మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి పోటీగా వస్తోన్న టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడొక ఫుల్ సైజ్ ఎస్‌యూవీపై వర్క్ చేస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా అర్బన్ స్టైల్ డిజైన్‌తో తయారు చేసిన సరికొత్త టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

కోవిడ్-19 కారణంగా ఇతర ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త వాహనాల విషయంలో సమస్యలు ఎదుర్కుంటున్నట్లు గానే టాటా మోటార్స్ కూడా తమ సరికొత్త గ్రావిటాస్ విడుదలలో ఇబ్బందులు ఎదుర్కుంది. వాస్తవానికి దేశంలో పరిస్థితులు ఇదివరకటిలా ఉంటే టాటా గ్రావిటాస్ ఇప్పటికే మార్కెట్లో విడుదలై, రోడ్లపై పరుగులు తీస్తూ ఉండేది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తమ సరికొత్త గ్రావిటాస్ ఎస్‌యూవీని తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. తొలి ప్రదర్శనలోనే విమర్శకులను సైతం టాటా గ్రావిటాస్ మెప్పించింది. ప్రస్తుతం ఈ టాటా గ్రావిటాస్ ఎస్‌యూవికి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.

MOST READ: సివిక్ డీజిల్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన హోండా, డెలివరీస్ ఎప్పుడంటే?

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న హ్యారియర్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసికొని ఈ సరికొత్త టాటా గ్రావిటాస్ ఎస్‌యూవిని తయారు చేశారు. 7-సీటర్ సీట్ కాన్ఫిగరేషన్‌తో విడుదల కానున్న ఈ గ్రావిటాస్ ఎస్‌యూవీలో హ్యారియర్ మోడల్‌కు సంబంధించిన అనేక ఉపకరణాలను, డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్లను ఉపయోగించారు. గ్రావిటాస్ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

పైన చెప్పుకున్నట్లు గానే, టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ డిజైన్‌ని గమనిస్తే, టాటా హ్యారియర్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసినట్లు అనిపిస్తుంది. హ్యారియర్‌తో పోల్చుకుంటే గ్రావిటాస్ 62 ఎమ్.ఎమ్. ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. ఫలితంగా మూడవ వరుస సీట్లలోని ప్యాసింజర్లకు మరింత ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది.

MOST READ: ఆలస్యంగా పట్టుబడ్డ ఘరానా దొంగ ; 13 బైకులు స్వాధీనం

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

ఇంటీరియర్లలో కూడా టాటా హ్యారియర్‌లోని అనేక ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి. మూడవ వరుసలో కూర్చునే ప్రయాణీకుల కోసం థర్డ్ రో ఏసి వెంట్స్, ఒక్క బటన్‌తో మడుచుకోగలిగే వన్ టచ్ ఫోల్డింగ్ మిడిల్ రో సీట్స్, మూడవ వరుసలోకి సులువుగా ప్రవేశించేందుకు, దిగేందుకుగా వీలుగా ఉండే యాక్సెస్ వంటి ఫీచర్లున్నాయి. భారత మార్కెట్ కోసం టాటా గ్రావిటాస్ రెండవ వరుసలో కెప్టెన్ సీట్లతో ఓ 6-సీటర్ వేరియంట్ అలాగే మద్య వరుసలో బెంచ్ సీట్లతో మరో 7-సీటర్ వేరియంట్లను కంపెనీ తయారు చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

ఇంజన్‌లో కూడా హ్యారియర్‌కి, గ్రావిటాస్‌కి ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. టాటా హ్యారియర్‌లో ఉపయోగించిన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌నే కొత్త టాటా గ్రావిటాస్‌లోనూ ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆప్షనల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమయ్యే ఆస్కారం ఉంది.

MOST READ: కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

భారత కార్ మార్కెట్లో టాటా గ్రావిటాస్ ఈ సెగ్మెంట్లోని మహీంద్రా ఎక్స్‌యూవీ500, జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీలతో పోటీ పడే ఆస్కారం ఉంది. టాటా మోటార్స్ తమ ఇదివరకటి వాహనాల మాదిరిగానే టాటా గ్రావిటాస్‌ను చాలా కాంపిటీటివ్ ధరకే విడుదల చేయవచ్చని అంచనా.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడల్‌కి వస్తోన్న పోటీగా టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ!

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ సంస్థకు ఫుల్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో గ్రావిటాస్ మంచి డిమాండ్‌ను తెచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకర్షనీయమైన డిజైన్ మరియు అధిక సీటింగ్ సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఈ ఎస్‌యూవీ రానున్న పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

Most Read Articles

English summary
The Tata Gravitas SUV is expected to be the next model that will be launched by the brand in India. The company is expected to launch the upcoming SUV during the festive season this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X