భారతదేశంలో అతి తక్కువ ధర కల్గిన టాప్ 5 సిఎన్‌జి కార్లు

భారతదేశంలో రోజు రోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా సిఎన్‌జి కార్ల డిమాండ్ పెరుగుతోంది. డీజిల్ మరియు పెట్రోల్ ధరల మధ్య రోజూ కొంత వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. ఈ ఇంధనాల ధరలు పెరుగుతున్నందున రాబోయే సంవత్సరాల్లో సిఎన్‌జి ప్యాసింజర్ వాహనాల డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్లు స్వతంత్ర మరియు ప్రొఫెషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్ఎ లిమిటెడ్ తెలిపింది.

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమలులో ఉన్నందున, భారతదేశంలో ఎంట్రీ లెవల్ మరియు కాంపాక్ట్ కార్లలో ఎక్కువ భాగం ఇప్పుడు పెట్రోల్ మరియు సిఎన్‌జి ఎంపికలతో మాత్రమే అందించబడుతున్నాయి. మన దేశంలో వాహనదారులు ఎంచుకోదగిన 8 లక్షల లోపు ధర కలిగిన 5 సిఎన్‌జి కార్లను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

1. గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జి :

గ్రాండ్ ఐ 10 నియోస్‌ను గతేడాది భారత మార్కెట్లో గ్రాండ్ ఐ 10 వారసుడిగా లాంచ్ చేయబడింది. ఈ మోడల్ యొక్క సిఎన్‌జి వేరియంట్ ఈ సంవత్సరంలోనే ప్రారంభించబడింది. ఇందులో మొత్తం నాలుగు ఇంజిన్ ఆప్సన్లు ఉంటాయి. అవి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ డీజిల్; 1.0-లీటర్ టర్బో పెట్రోల్; అలాగే 1.2-లీటర్ పెట్రోల్ సిఎన్‌జి.

MOAT READ:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

సిఎన్‌జి వేరియంట్ మాగ్నా, స్పోర్ట్జ్ అనే రెండు వేరియంట్‌లతో అందిస్తున్నారు. వీటి ధరలు వరుసగా రూ. 6.64 లక్షలు, రూ. 7.18 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇందులో ఉన్న 1.2 లీటర్ పవర్‌ట్రైన్ 69 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 95 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

2. మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి :

సెలెరియో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ కాకపోవచ్చు, కానీ ఇది చాలా సాధారణ స్థాయిలో విక్రయించబడుతోంది.

MOST READ:వికాస్ దూబే ఎన్ కౌంటర్ తర్వాత మహీంద్రా కార్స్ భద్రతపై డౌట్స్, ఎందుకో మీరే చూడండి ?

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

సెలెరియో బిఎస్-6 కంప్లైంట్ 998 సిసి త్రీ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో సిఎన్‌జి రెండు వేరియంట్‌లతో అందిస్తుంది. అవి మిడ్-స్పెక్ విఎక్స్ఐతో పాటు విఎక్స్ వి (ఓ). వీటి ధరలు వరుసగా రూ. 5.6 లక్షలు, రూ. 5.68 లక్షలు (ఎక్స్-షోరూమ్).

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

3. హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి :

హ్యుందాయ్ ఆరా గ్రాండ్ ఐ 10 నియోస్ సెడాన్ మాదిరిగా ఉంటుంది. అంతే కాకుండా గ్రాండ్ ఐ 10 నియోస్ మాదిరిగానే ఇంజన్ ఎంపికలను కూడా కలిగి ఉంటుంది. గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జికి భిన్నంగా ఇది రెండు వేర్వేరు ట్రిమ్‌లలో అందించబడుతుంది. , హ్యుందాయ్ ఆరా మాత్రం ఒకే సిఎన్‌జి వేరియంట్‌ను కలిగి ఉంటుంది.

MOAT READ:మీ తల్లిదండ్రులు లేదా పిల్లల కారును ఉచితంగా శానిటైజ్ చేసే 'ఎమ్‌జి-సేవా'

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

4. హ్యుందాయ్ సాంట్రో సిఎన్‌జి :

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించిన మొట్టమొదటి కారు సాంట్రో. అయితే పెరుగుతున్న పోటీ కారణంగా 2014 లో నిలిపివేయబడింది. కానీ సాంట్రో నేమ్‌ప్లేట్‌తో ముందుకు తీసుకురావడానికి హ్యుందాయ్ తిరిగి దేశానికి థర్డ్-జెన్ మోడల్‌ను 2018 లో ప్రారంభించింది.

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

ఈ సాంట్రో కారు 1.1 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 69 పిఎస్ పవర్ మరియు 99 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయినప్పటికీ, సిఎన్‌జి కిట్‌తో ఉన్నప్పుడు, శక్తి మరియు టార్క్ గణాంకాలు వరుసగా 60 పిఎస్ మరియు 85 ఎన్‌ఎమ్‌లకు వస్తాయి.

MOAT READ:2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

హ్యుందాయ్ సాంట్రో - మాగ్నా యొక్క రెండు సిఎన్‌జి వేరియంట్ల ధర రూ. 5.84 లక్షలు. అదే విధంగా స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 6.2 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్).

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

5. మారుతి సుజుకి వాగన్ ఆర్ సిఎన్‌జి :

భారత మార్కెట్లో మారుతి సుజుకి వాగన్ ఆర్ గత కొంతకాలంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. మరియు ఎయిర్ పోర్ట్ సర్వీస్ లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

మారుతి సుజుకి ప్రస్తుతం వాగన్ ఆర్ 1.0-లీటర్ మూడు సిలిండర్ మరియు 1.2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌లతో అందిస్తోంది. అయితే సిఎన్‌జి వేరియంట్ ని మునుపటి ఎంపికగానే అందిస్తున్నారు. పెట్రోల్ సిఎన్‌జి పవర్ట్రెయిన్ యొక్క అవుట్పుట్ గణాంకాలు 60 పిఎస్ మరియు 78 ఎన్ఎమ్ వద్ద ఉన్నాయి.

భారతదేశంలో 8 లక్షల లోపు ఉన్న టాప్ 5 సిఎన్‌జి కార్లు

మారుతి సుజుకి వాగన్ ఆర్ సిఎన్‌జిని రెండు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒకటి బేస్ LXi ట్రిమ్, రెండవది LXi (ఓ). వీటి ధరలు వరుసగా రూ. 5.25 లక్షలు మరియు రూ. 5.32 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Most Read Articles

English summary
Top 5 CNG Cars In India Under Rs 8 Lakh – Hyundai Aura To Maruti Wagon R. Read in Telugu.
Story first published: Saturday, July 11, 2020, 14:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X