Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టెస్లా ఖాతాలో మరో విజయం, ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన బ్రాండ్!
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఇప్పటికే విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి మనందరికీ తెలిసినదే. కాగా.. టెస్లా ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన ఆటోమొబైల్ తయారీదారుగా పేరు దక్కించుకుంది. టెస్లా పరిచయం చేసిన సెమీ కమర్షియల్ ట్రక్కు పూర్తిస్థాయిలో ఉత్పత్తికి సిద్ధంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

ఈ వార్త ప్రపంచానికి తెలియటంతో అంతర్జాతీయ మార్కెట్లో టెస్లా స్టాక్ విలువ ఏకంగా 6 శాతం పెరిగింది. ప్రస్తుతం ప్రతి షేరు విలువ వెయ్యి డాలర్లకు పైగా పెరిగింది. టెస్లా అధికారిక ట్విట్టర్ ఖాతా అయిన టెస్లా డైలీ తన అకౌంట్లో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. తాము ఇప్పుడు ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన ఆటోమోటివ్ తయారీదారుగా అవతరించినట్లు పేర్కొంది.

ఇప్పటి వరకూ ఈ స్థానంలో జపాన్‌కు చెందిన టొయోటా ఉండగా, టొయోటాను టెస్లా పక్కకు నెట్టి ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన ఆటోమోటివ్ తయారీదారుగా అగ్రస్థానంలో నిలిచింది. టెస్లా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలన్ మస్క్, తన సిబ్బందికి పంపిన ఈమెయిల్ ప్రకారం, తమ సెమీ కమర్షియల్ ట్రక్ పూర్తిస్థాయిలో ఉత్పత్తికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
MOST READ: మలేషియా పోలీస్ ఫోర్స్‌లో చేరిన హోండా సివిక్ కార్లు

కాగా.. ఆ ఈ-మెయిల్లో ఎప్పటి నుండి తమ సెమీ కమర్షియల్ ట్రక్కులను ఉత్పత్తి చేస్తారనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించక పోయినప్పటికీ, ఈ వాహనాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయటానికి కంపెనీ సిద్ధంగా ఉందని మాత్రం పేర్కొన్నారు. ట్విట్టర్లో ఓ అభిమాని ఈ-మెయిల్ పేర్కొన్నట్లుగా వాహనాల ఉత్పత్తి నిజమేనా అని అడిగిన ప్రశ్నకు మస్క్ అవునని సమాధానం ఇచ్చారు.

టెస్లా మార్కెట్ క్యాప్ 184 బిలియన్ డాలర్లను అధిగమించడంతో 179 బిలియన్ డాలర్ల విలువగల జపనీస్ ఆటో దిగ్గజం టయోటా ద్వితీయ స్థానానికి పరిమితమైంది. కాగా.. గతేడాది ఒక దశలో టెస్లా షేరు విలువ 760 డాలర్లకు చేరడంతో కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. అత్యంత ఖరీదుగా మారిందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా ఇంక్ షేరు 125 శాతం దూసుకెళ్లడం విశేషం.
MOST READ: కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్

ఎలన్ మస్క్ ప్రకటించిన మిలియన్ మైల్ బ్యాటరీ టెక్నాలజీని కూడా ఆవిష్కరిస్తే చూడాలని ఉందని ఈ బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, ఒక్కసారి బ్యాటరీని చార్జ్ చేసుకుంటే లక్షల కీలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఎక్కువ బ్యాటరీ లైఫ్, తక్కువ ఖర్చు, సుధీర్ఘ ప్రయాణం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

గిగా నెవాడాలో ఈ బ్యాటరీ మరియు ఇంజన్ ఉత్పత్తి జరగనుంది. మిగిలిన ఇతర ఉత్పత్తి ప్రక్రియ కొత్త ప్లాంట్‌లో జరుగుతుంది. సెమీ ట్రక్కులలో ఉపయోగించే బ్యాటరీ రకాన్ని 2017లో ఎలన్ మస్క్ ఆవిష్కరించారు. టెస్లా సెమీ ట్రక్ నాలుగు మోటార్లు రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో ఒకటి 480 కిలోమీటర్ల రేంజ్‌ని, మరొకటి 805 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తుంది.
MOST READ: భారత్‌లో ప్రారంభమైన జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ డెలివరీలు

ఈ అధునాతన ఫ్యూచరిస్టిక్ సెమీ ట్రక్కులో ఆటోమేటిక్ ఎమెర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఫార్వార్డ్ కొల్లైజన్ వార్నింగ్, అనేక సాంకేతికతలతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. నడపడానికి అత్యంత సౌకర్యవంతంగా ఉండనున్న ఈ ట్రక్కు కేవలం 5 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

టెస్లా ఇప్పుడు కొత్త ప్లాంట్‌ను నిర్మించేందుకు స్థలం కోసం చూస్తోంది. టెక్సాల్ లేదా ఓక్లహామాలో ఈ కొత్త ప్లాంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
MOST READ: 19 సూపర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్న గురుగ్రామ్ పోలీసులు, ఎందుకో తెలుసా ?

టెస్లా కొత్త విజయంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలోనూ ఎలక్ట్రిక్ సెమీట్రక్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధంకావాలంటూ ఎలన్ మస్క్ తాజాగా సిబ్బందిని కోరడంతో మార్కెట్ సెంటిమెంటు బలపడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి తొలి ప్రొడక్షన్ సెమీ ట్రక్కు టెస్లా నుంచి రావచ్చని అంచనా. భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ మరియు పూర్తి అటానమస్ వాహనాలను తీసుకువచ్చే దిశగా టెస్లా ప్రయత్నాలు చేస్తోంది.