టాటా గరుడ లగ్జరీ లిమోసిన్ కారు: ప్రధాన మంత్రుల కోసం..!

టాటా మోటార్స్ కోసం నేషనల్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు టాటా గరుడ ప్రెసిడెన్షియల్ లిమోసిన్ లగ్జరీ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు. టాటా గరుడ కారును ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020 కార్యక్రమంలో ఆవిష్కరించారు.

లగ్జరీ కార్ల తయారీ దిగ్గజాలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలకు దడపుట్టించిన టాటా గరుడ కారు గురించి పూర్తి వివరాలు...

టాటా గరుడ లగ్జరీ లిమోసిన్ కారు: ప్రధాన మంత్రుల కోసం..!

మునుపటితో పోల్చుకుంటే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో చాలా తక్కువ కార్లే ప్రదర్శనకు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఎన్నో ఆసక్తికర మోడళ్లను కంపెనీలు ఆవిష్కరించాయి. ప్రత్యేకించి టాటా సియెర్రా, కియా సోనెట్ మరియు మారుతి సుజుకి ఫ్యూచురో-ఇ కాన్సెప్ట్ వంటి మోడళ్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

టాటా గరుడ లగ్జరీ లిమోసిన్ కారు: ప్రధాన మంత్రుల కోసం..!

ఇవన్నీ ఒక ఎత్తైతే... టాటా ఆవిష్కరించిన గరుడ లగ్జరీ లిమోసిన్ కాన్సెప్ట్ మోడల్ మరో ఎత్తు. నేషనల్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) విద్యార్థుల బృందం ప్రత్యేకించి టాటా మోటార్స్ కోసం డిజైన్ చేసిన టాటా గరుడ లగ్జరీ కారును టాటా ప్రతినిధులు ప్రదర్శించారు.

టాటా గరుడ లగ్జరీ లిమోసిన్ కారు: ప్రధాన మంత్రుల కోసం..!

ఎన్ఐడీ విద్యార్థులు తయారు చేసిన ప్రెసిడెన్షియల్ లిమోసిన్ టాటా గరుడ కారును టాటా మోటార్స్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డెవలప్ చేశారు. టాటా గరుడ ఫ్రంట్ డిజైన్‌లో టాటా హ్యారియర్, గ్రావిటాస్ మరియు ఇటీవల రివీల్ చేసిన టాటా హెచ్‌బీఎక్స్ కాన్సెప్ట్‌లో వచ్చినటువంటి స్ల్పిట్ హెడ్ ల్యాంప్ సెట్ అందించారు.

టాటా గరుడ లగ్జరీ లిమోసిన్ కారు: ప్రధాన మంత్రుల కోసం..!

అతి త్వరలో విడుదల కానున్న టాటా గ్రావిటాస్ 7-సీటర్ ఎస్‌యూవీలో హ్యుమానిటీ లైన్ట్ మరియు విశాలమైన ఎయిర్ ఇంటేకర్ వచ్చాయి. ఈ రెండు ఎలిమెంట్స్ కూడా టాటా ఇంపాక్ట్ డిజైన్ 2.0-స్టైలింగ్ ఫిలాసఫీ ఆధారంగా వచ్చాయి.

టాటా గరుడ లగ్జరీ లిమోసిన్ కారు: ప్రధాన మంత్రుల కోసం..!

పొడవాటి టాటా గరుడ కారు కోసం 26-స్పోక్ అల్లాయ్ వీల్స్ డిజైన్ చేశారు. ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో టాటా లోగోతో కూడిన స్పెషల్ బ్యాడ్జింగ్స్ వచ్చాయి. మూడు బాణాల గుర్తుతో కూడిన బ్లాక్ రూఫ్ టాప్ వచ్చింది. రియర్ డిజైన్‌లో ఎల్ఈడీ సిగ్నేచర్ లైట్లు, ఇరువైపులా ఉన్న ఈ లైట్లను కలుపుతూ మధ్యలో ఎర్రటి ఎల్ఈడీ లైటింగ్ స్ట్రిప్ వచ్చింది.

డీప్ డార్క్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న టాటా గరుడ రోడ్డు మీదకొస్తే చక్కటి రూపాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి పొడవాటి లిమోసిన్ లగ్జరీ కార్లు ఇప్పటి వరకూ ఇండియన్ రోడ్డెక్కలేదు. టాటా గరుడ మాత్రం అందర్నీ ఆకర్షించే చక్కటి రోడ్ ప్రెసెన్స్ కలిగి ఉంటుంది.

టాటా గరుడ లగ్జరీ లిమోసిన్ కారు: ప్రధాన మంత్రుల కోసం..!

ప్రధాన మంత్రి, రాష్ట్రపతి అత్యున్నత అధికారులు ఉపయోగించేందుకు కారుకు ముందువైపున జాతీయ జెండాలు, సైడ్ డిజైన్‌లో డోర్లకు చివరి భాగంలో మూడు సింహాల రాజ ముద్రలు ఉన్నాయి.

టాటా గరుడ కారును ప్రస్తుతానికి కాన్సెప్ట్ వెర్షన్‌లో మాత్రమే ప్రదర్శించారు. దీనికి సంభందించిన సాంకేతిక, ఇంటీరియర్, భద్రతా మరియు ఇన్ఫర్మేషన్ ఫీచర్లను టాటా వెల్లడించలేదు. ఇది కనుక పూర్తి స్థాయిలో విడుదలైతే, పారిశ్రామిక దిగ్గజాలతో పాటు ప్రపంచ దేశాల ప్రధానులకు ఇదొక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Source: Timesnownews

Most Read Articles

English summary
Tata Garuda presidential limousine: A concept that you may have missed at Auto Expo 2020. Read in Telugu
Story first published: Tuesday, February 18, 2020, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X