టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

లాక్‌డౌన్ తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు కొత్త కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారును ఆకర్షించేందుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

జూన్ నెలలో భాగంగా టాటా మోటార్స్ తమ కార్లపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను అందిస్తోంది. కోవిడ్-19 పోరులో ముందుండి పోరాడిన కోవిడ్ వారియర్లు, హెల్త్‌కేర్ వర్కర్లకు కూడా కంపెనీ ప్రత్యేక తగ్గింపులను, రాయితీలను అందిస్తోంది. మోడల్‌ను, డీలరును బట్టి ఈ ఆఫర్లు మారుతూ ఉంటాయి.

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

ఈ ఆఫర్లను సొంతం చేసుకోవాలనుకునే వారి కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా కొనుగోళ్లు చేయవచ్చు. ఈ ఆఫర్లు జూన్ 30, 2020 వరకూ అందుబాటులో ఉంటాయి. ఈనెలలో మోడల్ వారీగా అందుబాటులో ఉన్న డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

MOST READ: కారులోకి వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి - కార్ శానిటైజేషన్ చిట్కాలు

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

టాటా టియాగోటాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కంపెనీ రూ.30,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, ఒకవేళ మీ పాత కారుని డీలరుకు విక్రయిస్తే రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ లభిస్తుంది. కోవిడ్-19 వారియర్ల కోసం ప్రత్యేకంగా రూ.5,000 అదనపు డిస్కౌంట్‌ను అందిస్తోంది.

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

టాటా టిగోర్టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ సెడాన్ టిగోర్‌పై కంపెనీ రూ.45,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, ఒకవేళ మీ పాత కారుని డీలరుకు విక్రయిస్తే రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ లభిస్తుంది. ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ప్రత్యేకంగా రూ.5,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

MOST READ: సరికొత్త కియా ఎమ్‌పివి టీజర్ విడుదల, మారనున్న కార్నివాల్ రూపురేఖలు!

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

టాటా నెక్సాన్టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ-లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది హాట్ కేకులా అమ్ముడుపోతోంది. మరోవైపు ప్రాంతాన్ని బట్టి ఈ కారుకి ఒక నెల నుంచి రెండు నెలల వెయింటింగ్ పీరియడ్ ఉంటోంది. ఈ మోస్ట్ డిమాండింగ్ మోడల్‌పై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లను ఇవ్వటం లేదు. ఫ్రంట్‌లైన్ వారియర్ల కోసం ఈ మోడల్‌పై రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు.

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

టాటా హ్యారియర్టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ హ్యారియర్‌పై కంపెనీ రూ.35,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ ఏమీ లేదు. ఒకవేళ మీ పాత కారుని డీలరుకు విక్రయిస్తే రూ.30,000 ఎక్సేంజ్ బోనస్ లభిస్తుంది. కోవిడ్-19 వారియర్ల కోసం ప్రత్యేకంగా రూ.5,000 అదనపు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

MOST READ: ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ముందుకు దూసుకెళ్తున్న ఒకినావా

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

ఇకపోతే టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'టాటా ఆల్ట్రోజ్' పై కంపెనీ ఎలాంటి రాయితీలను ఇవ్వటం లేదు. నేరుగా కంపెనీ నుంచి ఈ మోడల్‌పై ఎలాంటి ఆఫర్లు లేకపోయినప్పటికీ, డీలర్ లెవల్‌లో కొందరు ప్రత్యేక ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

ఈ స్పెషల్ డిస్కౌంట్లతో పాటుగా టాటా మోటార్స్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాలను కూడా ఆఫర్ చేస్తోంది. కంపెనీ అందిస్తున్న వివిధ ఈఎమ్ఐ స్కీమ్‌ల నుంచి కస్టమర్లు ఫ్లెక్సిబల్ రీపేమెంట్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని టాటా డీలరు కానీ లేదా టాటా మోటార్స్ వెబ్‌సైట్‌ని కానీ సందర్శించండి.

MOST READ: హ్యుందాయ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లపై ధరల పెంపు - వివరాలు

టాటా కార్లపై జూన్ ఆఫర్స్, భారీ డిస్కౌంట్స్ మరియు బెనిఫిట్స్

టాటా మోటార్స్ స్పెషల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గన త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేసిన టాటా మోటార్స్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సాకర ఫలితాలను నమోదు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తమ పాపులర్ మోడళ్లపై తగ్గింపులు, ప్రోత్సాహకాలను అందిస్తోంది.

Most Read Articles

English summary
Tata Motors is offering attractive discounts and special offers on select models in its lineup. The company is offering cash discounts, exchange bonuses, and more that varies depending on the model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X