Just In
- 6 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 7 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 7 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 9 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కరోనా భయం ఉన్నప్పటికీ కొత్త మైలురాయిని సాధించిన టెస్లా.. ఎలానో తెలుసా.. !
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా గురించే మొత్తం చర్చ. భారతదేశంలో కూడా కరోనా బాగా విస్తరిస్తోంది. ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలందరూ చాలా భయపడుతున్నారు, అంతే కాకుండా ఇప్పటికే చాల మంది ప్రాణాలను కోల్పోయారు.

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను విస్తరించిన ఈ భయంకరమైన వైరస్ ఇప్పటికే 3 వేలకు పైగా ప్రజలకు సోకింది. అంతే కాకుండా రోజురోజుకి అనేక కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ వల్ల ఒక్క ప్రజలు మాత్రమే కాదు అనేక పరిశ్రమలు కూడా ఈ కరోనా వైరస్ భారిన పడి చాలా నష్టాలలో మునిగిపోయాయి.

ప్రపంచ దేశాలన్నినింటికి వ్యాపించిన ఈ కరోనా వైరస్ చైనాలో పుట్టింది. అంతే కాకుండా చైనాలోని ప్రజలతో పాటు అక్కడున్న కంపెనీలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలో చాల దేశాలు ఈ వైరస్ వల్ల నష్టపోయినప్పటికీ చైనాలోని పరిశ్రమలు మాత్రం మరింత ఎక్కువగా నష్టపోయాయి అని తెలుస్తోంది.

ప్రపంచంలో ఉన్న చాల ఆటోమోటివ్ సంస్థలకు విడిభాగాలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతాయి. ఈ కరోనా కారణంగా ఉత్పత్తులు మాత్రమే కాకుండా దిగుమతులు కూడా తగ్గిపోయాయి.

కరోనా వల్ల చాల దేశాల పరిశ్రమలు ఉత్పత్తులు చాలా వరకు నిలిచిపోయాయి. కానీ చైనాలోని ఒక ప్రధాన నగరంలో టెస్లా విడిభాగాలు మరియు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తులు ఉత్పత్తి చేశామని టెస్లా ఒక ప్రకటనలో తెలిపింది. టెస్లా చేసిన ఈ ప్రకటన చైనాలోని చాలా పరిశ్రమలను ఆందోళనకు గురించేసాయి.

టెస్లా ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు తన ఫ్రీమాంట్ యూనిట్ నుండి 10 లక్షల యూనిట్లను తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ పోస్ట్‌ను టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టెస్లా ఐదు మోడళ్లను విక్రయిస్తుంది. అవి మోడల్ ఎస్, మోడల్ ఎక్స్, మోడల్ 3, మోడల్ వై మరియు జెన్ రోడ్‌స్టర్.

టెస్లా త్వరలో సైబర్ ట్రక్ అనే పికప్ ట్రక్కును విడుదల చేయనుంది. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ తయారీ కర్మాగారంతో పాటు చైనాలోని షాంఘైలో టెస్లాకు ఒక తయారీ కర్మాగారం కూడా ఉంది.

ఈ తయారీ కర్మాగారంలో సంవత్సరానికి రెండున్నర మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం ఉన్నప్పటికీ టెస్లా ఉత్పత్తిలో కొత్త మైలురాళ్లను సాధించింది.

టెస్లా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కార్లలో ఒకటి. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను బిఎమ్‌డబ్ల్యూ కార్ల ఆధారంగా తయారు చేస్తారు. టెస్లా కార్లు అమెరికా వంటి దేశాలలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. టెస్లా సంస్థలో అన్ని మోడళ్ల కార్లతో ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. టెస్లా యొక్క ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలో ఇంకా లాంచ్ కాలేదు.