టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభం; ఎక్కడంటే..?

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 26 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను ముంబైలోని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్)కు అందిజేసినట్లు ప్రకటించింది. భారతదేశం యొక్క ఫేమ్ II ప్రణాళికలో భాగంగా, బెస్ట్ నుండి అందుకున్న 340 ఎలక్ట్రిక్ బస్సుల పెద్ద ఆర్డర్‌లో భాగంగా టాటా మోటార్స్ ఈ 26 స్సులను పంపిణీ చేసింది.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభం; ఎక్కడంటే..?

మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరియు ఇతర ప్రముఖ సమక్షంలో 25 సీట్ల టాటా అల్ట్రా అర్బన్ 9/9 ఎలక్ట్రిక్ ఎసి బస్సులను ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ప్రారంభించబడ్డాయి. ఎలక్ట్రిక్ బస్సులతో ప్రారంభించడంతో పాటుగా టాటా మోటార్స్ బ్యాక్బే, వర్లి, మాల్వాని మరియు శివాజీ నగర్‌లోని నాలుగు ముంబై డిపోలలో కూడా పూర్తి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభం; ఎక్కడంటే..?

టాటా గ్రూప్ యొక్క విశిష్టమైన ‘వన్ టాటా' ప్రణాళికలో భాగంగా, ఈ బస్సులకు కావల్సిన నిరంతరాయంగా సేవలను అందించడానికి టాటా తన వివిధ గ్రూప్ కంపెనీలను ప్రభావితం చేస్తుంది. టాటా పవర్ సరఫరాతో సహా అప్‌స్ట్రీమ్ మరియు దిగువ విద్యుత్ సౌకర్యాలకు మరియు పూర్తి బస్సు ఛార్జింగ్ సదుపాయానికి కావల్సిన సహాయ సహకారాలను అందిస్తుంది.

టాటా మోటార్స్ కోసం ఎంపిక చేసిన భాగాల డిజైన్, డెవలప్‌మెంట్, సోర్సింగ్ మరియు సప్లయ్‌కి సంబంధించిన బాధ్యతలను టాటా ఆటో కాంపోనెంట్స్ తీసుకుటుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులను టాటా మోటార్స్ సరికొత్త ఉత్పాదక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేస్తుంది.

MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభం; ఎక్కడంటే..?

బెస్ట్‌కి టాటా మోటార్స్ అందించిన ఈ 25-సీట్ల టాటా అల్ట్రా అర్బన్ ఎసి ఎలక్ట్రిక్ బస్సులు ‘లిఫ్ట్ మెకానిజం'తో పాటుగా అనేక ఇతర పరికరాలను కూడా కలిగి ఉంటాయి. ఈ లిఫ్ట్ మెకానిజం సాయంతో వికలాంగులు తమ వాహనాలతో సులువుగా బస్సులోకి ప్రవేశించేందుకు మరియు నిష్క్రమించడం చేయవచ్చు.

ఈ బస్సుల్లోని ఇతర ఫీచర్లలో ఎర్గోనామిక్ సీట్లు, విశాలమైన ఇంటీరియర్స్, పోర్టింగ్ ఛార్జింగ్ వంటి యుటిలిటీ ప్రొవిజన్స్, ఆన్-ది-గో కనెక్టివిటీ కోసం వైఫై హాట్‌స్పాట్ మరియు వైడ్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాసేజ్‌లు మొదలైనవి ఉన్నాయి.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభం; ఎక్కడంటే..?

ఇవి పూర్తి-ఎలక్ట్రిక్ బస్సులు మరియు వీటిలోని ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఐటిఎస్), టెలిమాటిక్స్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మొదలైనవి మొత్తం బస్ డ్రైవింగ్ రేంజ్‌ని మెరుగుపరుస్తాయి. టాటా మోటార్స్ తమ కార్యాచరణ సామర్థ్యం కోసం ఇప్పటివే దేశంలోని వివిధ నగరాల్లో తమ ఇ-బస్సులను విస్తృతంగా పరీక్షించింది. విభిన్న భూభాగాల్లో వీటిని పనితీరును పరిశీలించేందుకు హిమాచల్ ప్రదేశ్, చండీగడ్, అస్సాం మరియు మహారాష్ట్ర నగరాల్లో వీటిని పరీక్షించారు.

MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభం; ఎక్కడంటే..?

ఫేమ్ I ప్రణాళికలో భాగంగా, టాటా మోటార్స్ ఇప్పటికే భారతదేశంలోని 5 నగరాల్లో 215 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది. ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ కలిపి సుమారు 4 మిలియన్ కిలోమీటర్లకు పైగా నడిచి కీలకమైన డేటాను సేకరించాయి. ఈ డ్రైవ్ ద్వారా టాటా మోటార్స్ సేకరించిన డేటాతో భవిష్యత్తులో మరింత నూతనమైన మరియు అప్‌గ్రేడెడ్ బస్సులను తయారు చేయనుంది.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ప్రారంభం; ఎక్కడంటే..?

ఫేమ్ 1 విజయంతో టాటా మోటార్స్ ఫేమ్ ఫేజ్ II లోని అనేక ఇతర రాష్ట్రాల నుండి కొత్త ఆర్డర్లను అందుకుంది. ఇందులో ఎజెఎల్ నుండి 60 బస్సులు, జైపూర్ సిటీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి 100 బస్సులు మరియు ముంబై నుండి 300 బస్సులకు ఆర్డర్లు వచ్చాయి. ఇవి కాకుండా, టాటా మోటార్స్ 25 హైబ్రిడ్ బస్సులను ఎమ్ఎమ్ఆర్‌డిఏకి కూడా పంపిణీ చేసింది. ఇవి భారతదేశంలోనే మొట్టమొదటి ప్రత్యేక సామర్థ్యం కలిగిన బస్సులు.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బస్సులపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, వీటికి డిమాండ్ కూడా పెరిగింది. స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

MOST READ:ఇకపై ట్రాఫిక్ ఫైన్ చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా !

Most Read Articles

English summary
Tata Motors delivers 26 state-of-the-art electric buses to Brihanmumbai Electric Supply and Transport (BEST) in Mumbai. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X