరసమైన ధరకే దీనిని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) వచ్చే అవకాశం ఉంది.

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

అంతేకాకుండా.. టాటా మోటార్స్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం కూడా ఈ కొత్త ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. టాటా హార్న్‌బిల్ ఒకవేళ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎస్-ప్రెస్, రెనో క్విడ్ మరియు ఇటీవలే మార్కెట్లో విడుదలైన 2020 డాట్సన్ రెడి-గో వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

టాటా నుంచి మరో చిన్న ఎస్‌యూవీ, మొదలైన టెస్టింగ్!

టాటా హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

లాక్‌డౌన్ మినహాయింపుల నేపథ్యంలో టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా తిరిగి తమ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, టాటా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల పనిని వేగవంతం చేస్తోంది. నానాటికీ పోటీ అధికమవుతున్న ఎంట్రీ లెవర్ కార్ సెగ్మెంట్లో తన సత్తాను చాటుకునేందుకు టాటా మోటార్స్ కూడా అధునాతన వాహనాలను తీసుకొస్తుంది. ఈ కొత్త టాటా కాంపాక్ట్ కార్ కూడా వీలైనంత త్వరగా మార్కెట్లో వస్తే అతి తక్కువ సమయంలో బాగా పాపులర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Image Courtesy: Rushlane

Most Read Articles

English summary
The Tata HBX micro-SUV has been spotted testing ahead if its launch in India. The upcoming micro-SUV began its testing phase just before the nation-wide lockdown was announced in the country. Read in Telugu.
Story first published: Saturday, June 6, 2020, 9:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X