Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా మోటార్స్ నుంచి హెల్త్ అండ్ హైజీన్ యాక్ససరీస్ - వివరాలు
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తమ వినియోగదారుల కోసం ఆరోగ్య మరియు పరిశుభ్రత ఉపకరణాలను (హెల్త్ అండ్ హైజీన్ యాక్ససరీస్) విడుదల చేసింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో, టాటా కార్ల యజమానులకు మరింత భద్రతను ఆఫర్ చేసేలా ఈ కొత్త యాక్ససరీస్‌ను డిజైన్ చేశారు.

కొత్తగా టాటా కార్లను కొనుగోలు చేసేవారికి మరియు ఇప్పటికే ఉన్న టాటా కార్ల యజమానుల కోసం అదనపు స్థాయి భద్రతను అందించడానికి ఈ ఉపకరణాలు రూపొందించబడ్డాయి. ఈ ఆరోగ్య మరియు పరిశుభ్రత ఉపకరణాలన్నీ టాటా మోటార్స్ జెన్యూన్ యాక్సెసరీస్‌గా అందించబడతాయి మరియు దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్షిప్ కేంద్రాలలో ఇవి లభ్యం కానున్నాయి.

టాటా మోటార్స్ విడుదల చేసిన యాక్ససరీస్‌లో మొదటది ఎయిర్-ఓ-ప్యూర్ 95 ఎయిర్ ప్యూరిఫైయర్, ఇది యాక్టివ్ కార్బన్ హెచ్పిఎ ఫిల్టర్ మరియు యువి-సి లైట్ కలిగి ఉంటుంది. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు కారు క్యాబిన్ నుండి ప్రమాదకరమైన వాయువులను ఫిల్టర్ చేస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ కాంపాక్ట్‌గా రూపొందించబడింది, కార్ కప్ హోల్డర్‌లో సరిపోయేలా డిజైన్ చేయబడినది.
MOST READ:భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

ఇకపోతే, రెండవ యాక్ససరీ ఎయిర్-ఓ-ప్యూర్ 95 ఎయిర్ ఫిల్టర్, ఇది 0.3 మైక్రాన్ల వరకు బ్యాక్టీరియా మరియు వైరస్‌లను ఫిల్టర్ చేయగలదు, తద్వారా క్యాబిన్ గాలి నాణ్యతను మెరుగుపడుతుంది. ఈ ఫిల్టర్‌ను ఇప్పుడు టాటా నెక్సాన్ మరియు టాటా హారియర్ వాహనాల్లో ఇన్స్టాల్ చేయవచ్చు. త్వరలోనే ఇది టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లకు అందుబాటులోకి రానుంది.

ఈ యాక్ససరీస్‌లో చివరిది హెల్త్ ప్రో ప్రో శానిటైజేషన్ కిట్. ఈ కిట్‌లో భాగంగా టాటా మోటార్స్ కస్టమర్లకు హ్యాండ్ శానిటైజర్, ఎన్ 95 మాస్క్‌లు, హ్యాండ్ గ్లౌవ్స్, సేఫ్టీ టచ్ కీ, టిష్యూ బాక్స్, మిస్ట్ డిఫ్యూజర్ మరియు స్టీరింగ్ వీల్, హ్యాండ్‌బ్రేక్, గేర్ నాబ్ మరియు సీట్ల కోసం డ్రైవింగ్ కిట్ కవర్లు వంటి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన హైజీని వస్తువులు ఉంటాయి.
MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

ఇక టాటా మోటార్స్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఓ ప్రత్యేకమైన యాజమాన్య ప్రణాళికను ప్రారంభించింది. ఇందు కోసం ఒరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో టాటా మోటార్స్ ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా, టాటా నెక్సాన్ ఈ.వి కారును కొనాలనుకునే కస్టమర్లు నెలకు రూ.41,900 నుండి ప్రారంభమయ్యే వివిధ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇందులో కస్టమర్ అవసరాన్ని బట్టి 18 నెలలు, 24 నెలలు మరియు 36 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:మీకు తెలుసా.. భారత్‌బెంజ్ ఎక్స్ఛేంజ్ స్కీమ్ స్టార్ట్ చేసింది

టాటా హెల్త్ అండ్ హైజీన్ యాక్ససరీస్‌పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ప్రజలందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యక్తిగత శుభ్రతను మరియు సామాజిక దూరాన్ని పాటించడం చాలా అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో వినియోగదారుల భద్రత కోసం టాట మోటార్స్ తీసుకువచ్చిన కొత్త హెల్త్ అండ్ హైజీన్ యాక్ససరీస్ వారి కారు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయనేది మా అభిప్రాయం.