Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 5 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్ : ధర & ఇతర వివరాలు
టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ హారియర్ ఎస్యూవీ ఎక్స్‌టి ప్లస్ వేరియంట్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టాటా హారియర్ ఎస్యూవీ మాన్యువల్ మోడల్ అయిన ఎక్స్‌టి ప్లస్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు [ఎక్స్‌షోరూమ్, ఇండియా]. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రకటించిన ధర కేవలం పరిచయమేనని, 2020 అక్టోబర్ 1 నుండి సవరించబడుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రారంభ ధర 2020 సెప్టెంబర్‌లో వాహనాన్ని బుక్ చేసుకుని, డిసెంబర్ 31, 2020 నాటికి డెలివరీలను తీసుకునే వినియోగదారులందరికీ చెల్లుతుంది.

టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్ వేరియంట్ యొక్క హైలైట్ ఫీచర్ పనోరమిక్ సన్‌రూఫ్, ఇది బ్రాండ్ యొక్క ఆటోమేటెడ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో పార్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్ క్లోజింగ్ కోసం గ్లోబల్ క్లోజ్ ఇందులో ఉంది.
MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

ఇది అదనపు భద్రత కోసం యాంటీ పించ్ మరియు రెయిన్ సెన్సింగ్ క్లోజర్ ని కలిగి ఉంది. అంతే కాకుండా ఇది గ్లాస్ బ్లైండ్ కవర్ కప్పబడి ఉంటుంది. ఇది వెలుపల చాలా వేడి ఉన్నప్పుడు వాహనదారునికి ప్రశాంతమైన ఇన్-క్యాబిన్ అనుభవాన్ని అందిస్తుంది.

ఎక్స్‌టి ప్లస్ వేరియంట్లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఇడి డిఆర్ఎల్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎనిమిది స్పీకర్లు (4 స్పీకర్లు + 4 ట్వీటర్లు), ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:ఒకే ఇంట్లో మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉపయోగిస్తున్నారు, ఆ ఫ్యామిలీ ఎదో తెలుసా ?

ఇందులో పుష్-బటన్ స్టార్ట్, పుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్లో భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, అధునాతన ఇఎస్పి ఫంక్షన్ ఉన్నాయి.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) హెడ్ మార్కెటింగ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, "మా ఉత్పత్తుల శ్రేణిలో కొత్త ఉత్పత్తులను కొత్త ఫీచర్స్ తో అప్డేట్ చేస్తూ, మా ఫ్లాగ్షిప్ యొక్క సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేయడం ఆనందంగా ఉంది.
MOST READ:ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రశంసల వెల్లువ.. ఎందుకో తెలుసా ?

ప్రారంభించినప్పటి నుండి హారియర్ దాని అద్భుతమైన డిజైన్ మరియు మంచి పనితీరుతో చాలామంది కస్టమర్లను ఆకర్శించింది. ఎక్స్‌టి ప్లస్ వేరియంట్ పరిచయం టాటా హారియర్ యొక్క ఆకర్షణను మరింత బలపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము. వినియోగదారులకు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్‌ను చాలా ఆకర్షణీయమైన ధర వద్ద అనుభవించే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.

కొత్త హారియర్ ఎక్స్‌టి ప్లస్ 2.0-లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 168 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ ఎస్యూవీ యొక్క లైనప్‌లోని ఇతర వేరియంట్లపై అప్సనల్ సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో కూడా హారియర్ అందించబడుతుంది.
MOST READ:ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో