ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

భారతదేశంలో సాధారణంగా రోడ్డు నియమాలు అందరికి తెలిసిందే. వాహనదారులు రోడ్డు నియమాలను అతిక్రమించినట్లయితే వారికి జరిమానాలు మరియు కొన్ని కఠినమైన శిక్షలు తప్పవు. ఇటీవల కాలంలో వాహనదారులు ఈ క్రింది నియమాలను తప్పినట్లైతే వాహన లైసెన్సు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నియమాలు ఏంటి ఇవి పాటించకపోతే లైసెన్సు ఎందుకు కోల్పోయే అవకాశం ఉంది అనే విషయాలను గురించి మరింత సమాచారం ఇప్పుడు మీ కోసం..

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

ఎక్కువ సౌండ్ మ్యూజిక్ ప్లే చేయడం:

సాధారణంగా వాహనదారులు వారి ప్రయాణంలో సంగీతం వినటం చాలా సర్వసాధారణం. కానీ కొంత మంది వాహనదారులు అత్యుత్సాహంతో సంగీతాన్ని మరింత బిగ్గరగా పెట్టుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సాధారణ సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ తో పబ్లిక్ రోడ్లపై మ్యూజిక్ ప్లే చేసినట్లయితే వారికి జరిమానా విధించడంతో పాటు వారి లైసెన్స్ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

పబ్లిక్ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా తక్కువ సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేసుకోవడం వల్ల ఇటువంటి జరిమానాలు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు జాగ్రత్తపడాలి.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

హెచ్చరించిన ప్రదేశాలలో అతి వేగంతో వెళ్లడం:

పాఠశాలలు, హాస్పిటల్స్ మరియు నిర్మాణ ప్రదేశాలలో మరియు ఇతర సంస్థల పరిసరాలలో వేగం గంటకి 25 కిలోమీటర్లకంటే మించరాదు. ఇటువంటి ప్రదేశాలలో సాధారణంగా హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ వాహనదారులు వీటిని ఏ మాత్రం గమనించకుండా అధికవేగంతో ప్రయాణించడం చట్ట విరుద్ధం.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

హెచ్చరించిన ప్రదేశాలలో నియమిత వేగంతోనే ప్రయాణించాలి. అలా కాకుండా అతి వేగంతో ప్రయాణిస్తే అనుకోని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులందరు ఖచ్చితమైన నిర్దేశించిన వేగంతో ప్రయాణించడం వల్ల ఎటువంటి జరిమానాలు విధించావబాదే అవకాశం ఉండదు.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

ఫోన్ ఉపయోగించడం:

నావిగేషన్ కోసం ఫోన్‌ను ఉపయోగించడం భారతదేశంలో చాలా సాధారణమైంది మరియు చాలా మంది దీన్ని చేస్తారు. నావిగేషన్ ఉపయోగించినందుకు పోలీసులు మీకు జరిమానా విధించలేరు. అయితే ఇది కాకుండా మరేమైనా ఉపయోగిస్తూ అంటే మ్యూజిక్, గేమ్స్ వంటివాటికోసం డ్రైవింగ్ లో మొబైల్ ఉపయోగిస్తే జరిమానాలు తప్పవు.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

కాల్స్ కోసం బ్లూటూత్‌ను ఉపయోగించడం:

ఆధునిక కార్లలో కాల్స్ కోసం బ్లూటూత్ ఉపయోగించడం సాధారణం. అయితే కారు పబ్లిక్ రోడ్‌లో ఉన్నప్పుడు కాల్ చేయడానికి బ్లూటూత్‌ను ఉపయోగించడం వలన మీరు ఇబ్బందుల్లో పడతారు. కారులో ఏ విధంగానైనా మాట్లాడటానికి ఫోన్‌ను ఉపయోగించడం ట్రాఫిక్ నిబంధనల ప్రకారం నేరం. వాహనాలలో బ్లూటూత్ లక్షణం ఉన్నప్పటికీ దాదాపుగా దేనిని డ్రైవింగ్ లో ఉపయోగించకుండా ఉండటం చాలా మంచిది. బ్లూటూత్ ద్వారా మీరు డ్రైవింగ్ లో ఫోన్ మాటాడుతూ పట్టుబడితే మీ లైసెన్స్ పోయే అవకాశం ఉంది.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

పాదచారుల క్రాసింగ్ చేయడం:

దేశంలో కార్లలో ప్రయాణించే వారు చాలా మంది ఉన్నప్పటికీ వారు ప్రయాణించేటప్పుడు రోడ్డుపై నడిచి వెళ్లే పాదాచారులు కూడా దృష్టిలో ఉంచుకుని డ్రైవ్ చేయాలి. అంతే కాకుండా జీబ్రా క్రాసింగ్ వద్ద పాదాచారులు దాటుతున్నప్పుడు వారిని క్రాస్ చేస్తూ ప్రయాణించడం చట్ట రీత్యా నేరం. స్టాప్ లైట్ వద్ద పాదచారుల క్రాసింగ్‌ను అడ్డుకోవడాన్ని ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే మీకు జరిమానా విధించవచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

ఫుట్‌పాత్‌పై డ్రైవ్ చేయడం:

సాధారణంగా ఫుట్‌పాత్ లపై కార్లు ప్రయాణించడానికి అవకాశం లేనప్పటికీ మోటార్ సైక్లిస్టులు చాలా మంది ఫుట్‌పాత్ పై ప్రయాణిస్తూ ఉంటారు. ఫుట్‌పాత్ పై సాధారణంగా పాదచారులు మాత్రమే ప్రయాణించాలి. ఇలా కాకుండా ఈ ఫుట్‌పాత్ లపై వాహనదారులు ప్రయాణిస్తే వారికి జరిమానాలు తప్పవు.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

ప్రెజర్ హారన్స్ ఉపయోగించడం:

ప్రెజర్ హారన్స్ చాలా శబ్ద కాలుష్యాన్ని కలిగించడమే కాక ఇతర రహదారి వినియోగదారులను కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవి పూర్తిగా నిషేధించాలి. సాధారణంగా, మీరు అలాంటి ప్రెజర్ హారన్స్ ఉపయోగించినట్లైతే మీ కారు రహదారి చట్టబద్ధంగా ఉండదు. ఒకవేళ పట్టుబడితే మీ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకోవచ్చు మరియు భారీ జరిమానా విధించవచ్చు.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

హై స్పీడ్ జోన్ల వద్ద లేన్ స్ప్లిట్టింగ్:

చాలా మంది మోటార్ సైక్లిస్థులు రహదారులలో సిగ్నల్స్ వేసినప్పుడు వాహనాలను చాల ముందుకు నిలిచి ఉండటం మనం గమనిస్తూ ఉంటాము. వాహనదారులు కొన్ని నియమాలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి ప్రదేశాలలో అధిక వేగంతో ప్రయాణిస్తే జరిమానాలు తప్పవు, అదే విధంగా మీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

అంబులెన్స్‌లకు దారి ఇవ్వకపోవడం:

సాధారణగా అంబులెన్సులు అత్యవసర పరిస్థితులలో ప్రయాణిస్తూ ఉంటాయి. అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస ధర్మం. అలాకాకుండా అంబులెన్స్ కి దారి ఇవ్వకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

మీ వెనుక అంబులెన్స్ ఉంటె దానికి దారి ఇచ్చేయాలి. ఇటీవల కాలంలో వస్తున్న చాలా అంబులెన్సులు ఇప్పుడు కెమెరాలతో వస్తాయి. ఇవి వాహనాల కదలికలను రికార్డ్ చేస్తాయి. అంబులెన్సు ముందు వున్నా వాహనాలు దాని మార్గానికి అడ్డు పడితే ఈ రికార్డ్ ఆధారంగా పోలీసులు చలాన్ జారీ చేసి మీ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకోవచ్చు.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

పబ్లిక్ రోడ్లపై రేసింగ్:

రేసింగ్‌ను ప్రైవేట్ రోడ్లు, రేస్ట్రాక్‌లకు మాత్రమే పరిమితం చేయాలి. పబ్లిక్ రోడ్లపై రేసింగ్ చెయ్యడానికి మీరు ఇష్టపడితే మీపై కఠినమైన చర్యలు తప్పవు. కాబట్టి నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే రేసింగ్స్ జరపడం మీకు చాలా మంచిది. పబ్లిక్ రోడ్లపై రేసింగ్స్ చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మీ లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉంది.

ఇకపై ఇలా చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టే..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో వాహనదారులందరు ఖచ్చితంగా వాహన చట్టాలను పాటించాలి. ఈ నియమాలను పాటించనట్లైతే కఠిన చర్యలు తీసుకుంటారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వల్ల జరిమానాలు విధించడం సర్వ సాధారణం, కానీ ఇప్పుడు పైన చెప్పిన నిబంధనలను పాటించనట్లైతే కూడా జరిమానా విధించడంతో పాటు, మీ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు మసలుకోవాలి.

Most Read Articles

English summary
10 ways to LOSE your license: 2020 Edition. Read in Telugu.
Story first published: Saturday, February 22, 2020, 10:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X