Just In
- 21 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 4 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్
లాక్‌డౌన్ తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు కొత్త కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారును ఆకర్షించేందుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.

జూన్ నెలలో భాగంగా టాటా మోటార్స్ తమ కార్లపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను అందిస్తోంది. కోవిడ్-19 పోరులో ముందుండి పోరాడిన కోవిడ్ వారియర్లు, హెల్త్‌కేర్ వర్కర్లకు కూడా కంపెనీ ప్రత్యేక తగ్గింపులను, రాయితీలను అందిస్తోంది. మోడల్‌ను, డీలరును బట్టి ఈ ఆఫర్లు మారుతూ ఉంటాయి.

ఈ ఆఫర్లను సొంతం చేసుకోవాలనుకునే వారి కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా కొనుగోళ్లు చేయవచ్చు. ఈ ఆఫర్లు జూన్ 30, 2020 వరకూ అందుబాటులో ఉంటాయి. ఈనెలలో మోడల్ వారీగా అందుబాటులో ఉన్న డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
MOST READ: కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

టాటా టియాగోటాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కంపెనీ రూ.30,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, ఒకవేళ మీ పాత కారుని డీలరుకు విక్రయిస్తే రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ లభిస్తుంది. కోవిడ్-19 వారియర్ల కోసం ప్రత్యేకంగా రూ.5,000 అదనపు డిస్కౌంట్‌ను అందిస్తోంది.

టాటా టిగోర్టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ టిగోర్‌పై కంపెనీ రూ.45,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, ఒకవేళ మీ పాత కారుని డీలరుకు విక్రయిస్తే రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ లభిస్తుంది. ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ప్రత్యేకంగా రూ.5,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
MOST READ: సరికొత్త కియా ఎమ్‌పివి టీజర్ విడుదల, మారనున్న కార్నివాల్ రూపురేఖలు!

టాటా నెక్సాన్టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది హాట్ కేకులా అమ్ముడుపోతోంది. మరోవైపు ప్రాంతాన్ని బట్టి ఈ కారుకి ఒక నెల నుంచి రెండు నెలల వెయింటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ మోస్ట్ డిమాండింగ్ మోడల్‌పై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ఇవ్వటం లేదు. ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ఈ మోడల్‌పై రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు.

టాటా హ్యారియర్టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ హ్యారియర్‌పై కంపెనీ రూ.35,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ ఏమీ లేదు. ఒకవేళ మీ పాత కారుని డీలరుకు విక్రయిస్తే రూ.30,000 ఎక్సేంజ్ బోనస్ లభిస్తుంది. కోవిడ్-19 వారియర్ల కోసం ప్రత్యేకంగా రూ.5,000 అదనపు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.
MOST READ: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న ఒకినావా

ఇకపోతే టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'టాటా ఆల్ట్రోజ్' పై కంపెనీ ఎలాంటి రాయితీలను ఇవ్వటం లేదు. నేరుగా కంపెనీ నుంచి ఈ మోడల్‌పై ఎలాంటి ఆఫర్లు లేకపోయినప్పటికీ, డీలర్ లెవల్‌లో కొందరు ప్రత్యేక ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ స్పెషల్ డిస్కౌంట్లతో పాటుగా టాటా మోటార్స్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాలను కూడా ఆఫర్ చేస్తోంది. కంపెనీ అందిస్తున్న వివిధ ఈఎమ్ఐ స్కీమ్‌ల నుంచి కస్టమర్లు ఫ్లెక్సిబల్ రీపేమెంట్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని టాటా డీలరు కానీ లేదా టాటా మోటార్స్ వెబ్‌సైట్‌ని కానీ సందర్శించండి.
MOST READ: హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

టాటా మోటార్స్ స్పెషల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గన త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేసిన టాటా మోటార్స్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సాకర ఫలితాలను నమోదు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తమ పాపులర్ మోడళ్లపై తగ్గింపులు, ప్రోత్సాహకాలను అందిస్తోంది.