టాటా టియాగో 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గుజరాత్‌లోని తమ సనంద్ ప్లాంట్ నుండి 3,00,000వ టియాగోను విడుదల చేసినట్లు ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో, టాటా బ్రాండ్‌కు కొత్త మైలురాయిని సాధించి పెట్టింది. టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ క్రింద ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి మోడల్ టాటా టియాగో.

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ మొట్టమొదటిసారిగా 2016లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. డిజైన్, టెక్నాలజీ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా ఇది టాటా బ్రాండ్‌కు మంచి పేరును తీసుకువచ్చింది. ఆగస్టు 2018లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా టాటా టియాగో నిలిచింది.

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

ఈ ఏడాది ప్రారంభంలో, టాటా మోటార్స్ తమ టియాగోలో బిఎస్6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత ఇది దాని లైనప్‌లో బ్రాండ్ యొక్క కొత్త ‘ఫరెవర్' శ్రేణి మోడళ్లలో భాగమైంది. టాటా టియాగో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో 4-స్టార్ అడల్ట్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.

MOST READ:హెల్మెట్ లేదని ఆటో డ్రైవర్‌కి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు ; ఎక్కడో తెలుసా ?

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

ప్రస్తుతం టాటా మోటార్స్‌కు టాటా టియాగో ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉంది. మార్కెట్లో దీని ధరలు రూ.4.69 లక్షల నుండి రూ.6.73 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కారును సులువుగా సొంతం చేసుకునేందుకు ప్రస్తుతం ఈ మోడల్‌పై కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు సులువైన ఫైనాన్సింగ్ పథకాలను కూడా అందిస్తోంది.

MOST READ:10 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన మొదటి ఇన్నోవా కారు ఇదే.. చూసారా ?

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

బిఎస్6 అప్‌డేట్ చేసిన తరువాత, టాటా టియాగోను కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో విక్రయిస్తున్నారు. ఇందులోని 1.2-లీటర్, త్రీ-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

ఈ హ్యాచ్‌బ్యాక్‌లోని ఇతర ఫీచర్లలో హెక్సాగనల్ ఆకారంలో ఉండే ఫ్రంట్ గ్రిల్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్-ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:త్వరలో రానున్న మహీంద్రా 5 డోర్స్ మోడల్, ఇది ఎలా ఉంటుందో తెలుసా ?

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

టాటా టియాగో ఈ విభాగంలో డాట్సన్ గో, హ్యుందాయ్ శాంత్రో, మారుతి సుజుకి సెలెరియో మరియు వ్యాగన్ ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. టాటా మోటార్స్ త్వరలోనే ఈ హ్యాచ్‌బ్యాక్‌లో కొన్ని స్పెషల్ ఎడిషన్లను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ఎక్సో, క్యామో, డార్క్ ఎడిషన్లు ఉండనున్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా టియాగో @ 3,00,000 యూనిట్స్: ఉత్పత్తిలో కొత్త మైలురాయి

టాటా టియాగో ప్రొడక్షన్ మైల్‌స్టోన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్‌కు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఎంతో ముఖ్యమైన మోడల్. భారతదేశంలో ఇది ప్రీమియం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా బ్రాండ్‌కు మంచి పురోగతిని తెచ్చిపెట్టింది. టాటా టియాగో సొగసైన రూపాన్ని కలిగి ఉంది, దేశంలోని యువ మరియు పరిణతి చెందిన కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

MOST READ:కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

Most Read Articles

English summary
Tata Motors will be launching a new powerful variant of the Altroz hatchback in the market. The premium hatchback will be receiving a new turbo-petrol engine from the company and is expected to arrive sometime during the festive season this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X