నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో గడచిన డిసెంబర్ 2020 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితా విడుదలైంది. ఈసారి కూడా ఈ జాబితాలో టాప్ టెన్ స్థానాల్లో ఏడు స్థానాలను మారుతి సుజుకి వాహనాలే దక్కించుకున్నాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఈసారి కూడా తన అగ్రస్థానాన్ని అలానే నిలుపుకుంది.

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

గత నవంబర్ నెలలో మారుతి సుజుకి స్విఫ్ట్ అత్యధికంగా అమ్మకాల గణాంకాలను నమోదు చేసి, ‘భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారు' టైటిల్ నిలుపుకుంది. గత నెలలో 18,498 స్విఫ్ట్ కార్లు అమ్ముడవగా, అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 19,314 యూనిట్లుగా ఉండి 4 శాతం క్షీణతను నమోదు చేసింది.

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

ఈ జాబితాలో టాప్ 2 స్థానంలో ఉన్న మోడల్ మారుతి సుజుకి బాలెనో. గత నవంబర్ 2020లో బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల సంఖ్య 17,872 యూనిట్లుగా నమోదైంది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 18,047 యూనిట్లుగా ఉండి 1 శాతం క్షీణతను నమోదు చేసింది. బాలెనో మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, దీనిని నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

Rank Model Nov-20 Nov-19 Growth (%)
1 Maruti Swift 18,498 19,314 -4
2 Maruti Baleno 17,872 18,047 -1
3 Maruti WagonR 16,256 14,650 11
4 Maruti Alto 15,321 15,086 2
5 Maruti Dzire 13,536 17,659 -23
6 Hyundai Creta 12,017 6,684 80
7 Kia Sonet 11,417 - -
8 Maruti Eeco 11,183 10,162 10
9 Hyundai Grand i10 10,936 10,186 7
10 Maruti Ertiga 9,557 7,537 27

MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న మోడల్. నవంబర్ 2020 నెలలో మారుతి సుజుకి అత్యధికంగా 16,256 యూనిట్ల వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 14,650 యూనిట్లుగా ఉండి 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల పరంగా వ్యాగన్ఆర్, మారుతి ఆల్టో మోడల్‌ను అదిగమించి మూడవ స్థానానికి చేరుకుంది.

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా పేరు దక్కించుకున్న మారుతి సుజుకి ఆల్టో, ఇప్పుడు అమ్మకాల పరంగా నాల్గవ స్థానానికి పడిపోయింది. ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ గడచిన నవంబర్ 2020లో స్విఫ్ట్, బాలెనో మరియు వ్యాగన్ఆర్ చేతిలో ఓడిపోయి నాల్గవ స్థానానికి పడిపోయింది. గత నెలలో కంపెనీ మొత్తం 15,321 ఆల్టో కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 15,086 యూనిట్లుగా ఉండి 2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MOST READ:ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

కాగా, ఈ జాబితాలో టాప్-5 స్థానాన్ని కూడా మారుతి సుజుకి వాహనమేనే దక్కించుకుంది. ఇందులో స్విఫ్ట్ తోబుట్టువైన స్విఫ్ట్ డిజైర్ ఈ స్థానాన్ని ఆక్రమించింది. మారుతి సుజుకి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్-సెడాన్‌గా కొనసాగుతోంది. గడచిన నవంబర్ 2020లో 13,536 స్విఫ్ట్ డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 17,659 యూనిట్లుగా ఉండి 23 శాతం క్షీణతను నమోదు చేసింది.

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

ఈ జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ క్రెటా. ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో విడుదలైన సరికొత్త క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా కొనసాగుతోంది. నవంబర్ 2020లో మొత్తం 12,017 క్రెటా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 6,684 యూనిట్లుగా ఉండి 80 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

నవంబర్ 2020 టాప్-10 కార్ల జాబితాలో తాజాగా వచ్చి చేరింది కియా సోనెట్. ఇటీవలే మార్కెట్లో విడుదలైన కియా సోనెట్, భారత మార్కెట్లో కియా మోటార్స్‌కు మొట్టమొదటి కాంపాక్ట్-ఎస్‌యూవీ. గత నవంబర్ 2020లో కియా మోటార్స్ మొత్తం 11,417 సోనెట్ కార్లను విక్రయించింది. సోనెట్ ద్వారా కియా మోటార్స్ టాప్-10 కార్ల జాబితాలోకి వచ్చి చేరింది.

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

ఈ జాబితాలో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివి. గడచిన నవంబర్ 2020లో కంపెనీ మొత్తం 11,183 ఈకో వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 10,162 యూనిట్లుగా ఉండి 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.

MOST READ:బెంగళూరులో అమలుకానున్న కొత్త పార్కింగ్ విధానం : పూర్తి వివరాలు

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

ఇకపోతే, హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 గ్రాండ్ మోడల్ ఈ జాబితాలో 9వ స్థానంలో కొనసాగుతోంది. హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ లైనప్‌లో గ్రాండ్ మరియు నియోస్ మోడళ్లు అమ్మకానికి ఉన్నాయి. గడచిన నవంబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 10,936 ఐ10 కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 10,186 యూనిట్లుగా ఉండి 7 శాతం వృద్ధిని నమోదు చేసింది.

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

ఈ జాబితాలో టాప్-10 స్థానంలో ఉన్నది మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి. గడచిన నవంబర్ 2020 నెలలో మారుతి సుజుకి మొత్తం 9,557 ఎర్టిగా వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) వీటి సంఖ్య 7,537 యూనిట్లుగా ఉండి 27 శాతం వృద్ధిని నమోదు చేసింది.

నవంబర్ 2020లో టాప్ 10 కార్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన మోడల్ ఏది?

నవంబర్ 2020లో టాప్-10 కార్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎప్పటి లాగే ఈసారి కూడా టాప్-10 కార్ల జాబితాలో మారుతి సుజుకినే అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో మొదటి ఐదు కార్లు మారుతి సుజుకి బ్రాండ్‌కి చెందినవే కావటం విశేషం. ఇకపోతే, ఈ టాప్-10 జాబితాలోకి కొత్తగా విడుదలైన కియా సోనెట్ వచ్చి చేరటాన్ని చూస్తుంటే, ఈ మోడల్‌పై కస్టమర్లు చూపుతున్న ఆదరణ ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

Most Read Articles

English summary
Top 10 Best Selling Cars In November 2020, Maruti Suzuki Takes Lead In The List Followed By Hyundai. Read In Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X