Just In
- 57 min ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
- 1 hr ago
కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి
- 2 hrs ago
గుడ్ న్యూస్.. బిఎమ్‌డబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే M స్పోర్ట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసిందోచ్
- 3 hrs ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
Don't Miss
- Finance
కరోనా టైంలో ముఖేష్ అంబానీ ప్రతి గంట సంపాదన రూ.90 కోట్లు, వారి సంపద రూ.3వేలే!
- Lifestyle
రాత్రి ఫోన్ వాడకుండా జాగ్రత్త వహించండి .. డేంజర్ !!
- News
పెళ్లికి పెద్దల ‘నో’: జగిత్యాలలో యువతి, దుబాయ్‌లో యువకుడు బలవన్మరణం
- Sports
విమాన ప్రమాదంలో నలుగురు ఆటగాళ్లు మృతి!!
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు..
టాటా మోటార్స్ కూడా తమ ఉత్పత్తులపై డిసెంబర్ 2020 నెలలో భాగంగా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. ఈనెలలో టాటా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ భారీ డిస్కౌంట్లు, ప్రయోజనాలు మరియు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. టాటా మోటార్స్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలోని 'ఫరెవర్ రేంజ్'లో ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ ఇయర్ ఎండ్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో టియాగో, టిగోర్, నెక్సాన్ మరియు హారియర్ మోడళ్లు ఉన్నాయి.

డిసెంబర్ 2020 నెలలో కంపెనీ తమ ఉత్పత్తులపై నగదు తగ్గింపులు, మార్పిడి ప్రయోజనాలు (ఎక్సేంజ్ బెనిఫిట్స్) మరియు ఇతర ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ఈ సమయంలో కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.65,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31, 2020 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి.

టాటా ప్రోడక్డ్ పోర్ట్‌ఫోలియోలో లభిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోపై ఈ నెలలో కంపెనీ గరిష్టంగా రూ.25,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు మరియు మీ పాత కారును డీలర్‌కు విక్రయించేటప్పుడు రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభిస్తాయి.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం సింగిల్-ఇంజన్ ఆప్షన్‌తో ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మార్కెట్లో టియాగో ధరలు రూ.4.7 లక్షల నుండి రూ.6.74 లక్షల మధ్యలో ఎక్స్-షోరూమ్ (ఇండియా) ఉన్నాయి.

టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్. టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని టిగోర్ సెడాన్‌ను రూపొందించారు. డిసెంబర్ నెలలో టాటా టిగోర్‌పై కంపెనీ రూ.30,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు మరియు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్

టాటా టియోగో మాదిరిగానో టాటా టిగోర్ కూడా ఒకేరకమైన ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో టాటా టిగోర్ ధరలు రూ.5.39 లక్షల నుంచి రూ.7.49 లక్షల మధ్యలో ఎక్స్-షోరూమ్ (ఇండియా) ఉన్నాయి.

టాటా మోటార్స్ నుండి అత్యధికంగా అమ్ముడుపోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌పై కంపెనీ ఈసారి కేవలం ఎక్సేంజ్ బోనస్‌ను మాత్రమే అందిస్తోంది. ఈ నెలలో నెక్సాన్ డీజిల్ వేరియంట్‌లపై కంపెనీ రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌లపై ఎలాంటి ఆఫర్లు లేవు.
MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?

టాటా బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీ మోడళ్లలో ఒకటైన నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రెలో మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. రెండు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.12.70 లక్షల మధ్య ఎక్స్‌షోరూమ్ (ఇండియా)లో ఉన్నాయి.

టాటా మోటార్స్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా హారియర్‌పై కంపెనీ గరిష్టంగా డిసెంబర్ 2020 నెలలో రూ.65,000 వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు మరియు రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ:జావా బైక్‌పై కనిపించిన మలయాళీ యాక్టర్ ; ఎవరో తెలుసా ?

అయితే, ఇందులో క్యాష్ డిస్కౌంట్ ఆఫర్లు ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జెడ్ఏ+ మరియు మార్కెట్లో ప్రత్యేకంగా విక్రయించే క్యామో మరియు డార్క్ ఎడిషన్ మోడళ్లకు వర్తించవు. టాటా హారియర్ ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జడ్ఏ+, క్యామో మరియు డార్క్ ఎడిషన్ వేరియంట్‌లపై రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తున్నారు.

టాటా మోటార్స్ ఇయర్ ఎండ్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మార్కెట్లోని ఇతర కంపెనీల మాదిరిగానే టాటా మోటార్స్ కూడా తమ ఉత్పత్తులపై ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించి తమ వార్షిక అమ్మకపు లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తోంది. మంచి డీల్‌లో టాటా కారుని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు.