రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ ని ప్రారంభించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి పెట్రోల్ వెర్షన్ రెండవది డీజిల్ వెర్షన్. టాటా నెక్సాన్ యొక్క రెండు వేరియంట్ల ధరలను మనం గమనించినట్లయితే పెట్రోల్ వెర్షన్ రూ. 6.95 లక్షలు. అదే విధంగా డీజిల్ వెర్షన్ రూ. 8.45 లక్షలు. కానీ నవీనీకరించబడిన పెట్రోల్ వెర్షన్ ప్రస్తుతం ఉన్న వెర్షన్ కంటే కూడా రూ. 22 వేలు అధికంగా మరియు డీజిల్ వెర్షన్ రూ. 56 వేలు అధికంగా ఉంటుంది.

రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

నివేదికల ప్రకారం టాటా నెక్సాన్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇది వాహనాలను ఫిబ్రవరి నాటికి డెలివరీ చేయనుంది. స్వల్ప మార్పులను మినహాయించి నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ అదే డిజైన్ మరియు శైలిని అనుసరిస్తుంది.

రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

క్యాబిన్ లోపల కొన్ని నవీకరణలు జరిగాయి. ట్రెడిషినల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటలైజ్డ్ చేయబడింది. ముందు భాగంలో ప్రధాన మార్పు, సవరించిన బంపర్. ఇందులో పునఃరూపకల్పన చేసిన ఫ్రంట్ గ్రిల్‌ తో పాటు రన్నింగ్ లాంప్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. అవి ఒకటి 1.2 పెట్రోల్ యూనిట్, ఇది 110 బిహెచ్‌పి మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.5-లీటర్ డీజిల్ యూనిట్, ఇది 110 బిహెచ్‌పి మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లు రెండూ కూడా ఈ వాహనంలో అందుబాటులో ఉంటాయి. ఇవి బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి.

రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 5 ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది. అవి ఎక్స్ఇ , ఎక్స్ఎమ్, ఎక్స్ జెడ్, ఎక్స్ జెడ్ + మరియు ఎక్స్ జెడ్ +(ఓ). ఇందులో ఎంట్రీ లెవల్ ఎక్స్‌ఇ ట్రిమ్‌కు డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఎసి, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి.

రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇవే కాకుండా రియర్ ఎసి వెంట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, కీలెస్-ఎంట్రీ అండ్ గో, ఆటో వైపర్స్ మరియు హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్‌తో కూడిన ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పవర్డ్ సన్‌రూఫ్ వంటి ఎక్కువ ట్రిమ్‌లను కలిగి ఉంటుంది.

రూ. 6.95 లక్షల ధరతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

గ్లోబల్ ఎన్‌సిఎపి నుండి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందుకున్న టాటా యొక్క మొట్టమొదటి మోడల్ నెక్సాన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. దీనిని ఇటీవల ఆల్ట్రోజ్ అనుసరించింది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ప్రత్యర్థి మారుతి విటారా బ్రెజ్జా. టాటా నెక్సాన్, మారుతి కి మాత్రమే కాకుండా ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికి కూడా ప్రత్యర్థిగా ఉండబోతుంది.

Most Read Articles

English summary
Tata Nexon facelift launched at Rs 6.95 lakh. Read in Telugu.
Story first published: Wednesday, January 22, 2020, 17:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X