కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

కోవిడ్-19పై పోరుకు టాటా మోటార్స్ అధినేత రటన్ టాటా రూ.1,500 కోట్లను విరాళంగా ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, ఇప్పుడు అదే కోవిడ్-19 కారణంగా టాటా మోటార్స్ భారీ నష్టాలను చవిచూసింది. గడచిన ఆర్థిక సంవత్సరం (2019-20) నాల్గవ త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ.9,864 కోట్ల నష్టాలను నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో టాటా మోటార్స్ రూ.1,108.66 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

జనవరి-మార్చ్ 2020 మధ్య కాలంలో టాటా మోటార్స్ నికర ఆధాయం రూ.62,492.96 కోట్లుగా నమోదై అంతకు ముందు ఇదే సమయంలో పోల్చుకుంటే 28 శాతం క్షీణతను నమోదు చేసింది. జనవరి-మార్చ్ 2019 సమయంలో టాటా మోటార్స్ నికర ఆదాయం రూ.86,422.33 కోట్లుగా నమోదైంది.

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

ఆర్థిక సంవత్సరం 2020 క్యూ4లో టాటా మోటార్స్ ఏకీకృత ఆదాయం రూ.4,871.05 కోట్లకు పడిపోయింది. అంతకు మునుపు ఇదే సమయంలో టాటా మోటార్స్ రూ.106.19 కోట్ల ఆదాయాన్ని ఆర్జిచింది.

MOST READ: బజాజ్ చేతక్ ప్రియులకు గుడ్ న్యూస్, బుకింగ్స్ రీఓపెన్!

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

ఈ ఆర్థిక ఫలితాలపై టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్యూంటెర్ బుచెక్ మాట్లాడుతూ.. 2020 ఆర్థిక సంత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ కరెన్సీ మారకం, అధిక ఇంధన ధరలు, యాక్సిల్ లోడ్ నిబంధనల్లో మార్పలు, బిఎస్6 కాలుష్య నిబంధనలు, కన్జ్యూమర్ సెటిమెట్ బలహీనంగా ఉండటం వంటి అనేక పెను సవాళ్లను ఎదుర్కొందని అన్నారు.

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

మార్చ్ 2020 మధ్యలో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా సప్లయ్ చైన్ వ్యవస్థ దెబ్బతిందని, పైన పేర్కొన్న సమస్యలకు ఇది మరింత ఆజ్యం పోసినట్లయిందని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు రాలేదని బుచెక్ అన్నారు.

MOST READ: స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

ఇకపోతే టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా ఈ సమయంలో 24 శాతం నికర ఆదాయాన్ని కోల్పోయి రూ.46.403 కోట్ల (5.5 బిలియన్ యూరోలు) నెట్ రెవెన్యూని పోస్ట్ చేసింది. అంతకు ముందు సమయంతో పోల్చుకుంటే సుమారు 500 మిలియన్ యూరోల (దాదాపు రూ.4,276 కోట్ల) నష్టాన్ని చవిచూసినట్లు కంపెనీ ప్రకటించింది.

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

ఇక టాటా మోటార్స్‌కి చెందిన వేరే వార్తల్లోకి వెళితే.. దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'టాటా టియాగో' మరియు 'టాటా టిగోర్' మోడళ్లలో జెటిపి వేరియంట్లను కంపెనీ నిలిపివేసింది. జేయెం ఆటోమోటివ్ సంస్థతో టాటా మోటార్స్ కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి ఈ స్పెషల్ ఎడిషన్ టియాగా జెటిపి మరియు టిగోర్ జెటిపి వేరియంట్లను గతంలో మార్కెట్లో విడుదల చేశారు.

MOST READ: కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

గత 2017లో చేపట్టిన ఈ 50:50 జాయింట్ వెంచర్‌లో భాగంగా టాటా మోటార్స్ మరియు జేయెం కంపెనీలు రెండూ కలసి సంయుక్తంగా పనిచేసి టాటా మోటార్స్ అందిస్తున్న టియాగో, టిగోర్ మోడళ్లలో పెర్ఫార్మెన్స్ వెర్షన్లను అభివృద్ధి చేశాయి. ఈ జాయింట్ వెంచర్ నుంచి 2018లో టియాగో జెటిపి, టిగోర్ జెటిపి మోడళ్లు పుట్టుకొచ్చాయి. టాటా మోటార్స్ అందిస్తున్న రెగ్యుల్ వెర్షన్లతో పోల్చుకుంటే ఈ జెటిపి వెర్షన్లు మరింత స్పోర్టీగా ఉండటమే కాకుండా మంచి పెర్ఫార్మెన్స్‌ను కూడా కలిగి ఉంటాయి.

కోవిడ్-19 ప్రభావం; టాటా మోటార్స్‌కు రూ.9,864 కోట్ల భారీ నష్టం

టాటా మోటార్స్ క్యూ4 ఆర్థిక ఫలితాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా టాటా వాహనాల అమ్మకాలు నిలిచిపోవటం, కొత్త వాహనాల ఉత్పత్తి ఆగిపోవటంతో పాటు ఇతర ఆర్థిక అంశాలు కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అయితే, ప్రస్తుతం కొత్త కార్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో అమ్మకాలు పెరిగి, ఆదాయాలు పెరగవచ్చని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి.

Most Read Articles

English summary
Tata Motors has announced a consolidated loss of Rs 9,863.75 crore during the final quarter of the previous Financial Year 2019-20. The company during the same period in FY2019 had registered a profit of Rs 1,108.66 crore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X