'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' క్యాంపైన్ ప్రారంభం - వివరాలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ 'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' పేరిట ఓ కొత్త క్యాంపైన్‌ను ప్రారంభించింది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసినదే. ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల డీలర్‌షిప్‌లు ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయనేది వినియోగదారులు తెలుసుకునేలా ఈ ప్రణాళికను ప్రారంభించారు.

'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' క్యాంపైన్ ప్రారంభం - వివరాలు

'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' ప్రణాళికలో వినియోగదారులకు డీలర్‌షిప్‌ల నుండి పూర్తిగా పరిశుభ్రమైన కొత్త వాహనాన్ని పంపిణీ చేయబడుతుంది. అంతేకాకుండా, 'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' అని నిర్ధారించేందుకు గాను ప్రత్యేకంగా రూపొందించిన లేబుల్స్‌ను వాహనం శానిటైజేషన్ చేసిన తర్వాత అంటించబడుతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వాహనం కస్టమర్‌కు డెలివరీ అయ్యే వరకు డీలర్‌షిప్ బృందంలోని ఏ సిబ్బంది కూడా సదరు శానిటైజ్డ్ వాహనాన్ని తాకరు.

'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' క్యాంపైన్ ప్రారంభం - వివరాలు

సామాజిక దూర నిబంధనలను అనుసరించడానికి, అన్ని డీలర్‌షిప్‌లు వాట్సాప్, ఇ-మెయిల్ లేదా వీడియో కాల్స్ వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి వినియోగదారులతో చర్చలు జరుపుతున్నాయి. వాహన భీమా మరియు రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు మెయిల్ ద్వారా లేదా ప్రత్యేకంగా వ్యవస్థాపించిన డ్రాప్ బాక్సుల ద్వారా సేకరించబడుతున్నాయి. ఇలా అన్ని ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాతే కొత్త వాహన డెలివరీలు జరుగుతున్నాయి.

MOST READ:ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' క్యాంపైన్ ప్రారంభం - వివరాలు

అంతేకాకుండా, కస్టమర్ కోరుకున్న ప్రదేశంలో డిమాండ్ ఆన్ టెస్ట్ డ్రైవ్‌లను కూడా కంపెనీ అందిస్తోంది. కేవలం కస్టమర్ మాత్రమే వెనుక సీట్లో కూర్చున్న డీలర్ సిబ్బందితో పాటు కారును టెస్ట్ డ్రైవ్ చేస్తారు. టెస్ట్ డ్రైవ్‌లు పూర్తయిన తర్వాత, వాహనాన్ని తిరిగి పూర్తిగా శానిటైజ్ చేస్తారు. సీట్స్ మరియు స్టీరింగ్ వంటి భాగాలను రక్షించే ప్రొటెక్టివ్ కవర్లను కూడా పూర్తిగా రీప్లేస్ చేస్తారు.

'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' క్యాంపైన్ ప్రారంభం - వివరాలు

ఈ కొత్త ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) హెడ్ మార్కెటింగ్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, "టాటా మోటార్స్ వద్ద మాకు, మా వినియోగదారులకు మరియు మా డీలర్లకు అన్ని సమయాలలో భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇందుకు అవసరమైన సామాజిక దూరాన్ని నిర్వహించడానికి, వాహనాలతో శారీరక సంబంధాన్ని తగ్గించడానికి మరియు పరిశుభ్రత మరియు శానిటైజ్ స్థాయిలను పెంచడానికి మేము అన్ని డీలర్‌షిప్‌లు మరియు సేవా కేంద్రాల వద్ద అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని" అన్నారు.

MOST READ:దుమ్మురేపుతున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఫస్ట్ టీజర్

'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' క్యాంపైన్ ప్రారంభం - వివరాలు

"కొత్తగా ప్రారంభించిన 'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' ప్రణాళిక ద్వారా డీలర్‌షిప్ కేంద్రాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అనే విషయాన్ని మా కస్టమర్లకు తెలియజేయటం ద్వారా, వారిలో మాపై విశ్వాసాన్ని పెంచుతున్నాం మరియు టాటా మోటార్స్‌తో నిమగ్నమయ్యేటప్పుడు వారు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారని వారికి భరోసా ఇస్తున్నాం. ఈ కొత్త ప్రణాళికతో వినియోగదారులకు మా 'న్యూ ఫరెవర్' శ్రేణి కార్లను మరియు ఎస్‌యూవీలను సౌకర్యవంతంగా యాక్సెస్ చేయడంలో సహాయపడుతుందని" అన్నారు.

'శానిటైజ్డ్ బై టాటా మోటార్స్' క్యాంపైన్ ప్రారంభం - వివరాలు

టాటా మోటార్స్ కొత్త ప్రణాళికపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కొత్త ప్రణాళిక ద్వారా ఇప్పుడు వినియోగదారులు తమ కొత్త టాటా కారును కొనబోతున్నప్పుడు ఆరోగ్యం మరియు పరిశుభ్రత సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టాటా మోటార్ మాత్రమే కాదు, ఈ ప్రపంచ సంక్షోభ సమయంలో వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రతి కార్ల తయారీదారులు తమ వంతు కృషి చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.

MOST READ:డీజిల్ కార్ అమ్మకాలకు శాపంగా మారిన బిఎస్ 6 రూల్స్, ఎందుకంటే ?

Most Read Articles

English summary
Tata Motors has launched a new initiative called 'Sanitised by Tata Motors'. This initiative has been launched so that the customers can come to know what all safety measures are the car dealerships going through during this nationwide lockdown due to the COVID-19 pandemic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X