జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ పాపులర్ హారియర్ ఎస్‌యూవీని మొట్టమొదటిసారిగా 2019 జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ ఎస్‌యూవీ దేశీయ విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. గత లాక్‌డౌన్ కారణంగా అమ్మకాలు కాస్తంత తగ్గినా, ప్రస్తుతం ఈ మోడల్‌కు డిమాండ్ జోరందుకుంది.

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్, టాటా బ్రాండ్ యొక్క సరికొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్‌తో ఇది కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అమ్మకాలు స్వల్పంగా పెరగడం ప్రారంభించాయి. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి.

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

గడచిన జూన్ 2020తో పోలిస్తే, టాటా మోటార్స్ జులై 2020లో మొత్తం 984 హారియర్ ఎస్‌యూవీలను విక్రయించి 33 శాతం వృద్ధిని కనబరిచింది. జూన్ 2020లో 653 యూనిట్ల హారియర్ వాహనాలు అమ్ముడుపోయాయి. గత జూన్ నెలతో పోల్చుకుంటే 33 శాతం, గతేడాది జులై 2019 నెలతో పోల్చుకుంటే 25 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

టాటా హారియర్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో ఎమ్‌జి హెక్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా హారియర్ మాన్యువల్ వేరియంట్ ధరలు రూ.13.69 లక్షల నుండి రూ.18.95 లక్షల మధ్యలో ఉండగా, ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.16.25 లక్షల నుండి రూ.20.25 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

టాటా హారియర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 2.0 లీటర్ ‘క్రయోటెక్' డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్‌తో పాటుగా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

ఈ కారులోని కొన్ని ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్, 17-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు తొమ్మిది స్పీకర్లతో కూడిన జెబిఎల్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌లకు మద్దతు ఇచ్చే 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 7-ఇంచ్ కలర్ ఎమ్ఐడి, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

టాటా హారియర్ ఎస్‌యూవీలోని ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆరు ఎయిర్‌బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా హారియర్‌లో హిల్ స్టార్ట్ అసిస్ట్, సీట్-బెల్ట్ రిమైండర్‌, హై-స్పీడ్ అలెర్ట్ మరియు హిల్-డీసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

టాటా హారియర్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, టాటా మోటార్స్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్‌లలో ఒక్కొక్కటి చొప్పున కంపెనీ మరో రెండు కొత్త వేరియంట్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న వేరియంట్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ ఈ కొత్త వేరియంట్లను విడుదల చేయనుంది - ఈ కొత్త వేరియంట్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

జులైలో టాటా హారియర్ హవా - జూన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధి

టాటా హారియర్ జులై సేల్స్ రిపోర్ట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం టాటా మోటార్స్‌కు హారియర్ ఎస్‌యూవీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. ఆకట్టుకునే డిజైన్ మరియు టాటా యొక్క సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ ఎస్‌యూవీ వివిధ ధరల శ్రేణిలో అన్ని వర్గాల కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులో పరిమిత ఇంజన్ ఆప్షన్స్ ఉన్న నేపథ్యంలో, పోటీని తట్టుకునేందుకు కంపెనీ ఇందులో టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఆఫర్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Most Read Articles

Read more on: #టాటా
English summary
Tata Motors first launched the Harrier in India back in January 2019. The SUV featured the brand's latest Impact 2.0-design with a split-headlamp setup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X