టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

సేఫ్టీలో టాటా కార్లు మరోసారి బెస్ట్ అనిపించుకున్నాయి. టాటా అందిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. టియాగో ఈ విభాగంలో దాని కాంపిటీటర్లతో పోల్చుకుంటే, బెస్ట్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

టాటా టియోగో కారుకు ప్రధాన పోటీదారు అయిన గ్రాండ్ ఐ10 నియోస్ ఇదే క్రాష్ టెస్ట్‌లో కేవలం 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే పొందింది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ ఈ రెండు మోడళ్లను పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా తమ ప్రత్యర్థులను ట్రోల్ చేస్తోంది.

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

కంపెనీ ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం, "మీరు కాగితంపై గ్రాండ్‌గా ఉండడం ద్వారా మాత్రమే కొందరిని వావ్ అనిపించగలరు. గ్లోబల్ ఎన్‌సిపి ద్వారా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన బెస్ట్ ఇన్ సెగ్మెంట్ సేఫ్టీతో కూడిన కొత్త టాటా టియాగోతో మీ డ్రైవ్‌లను #మరింత సరదాగా మరియు అద్భుతంగా మార్చుకోండి" అంటూ పేర్కొంది.

MOST READ:బాగా దాహంగా ఉన్న ఏనుగు రోడ్డుపై ఏం చేసిందో తెలుసా.. అయితే వీడియో చూడండి

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

ఈ స్టేట్‌మెంట్‌తో పాటుగా, టాటా మోటార్స్ రోమన్ సంఖ్యలలో 2 మరియు 4 సంఖ్యలను ప్రదర్శిస్తూ రెండు కంటే నాలుగు పెద్దదంటూ ఓ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. అంతేకాకుండా, ఫొటోకి దిగువన క్రింది భాగంలో ఇదేమీ గ్రాండ్ సైన్స్ కాదు, ఇదొక సింపుల్ మ్యాత్స్ అంటూ పేర్కొంది. ఇందులో రోమన్ సంఖ్యకు బదులుగా టాటా మోటార్స్ i లెటర్‌ను ఉపయోగించింది, ఇదే లెటర్‌ను హ్యుందాయ్ తమ i10, i20 మోడళ్లలో ఉపయోగిస్తుంది.

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

టాటా టియాగో సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే, జిఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 5 స్టార్లకు గాను 4 స్టార్లను సాధించింది. ఇది వయోజన భద్రత కోసం 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను మరియు పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు గాను 34.15 పాయింట్లను దక్కించుకుంది.

MOST READ:ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలవనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 [డ్రైవ్ వీడియో]

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

ఇకపోతే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ క్రాష్ పరీక్ష ఫలితాలను ప్రకారం, ఈ హ్యాచ్‌బ్యాక్ వయోజన రక్షణ కోసం 17 పాయింట్లలో 7.05 పాయింట్ల స్కోరు సాధించగా, పిల్లల ఆక్యుపెన్సీ రక్షణ కోసం 49 పాయింట్లకు గాను నుండి 15 పాయింట్లను తెచ్చుకుంది.

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

టాటా టియాగో కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, (ఏబిఎస్) యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ (సిఎస్‌సి) కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ (ఇబిడి) ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

ఈ రెండు మోడళ్లను పోలిస్తే, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కూడా ఇలాంటి భద్రతా పరికరాలనే కలిగి ఉంది. ఇందులో కూడా డ్యూయెల్-ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో ఏబిఎస్, అసిస్ట్ గైడ్‌లైన్స్‌తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్స్ అండ్ లోడ్ లిమిటర్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

అయితే, గ్రాండ్ ఐ10 నియోస్ క్రాష్ పరీక్ష ఫలితం ప్రకారం, ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క బాడీ షెల్ మరియు ఫ్రంట్ ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నట్లు గ్లోబల్ ఎన్‌సిఏపి గుర్తించింది. దీని ఫలితం వయోజనుల శరీరం యొక్క దిగువ భాగానికి ప్రాణాంతకం కాని గాయాలు అవుతాయని మరియు పిల్లల డమ్మీ తలకు తీవ్ర గాయాలు కావటాన్ని గ్లోబల్ ఎన్‌సిఏపి నివేదిక చెబుతోంది.

MOST READ:రోడ్డెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ బస్సులు.. ఎక్కడో తెలుసా..!

టాటా టియాగో vs హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: సేఫ్టీలో ఏది బెస్ట్?

టాటా టియోగో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో తమ కార్ల సేఫ్టీని భారీగా మెరుగుపరచిందనే చెప్పాలి. ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా టియాగో తమ ప్రత్యర్థుల కంటే మెరుగైన సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది.

Most Read Articles

English summary
Tata Motors has given the Indian market some of the safest cars scoring 4-star and 5-star safety rating awarded by Global NCAP. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X