కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కియా మోటార్స్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'సెల్టోస్'ను భారత మార్కెట్లో విడుదల చేసిన దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా కంపెనీ ఇందులో కొత్త 'యానివర్స్‌రే ఎడిషన్'ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కాగా, తాజాగా కంపెనీ ఇప్పుడు కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. అంతేకాకుండా, కంపెనీ కియా మోటార్స్ ఇందుకు సంబంధించిన ఓ అధికారిక టెలివిజన్ కమర్షియల్‌ను కూడా విడుదల చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను ఈ టివిసిలో చూడొచ్చు.

కియా మోటార్స్ తమ సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌కి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించింది. ఈ కొత్త కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఇ్పపుడు అనేక కొత్త ఫీచర్లు మరియు ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌తో పాటుగా కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌డేట్స్‌ను కలిగి ఉంటుంది. రానున్న వారాల్లోనే ఇది అధికారంగా అమ్మకం కానుంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌ను స్టాండర్డ్ సెల్టోస్ యొక్క 'హెచ్‌టిఎక్స్' మిడ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌యూవీలో కొన్ని ప్రత్యేకమైన అప్‌డేట్స్, ఫీచర్లు మరియు కలర్ ఆప్షన్లు లభ్యం కానున్నాయి.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇందులో మూడు డ్యూయెల్ టోన్ కలర్లు ఉన్నాయి. గ్లాసీయర్ వైట్, స్టీల్ సిల్వర్ మరియు గ్రానైట్ గ్రే కలర్ ఆప్షన్లు అరోరా బ్లాక్ రూఫ్‌తో లభిస్తాయి. ఇకపోతే నాల్గవ కలర్ ఆప్షన్ అయిన అరోరా బ్లాక్ పెరల్ సింగిల్ కలర్‌లో లభిస్తుంది.

MOST READ:ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో చేసిన కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్‌లో ముందు మరియు వెనుక భాగంలో కొత్త స్కిడ్ ప్లేట్లు, ఎస్‌యూవీ చుట్టూ ‘టాన్జేరిన్ ఆరెంజ్' యాక్సెంట్స్‌లో ఫినిష్ చేసిన ఫాగ్ లాంప్ హౌసింగ్, సెంటర్ వీల్ క్యాప్స్, సైడ్ సిల్స్, సెల్టోస్ బ్యాడ్జింగ్ మరియు ఫాక్స్ డ్యూయెల్ మఫ్లర్స్ ఉంటాయి.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఎస్‌యూవీలో కొత్త 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫిన్స్‌తో కూడిన రియర్ స్కిడ్ ప్లేట్స్ ఉంటాయి, ఇవి రెండూ కొత్త ‘రావెన్ బ్లాక్' కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి. ఇంకా ఉందులో లెథెరెట్ సీట్లు, రిమోట్ ఇంజన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇకపోతే, స్టాండర్డ్ సెల్టోస్ హెచ్‌టిఎక్స్ వేరియంట్‌లో కనిపించే అన్ని ఇతర ఫీచర్లు ఈ స్పెషల్ ఎడిషన్‌లో లభిస్తాయి.

MOST READ:తండ్రి ఇచ్చిన కారును అంబులెన్స్‌గా మార్చిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కాగా, కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌లో చేయనున్న అన్ని మార్పలు కాస్మెటిక్‌గా మాత్రమే ఉండనున్నాయి, ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవు. ఈ ఎస్‌యూవీలో ఇదివరకు ఆఫర్ చేసిన ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లే కొత్త యానివర్స్‌రే ఎడిషన్‌లోనూ కొనసాగుతాయి.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ ఐవిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇకపోతే, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కియా మోటార్స్ తమ యానివర్స్‌రే ఎడిషన్ సెల్టోస్ ధరలను ఇంకా ప్రకటించలేదు. హెచ్‌టిఎక్స్ వేరియంట్ ఆధారంగా చూసుకుంటే, ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.34 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో, కొత్తగా వస్తున్న కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ దాని ప్రీమియం ఫీచర్ల కారణంగా కాస్తంత అధిక ధరను కలిగి ఉండొచ్చని అంచనా. మా అంచనా ప్రకారం దీని ధర రూ.13.80 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ ఆవిష్కరణ; టైగర్ ష్రాఫ్‌తో కొత్త టివిసి

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్ టీజర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా సెల్టోస్ యానివర్స్‌రే ఎడిషన్‌ను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయటానికి ముందే, టెలివిజన్ కమర్షియల్ ద్వారా ఆవిష్కరించింది. భారత మార్కెట్లో కియా సెల్టోస్ ఈ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యువి500, టాటా హారియర్ మరియు జీప్ కంపాస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Kia Motors has officially unveiled all the details of their upcoming 'Seltos Anniversary Edition' SUV in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X