Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీ ఫేవరేట్ మోడల్ ఏంటి?
భారత్‌లో గడచిన అక్టోబర్ 2020 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో టాప్ టెన్ స్థానాల్లో ఏడు స్థానాలను మారుతి సుజుకి వాహనాలే ఆక్రమించడం విశేషం. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఈసారి, టాప్ 1 కారుగా నిలిచింది.

గత అక్టోబర్ నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ అత్యధికంగా అమ్మకాల గణాంకాలను నమోదు చేసి, ‘భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు' టైటిల్ నిలుపుకుంది. గత నెలలో 24,589 యూనిట్ల స్విఫ్ట్ కార్లు అమ్ముడుగా, అంతకు ముందు నెలలో (సెప్టెంబర్ 2020లో) వీటి సంఖ్య 22,643 యూనిట్లుగా నమోదైంది.

ఈ జాబితాలో టాప్ 2 స్థానంలో ఉన్న మోడల్ మారుతి సుజుకి బాలెనో. గత అక్టోబర్ 2020లో బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల సంఖ్య 21,971 యూనిట్లుగా నమోదైంది. సెప్టెంబర్ 2020లో ఇది 19,000 యూనిట్లుగా నమోదైంది. బాలెనో మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, దీనిని నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న మోడల్. అక్టోబర్ 2020 నెలలో మారుతి సుజుకి అత్యధికంగా 18,703 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. అమ్మకాల పరంగా వ్యాగన్ఆర్, మారుతి ఆల్టో మోడల్‌ను అదిగమించి మూడవ స్థానానికి చేరుకుంది. గడచిన సెప్టెంబరులో ఆల్టో మూడవ స్థానంలో నిలిచింది.

దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు దక్కించుకున్న మారుతి సుజుకి ఆల్టో, ఇప్పుడు అమ్మకాల పరంగా వెనుకపడినట్లుగా తెలుస్తోంది. ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ గడచిన సెప్టెంబరులో స్విఫ్ట్ మరియు బాలెనో చేతిలో ఓడిపోయిన తరువాత, ఇప్పుడు వ్యాగన్ఆర్ చేతిలో కూడా ఓడిపోయింది. అక్టోబర్ 2020 నెలలో మొత్తం 17,850 ఆల్టో కార్లు అమ్ముడై నాల్గవ స్థానంలో నిలిచింది.
MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా

కాగా, ఈ జాబితాలో టాప్-5 స్థానాన్ని కూడా మారుతి సుజుకినే దక్కించుకుంది. ఇందులో స్విఫ్ట్ తోబుట్టువైన స్విఫ్ట్ డిజైర్ ఈ స్థానాన్ని ఆక్రమించింది. మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్-సెడాన్‌గా కొనసాగుతోంది. అక్టోబర్ 2020లో 17,675 స్విఫ్ట్ డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి.
Rank | Model | October 2020 |
1 | Maruti Swift | 24,589 |
2 | Maruti Baleno | 21,971 |
3 | Maruti Wagon-R | 18,703 |
4 | Maruti Alto | 17,850 |
5 | Maruti Dzire | 17,675 |
6 | Hyundai Creta | 14,023 |
7 | Hyundai Grand i10 | 14,003 |
8 | Maruti Eeco | 13,309 |
9 | Maruti Brezza | 12,087 |
10 | Kia Sonet | 11,721 |
పట్టిక మూలం: Autopunditz.com

ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ క్రెటా. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదలైన సరికొత్త క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా కొనసాగుతోంది. అక్టోబర్ నెలలో 14,023 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. అత్యధిక అమ్మకాలతో క్రెటా మరోసారి టాప్-10 జాబితాలో తన స్థానాన్ని నిలుపుకుంది.
MOST READ:అక్టోబర్‌లో అదరగొట్టిన యమహా.. టూవీలర్ అమ్మకాల్లో 31 శాతం వృద్ధి!

ఇకపోతే, హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 గ్రాండ్ / నియోస్ మోడల్ ఈ జాబితాలో 7వ స్థానంలో కొనసాగుతోంది. హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్, గ్రాండ్ మరియు నియోస్ మోడళ్లను కలిగి ఉంది. గడచిన అక్టోబర్ నెలలో ఇవి రెండూ కలిసి 14,003 యూనిట్లు అమ్ముడయ్యాయి.

కాగా, ఈ జాబితాలో ఎనిమిదవ మరియు తొమ్మిదవ స్థానాలను తిరిగి మారుతి సుజుకి బ్రాండే దక్కించుకుంది. ఇందులో వరుసగా ఈకో మరియు విటారా బ్రెజ్జా మోడళ్లు 8, 9 స్థానాలను దక్కించుకున్నాయి. గడచిన అక్టోబర్ 2020లో 13,309 యూనిట్ల మారుతి ఈకో వాహనాలు అమ్ముడుపోగా, 12,087 యూనిట్ల విటారా బ్రెజ్జా కాంపాక్ట్-ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.
MOST READ:దేశీయ మార్కెట్లో టీవీఎస్ అపాచీ RTR 200 4V బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఇక ఈ జాబితాలో తుది స్థానాన్ని, అంటే 10వ స్థానాన్ని దక్కించుకుంది, ఇటీవలే మార్కెట్లో విడుదలైన కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ.భారత మార్కెట్లో కియా మోటార్స్‌కు సోనెట్ మొట్టమొదటి కాంపాక్ట్-ఎస్‌యూవీ. గత అక్టోబర్ 2020లో కియా మోటార్స్ మొత్తం 11,721 సోనెట్ కార్లను విక్రయించింది.

అక్టోబర్ 2020లో టాప్-10 కార్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మరోసారి కూడా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్ టైటిల్‌ను నిలుపుకుంది. అయితే, ఈ జాబితాలో హైలైట్ ఏంటంటే, ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మోడల్ కియా సోనెట్ వచ్చి చేరడం. ప్రస్తుతం మార్కెట్లో పండుగ సీజన్ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో మరిన్ని అమ్మకాలు నమోదు కాగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు.