టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ హవా నడుస్తోంది. ఫెస్టివ్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా, దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తమ ప్యాసింజర్ కార్ల కోసం ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లను ప్రకటించింది.

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

టాటా మోటార్స్ ఇందుకోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ సంవత్సరం ఈ పండుగ సీజన్లో 'గ్రాడ్యువల్ స్టెప్ అప్' మరియు 'టిఎమ్ఎల్ ఫ్లెక్సీ డ్రైవ్' అనే రెండు కొత్త ఫైనాన్స్ ఆఫర్లను కంపెనీ ప్రవేశపెట్టింది.

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫైనాన్స్ ఆఫర్లు నవంబర్ 2020 నెలాఖరు వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్లు ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో విక్రయించే కార్లు, ఎస్‌యూవీలు మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.

MOST READ:ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా రూ. 10.10 లక్షలు.. ఆ నెంబర్ ఎదో తెలుసా ?

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

గ్రాడ్యువల్ స్టెప్ అప్ పథకం కింద, ఉత్పత్తి మరియు వేరియంట్‌ను బట్టి వినియోగదారులు ఇప్పుడు నెలకు లక్షకు రూ.799 కంటే తక్కువ ఇఎమ్ఐ ఆప్షన్లను పొందవచ్చు. ఈ పథకం ప్రకారం, కొనుగోలుదారుని యొక్క చెల్లింపు సౌలభ్యాన్ని బట్టి 2 ఏళ్ల వరకూ ఈఎమ్ఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతాయి.

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

ఈ గ్రాడ్యువల్ స్టెప్ అప్ స్కీమ్ సాయంతో వినియోగదారులు ఒకేసారి అత్యధిక మొత్తాల్లో నెలవారీ చెల్లింపులు చేయకుండా, వారి నెలవారీ కట్టుబాట్లను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు పాకెట్ ఫ్రెండ్లీ రేట్లలో అందుబాటులో ఉంటుంది.

MOST READ:ప్రధాని మోదీ ఉపయోగించనున్న లేటెస్ట్ ప్లైట్ ఇదే.. చూసారా !

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

ఇకపోతే, ఫ్లెక్సీ డ్రైవ్ స్కీమ్ విషయానికి వస్తే, వినియోగదారులు ప్రతి సంవత్సరంలో ఏవైనా 3 నెలలను ఎన్నుకుని, వారి సౌలభ్యం ప్రకారం కనీస ఈఎమ్ఐ లక్షకు రూ.789 చెల్లించవచ్చు (ఉత్పత్తి మరియు వేరియంట్‌ను బట్టి).

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

ఈ విషయంపై టాటా మోటార్స్ మార్కెటింగ్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ హెడ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, "మా కస్టమర్ల కోసం ఉత్తేజకరమైన ఆఫర్లను రూపొందించడానికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా కస్టమర్లకు సురక్షితమైన పర్సనల్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడంలో మా నిరంతర ప్రయత్నంలో ఓ భాగంగా ఉంటుంది. ఈ ఆఫర్లు కస్టమర్ల మనోస్థైర్యాన్ని పెంచుతాయి మరియు వారు కారును కొనుగోలు చేసే విధానాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయని" అన్నారు.

MOST READ:సినీతారలను వెంబడించిన మీడియాపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా ?

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

ఇదే విషయంపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రిటైల్ లెండింగ్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మాట్లాడుతూ, "హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వద్ద, మా వినియోగదారులకు క్లాస్ ప్రొడక్ట్స్ మరియు సర్వీసులలో అత్యుత్తమమైన వాటిని అందించడమే మా లక్ష్యం. ఈ పండుగ సీజన్లో టాటా మోటార్స్‌తో భాగస్వామ్యం కావడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం సరసమైన మరియు ఆచరణీయమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తుందని మేము నమ్ముతున్నాము" అని చెప్పారు.

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

పైన పేర్కొన్న రెండు ఆఫర్లకు అదనంగా, టాటా మోటార్స్ ఈ రెండు పథకాల కింద మొత్తం ప్యాసింజర్ వాహన ఉత్పత్తి శ్రేణిలో 100 శాతం వరకూ ఎక్స్-షోరూమ్ ఫైనాన్సింగ్‌ను కూడా అందిస్తోంది. కస్టమర్లు ఈ ఆఫర్లను బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఏదైనా అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా పొందవచ్చు.

MOST READ:పాత స్కూటర్‌తో తల్లిని తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కొడుక్కి KUV100 గిఫ్ట్ గా ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

టాటా కార్లపై పండుగ సీజన్ ఆఫర్లు.. ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్‌లు..

టాటా మోటార్స్ స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్‌లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ దేశంలో ఈ ఏడాది పండుగ సీజన్‌ను మరింత ఉత్సాహభరితం చేసేందుకు గాను ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను ప్రకటించింది. ఈ కొత్త ఫైనాన్స్ పథకాలతో, కొత్త టాటా వాహనాన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సులభంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata Motors has partnered with HDFC Bank to roll out exciting finance offers for its passenger cars in the country. The company has introduced two new finance offers called the 'Gradual Step Up' and the 'TML Flexi Drive' schemes during this festive season this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X