టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'టియాగో'లో కంపెనీ సైలెంట్‌గా కొత్తగా ఫీచర్లను జోడించినట్లు సమాచారం. ఈ నెలలోనే కొత్త అప్‌డేటెడ్ టియాగో హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

టాటా టియాగో ఎక్స్‌టి వేరియంట్ ఇప్పుడు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో మరియు ఫోన్ కంట్రోల్స్‌తో రానుంది. ఈ అప్‌డేటెడ్ వేరియంట్ త్వరలో షోరూమ్‌లకు చేరుకోనుంది. టాటా మోటార్స్ ఇప్పటికే, తమ టియాగో బ్రోచర్‌లో ఈ కొత్త ఫీచర్‌ను జోడించి అప్‌డేట్ చేసింది.

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

టాటా టియాగో ప్రస్తుతం ఆరు వేరియంట్లలో లభిస్తుంది, ఇందులో రెండు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. అవి: ఎక్స్ఈ, ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జెడ్ఏ, ఎక్స్‌జెడ్+. ఇందులో టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో లేదు మరియు దీనిని ఎంట్రీ లెవల్ వేరియంట్‌కు ఎగువన ఆఫర్ చేస్తున్నారు.

MOST READ:ముంబై వీధుల్లో సైకిల్ పై కనిపించిన రణబీర్ కపూర్.. ఎందుకో తెలుసా?

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

టాటా టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లోని కొన్ని ఇతర ఫీచర్లలో పియానో ​​బ్లాక్ ఫినిష్‌తో కూడిన వివిధ ట్రిమ్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి.

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

ఇంకా ఉందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ (సిఎస్‌సి) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఉంటాయి.

MOST READ:ఫెస్టివల్ సీజన్లో హోండా సూపర్ 6 ఫెస్టివల్ ఆఫర్స్.. చూసారా

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

బిఎస్6 అప్‌డేట్ తర్వాత, టాటా టియాగోను ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో విక్రయిస్తున్నారు. ఇందులోని 1.2-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో డీసెంట్ ఫీచర్లు లభిస్తాయి. అయితే, టియాగో మోడల్‌లోని టాప్-ఎండ్ వేరియంట్లలో మరిన్ని అధనపు ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

భారత మార్కెట్లో టాటా టియాగో ఈ విభాగంలో డాట్సన్ గో, హ్యుందాయ్ శాంత్రో, మారుతి సుజుకి సెలెరియో మరియు వ్యాగన్ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కాగా, టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ఇటీవలే భారత మార్కెట్లో బ్రాండ్ కోసం కొత్త అమ్మకాల మైలురాయిని సాధించింది. దేశంలో టియాగో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లో కొత్త ఫీచర్లను జోడించనున్న టాటా మోటార్స్

టాటా టియాగో ఎక్స్‌టి వేరియంట్‌లోని కొత్త ఫీచర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ అందిస్తున్న టియాగో ఎక్స్‌టి వేరియంట్ ఇకపై ఓ కొత్త ఫీచర్‌తో లభ్యం కానుంది. ఇందులో కొత్తగా జోడించిన స్టీరింగ్ వీల్ మౌంటెండ్ కంట్రోల్స్ కారణంగా ఇకపై డ్రైవింగ్‌లో రిమోట్‌గా కాల్స్‌ను ఆన్సర్ చేయటం లేదా సంగీతాన్ని కంట్రోల్ చేయటం మరింత సౌకర్యంగా మారుతుంది.

MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

Most Read Articles

English summary
Tata Motors is silently pushing a new upgrade to the Tiago hatchback starting sometime this month. The XT variant of the hatchback will now come equipped with steering mounted audio and phone controls. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X