టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న కొన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త ఫైనాన్స్ పథకం క్రింద వినియోగదారులకు నెలవారీ వాయిదాలలో ఆరు నెలల తాత్కాలిక మారటోరియం (వాయిదా)ను కంపెనీ అందిస్తోంది.

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

ఏదేమైనప్పటికీ, కస్టమర్లు ఈ మారటోరియం కాలంలో ఈఎమ్ఐని చెల్లించకపోయినా వడ్డీని మాత్రం చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫైనాన్స్ స్కీమ్ క్రింద చేర్చబడిన మోడళ్లలో టాటా టియాగో, టాటా నెక్సాన్ మరియు టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి.

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

టాటా మోటార్స్ ఈ మూడు మోడళ్లపై ఈఎమ్ఐని తాత్కాలికంగా వాయిదా వేయటంతో పాటుగా, కంపెనీ అనేక ఇతర ఆర్థిక పథకాలను కూడా అందిస్తోంది. ఇందులో జీరో డౌన్ పేమెంట్, ఐదేళ్ల కాలానికి ఫోర్-వీలర్ లోన్‌పై 100 శాతం ఆన్-రోడ్ ఫండింగ్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

MOST READ: అకడమిక్ సిలబస్ లో చేరనున్న ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ; ఎక్కడో తెలుసా ?

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

టాటా మోటార్స్ భారతదేశంలోని పురాతన మరియు విశ్వసనీయ బ్యాంకింగ్ సంస్థలలో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్ (కెవిబి)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జీతం మరియు స్వయం ఉపాధి ఆధారంగా అర్హతను బట్టి కస్టమర్లకు ఈ కొత్త ఫైనాన్స్ పథకాన్ని ఆఫర్ చేయటం జరుగుతుంది.

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభ సమయంలో నెలకొన్న ఉపాధి అనిశ్చితి కారణంగా, కారు కొనుగోలు భారమైన కస్టమర్లకు సహరించేలా ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ క్రింద కారును కొనుగోలు చేసే కస్టమర్లు, కొనుగోలు చేసిన తేదీ నుండి మొదటి ఆరు నెలల పాటు ఎలాంటి ఈఎమ్ఐని చెల్లించాల్సిన అవసరం లేదు, కాకపోతే, వడ్డీని మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

MOST READ: పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రారంభించడంతో పాటుగా, టాటా మోటార్స్ అనేక ఇతర ఫైనాన్సింగ్ కంపెనీలతో కూడా భాగస్వామ్యాన్ని కుదుర్చుకొని ఎనిమిది సంవత్సరాల వరకు దీర్ఘకాలిక రుణాలను మరియు స్టెప్-అప్ ఈఎమ్ఐ స్కీమ్‌లను కూడా అందిస్తోంది. కస్టమర్ అవసరాలకు తగినట్లుగా ఫైనాన్సింగ్ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కేవలం రూ.5,555 ప్రారంభ ఈఎమ్ఐతో ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నెక్సాన్ కాంపాక్ట్-ఎస్‌యూవీ మరియు బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ టియాగో మోడళ్లకు కూడా వరుసగా ఈఎమ్ఐలు రూ.7,499 మరియు రూ.4,999 నుండి ప్రారంభమవుతాయి.

MOST READ: టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

కొత్త ఫైనాన్స్ పథకాన్ని లేదా పైన పేర్కొన్న ఏదైనా ఆఫర్‌ను పొందాలనుకునే ఫ్యూచర్ కస్టమర్లు తమకు సమీపంలో ఉండే టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, కస్టమర్లు తమ ఆన్‌లైన్ సేల్స్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘క్లిక్ టు డ్రైవ్'ని సందర్శించి కూడా ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

ఈ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు అమ్మకాల విచారణతో పాటు, టెస్ట్ డ్రైవ్‌ను కూడా అభ్యర్థించవచ్చు మరియు తమకు నచ్చిన వాహనాన్ని బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తమకు ఇష్టమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌ను కూడా కస్టమర్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ‘క్లిక్ టు డ్రైవ్' సాయంతో తమ ఇంటి నుంచే తనకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో కారు కొనుగోలు చేయటానికి ఇది సురక్షితమైన మార్గం అని కంపెనీ పేర్కొంది.

MOST READ: 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

టాటా టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ కార్లపై 6 నెలల మారటోరియం - వివరాలు

టాటా కార్లపై 6 నెలల ఈఎమ్ఐ మారటోరియంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కష్ట కాలంలో వాహన యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు టాటా మోటార్స్ పరిచయం చేసిన ఈ కొత్త ఫైనాన్స్ స్కీమ్ నిజంగా బెస్ట్ ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి మరియు సామాజిక దూరం అవసరం కారణంగా వ్యక్తిగత రవాణాపై ఇన్వెస్ట్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది సహాయపడుతుంది. కస్టమర్ కోరుకున్న ప్రదేశంలో ఆన్ డిమాండ్ టెస్ట్ డ్రైవ్‌లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Most Read Articles

English summary
Tata Motors has announced the launch of a novel and attractive financing offer on its select models in the line-up. The new finance scheme offers customers a six-month moratorium on monthly installments. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X