టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం కంపెనీ ఓ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దేశంలో నెక్సాన్ ఈవి కొనుగోలుదారులకు ప్రత్యేకమైన యాజమాన్య ప్రణాళికలను అందించడానికి ఒరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

ఈ భాగస్వామ్యంలో భాగంగా టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పుడు నెలవారీ చందా ప్రణాళిక (మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్) ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

టాటా నెక్సాన్ ఈ.వి కారును కొనాలనుకునే కస్టమర్లు నెలకు రూ.41,900 నుండి ప్రారంభమయ్యే వివిధ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో కస్టమర్ అవసరాన్ని బట్టి 18 నెలలు, 24 నెలలు మరియు 36 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు.

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

ఈ సబ్‌స్క్రిప్షన్ సమయం పూర్తయిన తర్వాత, కస్టమర్లు ఈ ప్రణాళికను విస్తరించడానికి లేదా వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సదుపైయం ఢిల్లీ / ఎన్‌సిఆర్, ముంబై, పూణే, హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉంటుంది.

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

ఈ కొత్త యాజమాన్య ప్రణాళిక గురించి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, "రానున్న కాలంలో ఈవిలదే భవిష్యత్తుగా ఉంటుంది మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగానికి నాయకుడిగా, టాటా మోటార్స్ భారతదేశంలో వీటి యాక్సెస్‌ను మరియు వినియోగాన్ని ప్రాచుర్యం చేయటానికి కట్టుబడి ఉంటుంది".

MOST READ:గంటకు 300 కి.మీ వేగంతో రైడ్ చేసిన బెంగళూరు బైకర్ అరెస్ట్ ; 20 లక్షల బైక్ సీజ్

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

ఈ ప్రతిష్టాత్మక సబ్‌స్క్రిప్షన్ విధానం, ఈవిలపై ఆసక్తి ఉన్న కస్టమర్లు, అవి అందించే అనేక ప్రయోజనాలను అనుభవించడానికి మార్గం సుగమం చేస్తుంది. షేరింగ్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న యుగంలో యాజమాన్యం కంటే వినియోగదారులకు 'యూజర్‌షిప్' ఇవ్వడానికి ఇది అత్యంత అనువైనదని" అన్నారు.

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా కంపెనీ తమ కస్టమర్లకు విస్తృతమైన కస్టమైజేషన్ ప్లాన్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇది లీజుకు ఇవ్వడానికి ఇష్టపడే కార్పొరేట్ ఉద్యోగులకు మరియు తరచూ ఇంటర్-సిటీ ఉద్యోగ బదిలీ ఉన్న వ్యక్తులకు అనువుగా ఉంటుంది.

MOST READ:గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

ఇక టాటా నెక్సాన్ ఈవి విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలుగా ఉండే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. టాటా నెక్సాన్ ఈ.వి. భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్-ఎస్‌యూవీగా ఉంది.

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

టాటా నెక్సాన్ ఈవి కారు 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది.

MOST READ:బటర్ చికెన్ పై ప్రేమ 1.25 లక్షల జరిమానా కట్టేలా చేసింది, ఎలానో మీరే చూడండి

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ డ్రైవింగ్ రేంజ్ అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది, ఫలితంగా వాస్తవ వినియోగంలో ఈ రేంజ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని రియల్-వరల్డ్ మైలేజ్ 250 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చని అంచనా.

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

హోమ్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈ.వి కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

టాటా నెక్సాన్ ఈవి కోసం నెలవారీ చందా ప్లాన్ - వివరాలు

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో పునరుత్పత్తి బ్రేకింగ్ (బ్రేక్ రీజనరేషన్) టెక్నాలజీ కూడా ఉంటుంది. బ్రేకింగ్ వేసిన ప్రతిసారి ఇందులోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఫలితంగా డ్రైవింగ్ పరిధి పెరుగుతుంది.ఈ కారులోని కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పూర్తి-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈ.వి. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త చందా-ఆధారిత యాజమాన్య నమూనాతో (ఓనర్‌షిప్ మోడల్)తో టాటా నెక్సాన్ ఈ.వి. ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ కొత్త పథకం చాలా సరళమైనదని మరియు దేశంలోని చాలా మంది ఈవి కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Tata Motors has partnered with Orix Auto Infrastructure Services Limited to provide unique ownership plans to Nexon EV buyers in the country. The brand's flagship electric-SUV is now available for purchase via monthly subscriptions plans. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X