రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం కంపెనీ మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. లిమిటెడ్ టైమ్ ఆఫర్‌గా 'ఎలక్ట్రిఫైయింగ్ సబ్‌స్క్రిప్షన్' పేరుతో టాటా మోటార్స్ ఓ కొత్త చందా స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ క్రింది ప్రతినెలా కేవలం రూ.34,900 మాత్రమే చెల్లించి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవచ్చు.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

ఈ చందా మొత్తంలో అన్ని రకాల సేవలు కలిసి ఉంటాయి. టాటా మోటార్స్ ఇదివరకే చందా ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో ఇది నెలకు రూ.41,900గా ఉండేది. తాజాగా పరిచయం చేసిన లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లో భాగంగా, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై ఇప్పుడు అదనంగా రూ.7,000 తగ్గింపు లభించనుంది.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

ఈ పరిమితకాల ఆఫర్ నవంబర్ 30, 2020 వరకు మాత్రమె చెల్లుబాటులో ఉంటుందని, ఇది మొదటి 100 మంది సభ్యులకు మాత్రమే లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఆసక్తిగల కొనుగోలుదారులు చందా కాలపరిమితిని కనీసం 12 నెలల నుండి ప్రారంభమై 24 మరియు 36 నెలల వరకు విస్తరించుకోవచ్చు.

MOST READ:రోడ్ రోలర్‌గా మారిన టివిఎస్ బైక్ [వీడియో]

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే టాటా మోటార్స్ ఈ చందా ఆధారిత యాజమాన్యాన్ని (సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓనర్‌షిప్ మోడల్) అందిస్తోంది. వీటిలో ఢిల్లీ / ఎన్‌సిఆర్, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఉన్నాయి. నెక్సాన్ ఈవి కొనుగోలుదారులకు ఈ ప్రత్యేకమైన యాజమాన్య ప్రణాళికలను అందించడానికి ఒరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

ఈ సబ్‌స్క్రిప్షన్ సమయం పూర్తయిన తర్వాత, కస్టమర్లు ఈ ప్రణాళికను విస్తరించడానికి లేదా వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సదుపైయం ఢఢిల్లీ / ఎన్‌సిఆర్, ముంబై, పూణే, హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉంటుంది.

MOST READ:షోరూమ్ కండిషన్‌లో సుజుకి సమురాయ్.. ఇది ఎన్ని సంవత్సరాల బైక్ అని ఆశ్చర్యపోతున్నారా ..!

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

చందా ప్యాకేజీలో సమగ్ర బీమా కవరేజ్, ఆన్-కాల్ 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఉచిత మెయింటినెన్స్, సమయానుకూల సర్వీసింగ్ మరియు డోర్‌స్టెప్ డెలివరీ సేవలు కలిసి ఉంటాయి. వీటికి అదనంగా, కస్టమర్లు వారి సౌలభ్యం ప్రకారం వారి ఇంటి వద్ద కానీ లేదా కార్యాలయంలో ఏర్పాటు చేయగల కాంప్లిమెంటరీ పర్సనల్ ఈవీ ఛార్జర్‌ను కూడా పొందవచ్చు.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా తమ కస్టమర్లకు విస్తృతమైన కస్టమైజేషన్ ప్లాన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది లీజుకు ఇవ్వడానికి ఇష్టపడే కార్పొరేట్ ఉద్యోగులకు మరియు తరచూ ఇంటర్-సిటీ ఉద్యోగ బదిలీ ఉన్న వ్యక్తులకు అనువుగా ఉంటుంది.

MOST READ:ఈమోస్ వైల్డ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ; ధర & ఇతర వివరాలు

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

ఇక టాటా నెక్సాన్ ఈవి విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా ఉండే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. టాటా నెక్సాన్ ఈ.వి. భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్-ఎస్‌యూవీగా ఉంది.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

టాటా నెక్సాన్ ఈవి కారు 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది.

MOST READ:హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ డ్రైవింగ్ రేంజ్ అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది, ఫలితంగా వాస్తవ వినియోగంలో ఈ రేంజ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని రియల్-వరల్డ్ మైలేజ్ 250 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చని అంచనా.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

హోమ్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈ.వి కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో బ్రేక్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. బ్రేకింగ్ వేసిన ప్రతిసారి ఇందులోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఫలితంగా డ్రైవింగ్ పరిధి పెరుగుతుంది.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

ఈ కారులోని కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పూర్తి-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

రూ.34,900 నెలవారీ చందాకే టాటా నెక్సాన్ ఈవీని పొందండి - వివరాలు

టాటా నెక్సాన్ ఈ.వి. లిమిటెడ్ టైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓనర్‌షిప్ మోడల్‌తో టాటా నెక్సాన్ ఈ.వి. ఎలక్ట్రిక్ కారును ఇప్పుడు తక్కువ చందా ధరకే ఎలాంటి లాంగ్ టెర్మ్ కమిట్‌మెంట్ లేకుండా సులువుగా కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Tata Motors has announced a limited-time special offer for Nexon EV buyers in the country. Called the 'Electrifying Subscription' offer, the electric-SUV will be available for an all-inclusive fixed rental starting at just Rs. 34,900/- per month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X